సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రైవేటు ఎఫ్.ఎం. రేడియో మూడోదశ స్టేషన్ల, మూడో బ్యాచ్ ఇ-వేలానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ
Posted On:
15 OCT 2024 4:49PM by PIB Hyderabad
రేడియో స్టేషన్ల ప్రసార పరిధిలోకి రాని 234 కొత్త నగరాల్లో, 730 ప్రైవేటు రేడియో ఛానళ్ళ ఏర్పాటు నిమిత్తం, ఎఫ్.ఎం. రేడియో మూడోదశ స్టేషన్ల, మూడో బ్యాచ్ ఇ-వేలానికి, ఆసక్తిగలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
ఆయా నగరాల్లో ఎఫ్.ఎం ఛానళ్ళ వార్షిక లైసెన్స్ ఫీజు కింద, జీఎస్టీని మినహాయించి, స్థూల ఆదాయంలో 4 శాతాన్ని వసూలు చేస్తారు. 2022లో ట్రాయ్ సిఫార్సు చేసిన కనీస రుసుముని కొనసాగిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 18 తుది గడువు.
సమాచార ప్రసార శాఖ వెబ్ సైటులో పొందుపరచిన ప్రకటన పూర్తి పాఠం, ఎఫ్.ఎం. మూడో దశ మార్గదర్శక సూత్రాల కోసం లింక్ ను ఇక్కడ అనుసరించండి.
***
(Release ID: 2065177)
Visitor Counter : 42