హోం మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 15న న్యూఢిల్లీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో కేంద్ర హోం, సహకారశాఖల మంత్రి, శ్రీ అమిత్ షా భేటీ
తమ శిక్షణ అనుభవాలను మంత్రితో పంచుకోనున్న ప్రొబేషన్ అధికారులు
2047 కల్లా అభివృద్ధి సాధించిన దేశంగా భారత్ ను మలచాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధ్యేయాన్ని సాకారం చేయడంలో యువ పోలీసు అధికారుల పాత్ర కీలకం
దేశ అంతర్గత భద్రత సవాళ్ళను అధిగమించడంలో ప్రొబేషనరీ అధికారులకు హోం మంత్రి మార్గదర్శనం
Posted On:
14 OCT 2024 4:09PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా, అక్టోబర్ 15, మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో, శిక్షణ పొందుతున్న ’76 ఆర్.ఆర్. (సాధారణ ప్రవేశం పొందిన) బ్యాచ్’ ఐపీఎస్ అధికారులను కలుసుకుంటారు. ఈ భేటీ లో భాగంగా 2023 బ్యాచ్ కు చెందిన వీరంతా తమ శిక్షణ అనుభవాలను మంత్రితో పంచుకుంటారు.
2047 నాటికల్లా భారత్ ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధ్యేయాన్ని సాకారం చేయడంలో యువ పోలీసు అధికారుల పాత్ర ఎంతో కీలకమైనది. కార్యక్రమంలో భాగంగా, దేశ అంతర్గత భద్రత సవాళ్ళను అధిగమించడంలో ప్రొబేషనరీ అధికారులకు హోం మంత్రి మార్గనిర్దేశం చేస్తారు.
2023 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన 54 మంది మహిళా అధికారులు సహా మొత్తం 188 మంది తొలి దశ ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఢిల్లీలోని కేంద్రీయ సాయుధ పోలీసు దళం-సీఏపీఎఫ్, కేంద్రీయ పోలీసు సంస్థలు-సీపీఓ వంటి సంస్థల్లో రెండు వారాల శిక్షణ అనంతరం వీరంతా వారివారి ప్రత్యేక విభాగాల్లో 29 వారాల అభ్యాసాలతో కూడిన జిల్లా స్థాయి శిక్షణలో పాల్గొంటారు.
***
(Release ID: 2064718)
Visitor Counter : 51