ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల పెట్టుబడిదారులకు పెట్టుబడి రక్షణను కొనసాగిస్తూ అమల్లోకి వచ్చిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం

Posted On: 07 OCT 2024 9:57AM by PIB Hyderabad

భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశాల మధ్య 2024 ఫిబ్రవరి 13 న యుఎఇలోని అబుదాబిలో కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బిఐటి) 2024 ఆగస్టు 31 నుంచి అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 2013 లో భారత్, యుఎఇ మధ్య సంతకాలు జరిగిన మునుపటి ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక,   రక్షణ ఒప్పందం (బిఐపిఎ) 2024 సెప్టెంబర్ 12 న ముగియడంతో యుఎఇతో ఈ కొత్త బిఐటి అమలు రెండు దేశాల పెట్టుబడిదారులకు పెట్టుబడి రక్షణను కొనసాగిస్తుంది.

ఏప్రిల్ 2000 నుంచి జూన్ 2024 వరకు భారత్ కు వచ్చిన సుమారు 19 బిలియన్ డాలర్ల మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (ఎఫ్ డిఐ ) యుఎఇ 3% వాటాతో ఏడో  అతిపెద్ద వాటాదారుగా  ఉంది. భారత్ కూడా ఏప్రిల్ 2000 నుంచి ఆగస్టు 2024 వరకు యు ఎ ఇ కి వచ్చిన లో 15.26 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 5 శాతం వాటా సమకూర్చింది.

భారత్ – యుఎఇ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బిట్) 2024, పెట్టుబడిదారులకు కనీస మర్యాద ప్రమాణాలను, వివక్ష లేకుండా హక్కుల పరిరక్షణను హామీ ఇవ్వడం ద్వారా వారి సౌలభ్యాన్ని, విశ్వాసాన్ని పెంచుతుందని , మధ్యవర్తిత్వం తో వివాదాల పరిష్కారం కోసం స్వతంత్ర వేదికను అందించడం ద్వారా పెట్టుబడిదారుల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. అయితే, పెట్టుబడిదారులకు,  పెట్టుబడులకు రక్షణ అందించేటప్పుడు ప్రభుత్వ హక్కుకు సంబంధించిన సమతుల్యతను పాటిస్తూ, తగిన నియంత్రణ, విధాన వెసులుబాటును అందిస్తుంది.

బిఐటిపై సంతకం , అమలు - ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి మరింత బలమైన , సుస్థిరమైన పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించడానికి ఇరు దేశాల భాగస్వామ్య నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం ద్వైపాక్షిక పెట్టుబడులను పెంచడానికి, ఇరు దేశాల వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చడానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.

భారత్ – యుఎఇ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం  - 2024 ముఖ్యాంశాలు

పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ కవరేజీతో పెట్టుబడికి క్లోజ్డ్ అసెట్-ఆధారిత నిర్వచనం

న్యాయాన్ని నిరాకరించకుండా, తగిన ప్రక్రియను ఉల్లంఘించకుండా, లక్ష్యం గా చేసుకుని వివక్ష చూపకుండా, దుర్వినియోగం లేదా ఏకపక్షంగా వ్యవహరించకుండా పెట్టుబడి పట్ల బాధ్యతతో వ్యవహరించడం

పన్నులు, స్థానిక ప్రభుత్వం, ప్రభుత్వ సేకరణ, సబ్సిడీలు లేదా గ్రాంట్లు మరియు నిర్బంధ లైసెన్స్ వంటి చర్యలకు పరిధిని ఏర్పరుస్తుంది.

పన్నులకు, స్థానిక ప్రభుత్వానికి, ప్రభుత్వ కొనుగోళ్లకు, సబ్సిడీలకు లేదా అనుమతులకు , తక్షణ లైసెన్స్ కు సంబంధించిన చర్యలకు పరిధిని ఏర్పాటు చేయడం.

మూడేళ్ల తప్పని సరి స్థానిక పరిష్కారాలతో  మధ్యవర్తిత్వం ద్వారా ఇన్వెస్టర్-స్టేట్ డిస్ప్యూట్ సెటిల్ మెంట్ (ఐ ఎస్ డి ఎస్)  

సాధారణ, భద్రత పరంగా మినహాయింపులు

ప్రభుత్వానికి నియంత్రణ హక్కు

అవినీతి, మోసం, రౌండ్ ట్రిప్పింగ్ (ఆస్తుల మార్పు) వంటి వాటితో సంబంధం ఉన్న పెట్టుబడులకు పెట్టుబడిదారులు క్లెయిమ్ చేసే వీలు లేదు

జాతీయ పరిగణన కు వీలు

ఈ ఒప్పందం పెట్టుబడులకు  రక్షణ కల్పిస్తుంది, పారదర్శకత, బదిలీలు , నష్టాలకు పరిహారాన్ని అందిస్తుంది.

భారత్ – యుఎఇ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం  - 2024 ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం వెబ్ సైట్ లో చూడవచ్చు. https://dea.gov.in/sites/default/files/BIT%20MoU%20Engilsh.pdf

 

***



(Release ID: 2063014) Visitor Counter : 24