ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంగ్ల అనువాదం: లావో‌స్‌లోని వియాంటియాన్‌లో జరుగుతోన్న 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 11 OCT 2024 11:49AM by PIB Hyderabad

గౌరవనీయులారా!

నమస్కారం.

ముందుగా 'యాగితుఫాను బాధితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానుఈ క్లిష్ట సమయంలో ఆపరేషన్ సద్భావ్ ద్వారా మానవతా సాయాన్ని అందించాం.

మిత్రులారా,

ఆసియాన్ ఐక్యత కోసంప్రాంతీయంగా అది ప్రధాన శక్తిగా ఎదిగేందుకు భారత్ నిరంతరం మద్దతిస్తోందిభారత్ ఇండో-పసిఫిక్ దార్శనికతక్వాడ్ సహకారానికి ఆసియాన్ కీలకంభారత్ తీసుకున్న "ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం", "ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథంమధ్య చాలా సారూప్యతలు ఉన్నాయిఈ మొత్తం ప్రాంతంలో శాంతి నెలకొనడంతోపాటు అభివృద్ధి జరగడానికి స్వేచ్ఛఅరమరికలులేనిసమ్మిళితఅభ్యున్నతి దిశగాపద్ధతితో కూడిన ఇండో-పసిఫిక్ కార్యక్రమాలు ఉండాలి.

దక్షిణ చైనా సముద్రంలో శాంతిభద్రతసుస్థిరత నెలకొనడం...  మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంత ప్రయోజనాల్లో చాలా ముఖ్యం.

యూఎన్‌సీఎల్‌ఓఎస్‌’కు అనుగుణంగా సముద్రయాన కార్యకలాపాలు నిర్వహించాలని మేం కోరుకుంటున్నాంనావిగేషన్గగనతల స్వేచ్ఛను నిర్ధారించుకోవటం చాలా అవసరంపటిష్ఠమైనసమర్థవంతమైన ప్రవర్తనా నియమావళిని తయారు చేసుకోవాలిఅలాగే ఇది ఈ ప్రాంత దేశాల విదేశీ విధానాలపై ఆంక్షలు విధించకూడదు.


 

మన విధానం విస్తరణవాదం కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.

మిత్రులారా,

మయన్మార్‌లో పరిస్థితిపై ఆసియాన్ విధానాన్ని మేం సమర్థిస్తున్నాంఈ విషయంలో అంగీకరించిన అయిదు అంశాలకూ మద్దతిస్తున్నాంమానవతా సహాయాన్ని కొనసాగించడంప్రజాస్వామ్య పునరుద్ధరణకు తగిన చర్యలను తీసుకోవటం చాలా ముఖ్యమని మేం విశ్వసిస్తున్నాంఈ ప్రక్రియలో మయన్మార్‌ను ఏకాకిని చేయకుండా, దానిని విశ్వాసంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం

పొరుగుదేశంగా భారత్ తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటుంది.


 

మిత్రులారా,

ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా నష్టపోతున్నది అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్దేశాలే. యురేషియామధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతిసుస్థిరతను పునరుద్ధరించాలనే అందరూ కోరుకుంటున్నారు.
నేను బుద్ధుడు పుట్టిన దేశం నుండి వచ్చానుఇది యుద్ధ యుగం కాదని నేను పదేపదే చెబుతుంటానుయుద్ధభూమిలో సమస్యలకు పరిష్కారాలు దొరకవు.

సార్వభౌమాధికారంప్రాదేశిక సమగ్రతఅంతర్జాతీయ చట్టాలను గౌరవించడం చాలా అవసరంమానవతా దృక్పథంతో చర్చలుదౌత్యానికి పెద్దపీట వేయాలి.

విశ్వబంధుగా తన బాధ్యతలను నిర్వర్తించడంలోఈ దిశలో తన వంతు సహకారం అందించడానికి భారతదేశం అన్ని  ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.

ఉగ్రవాదం ప్రపంచ శాంతి భద్రతలకు పెను సవాలు విసురుతోందిదీన్ని ఎదుర్కోవాలంటే మానవత్వాన్ని విశ్వసించే శక్తులు ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేయాలి.

సైబర్సముద్రఅంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి.


 

మిత్రులారా,

తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో మేం నలంద పునరుద్ధరణకు సంబంధించిన వాగ్దానం చేశాంఈ జూన్ లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభించడం ద్వారా దాన్ని నెరవేర్చాంనలందలో జరిగే 'ఉన్నత విద్యా సారథుల సదస్సు (హెడ్స్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్) 'లో పాల్గొనాలని నేను ఇక్కడ ఉన్న అన్ని దేశాలను ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా,

తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు భారతదేశ తూర్పు దేశాల ప్రాధాన్య (యాక్ట్ ఈస్ట్) విధానంలో కీలకం.

నేటి శిఖరాగ్ర సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ప్రధాన మంత్రి సోనెక్సే సిఫాండోన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

తదుపరి అధ్యక్షత బాధ్యతలు నిర్వహించనున్న మలేషియాకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నానుబాధ్యతలను విజయవంతంగా నెరవేర్చేందుకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని నేను హామీ ఇస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి దగ్గరి అనువాదం.

 

***



(Release ID: 2064141) Visitor Counter : 8