సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉద్యోగుల ఆన్‌లైన్ అభ్యాసాన్ని సులభతరం చేయడం కోసం ఐజీఓటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

Posted On: 15 OCT 2024 6:11PM by PIB Hyderabad

మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులందరికీ ఆన్లైన్ అభ్యాసాన్ని సులభతరం చేయడం కోసం ఐజీఓటీ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని కేంద్ర సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రిత్వ శాఖను ఆదేశించారుమంత్రిత్వ శాఖ వార్షిక కెపాసిటీ బిల్డింగ్ క్యాలెండర్ఐజీఓటీ పోర్టల్‌లో ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ స్థితి గురించి సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాత ఇది మొదలుకానున్నది.

సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఇతర సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ ఈనెల 19లోగా మంత్రిత్వ శాఖ ఉద్యోగులందరూ ఐజీఓటీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆదేశించారుసిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం బడ్జెట్ మేనేజ్‌మెంట్జెండర్ సెన్సిటైజేషన్లీడర్‌షిప్టీమ్ బిల్డింగ్‌తో సహా 16 కోర్సుల ఎంపికను మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది.

భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికిప్రతి త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో కోర్సులు పూర్తి చేసిన ఉద్యోగులను సత్కరించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించిందిఅన్ని మీడియా విభాగాలలో మంత్రిత్వ శాఖ అభ్యసన ప్రణాళికనుశాఖాపరమైన వ్యూహాల గురించి తెలియజేయడం కోసం కార్యగోష్ఠి నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

మంత్రిత్వ శాఖ ద్వారా ఫిర్యాదులుఆర్‌టీఐ దరఖాస్తుల నిర్వహణ గురించి కూడా మంత్రి సమీక్షించారుపారదర్శకతజవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అన్ని కేసులను సకాలంలో పరిష్కరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

 

***


(Release ID: 2065120) Visitor Counter : 61