మంత్రిమండలి
                
                
                
                
                
                    
                    
                        రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                09 OCT 2024 4:20PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రూ.4,406 కోట్ల పెట్టుబడితో 2,280 కి.మీ. రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 
దేశంలోని ఇతర ప్రాంతాలలో మాదిరిగానే సరిహద్దు ప్రాంతాలలో కూడా సౌకర్యాల కల్పనతో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న విధానానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఈ నిర్ణయం రోడ్డు, టెలీకమ్యూనికేషన్ల అనుసంధానం, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య సౌకర్యాల వృద్ధిపై  ఎంతో ప్రభావం చూపనుంది. ఇది గ్రామీణ జీవనోపాధిని పెంచడంతోపాటు, ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇంకా ఈ ప్రాంతాలను మిగిలిన రహదారుల వ్యవస్థతో అనుసంధానం చేస్తుంది.
 
***
                
                
                
                
                
                (Release ID: 2063592)
                Visitor Counter : 106
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam