ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని వాషిమ్‌లో వ్యవసాయ, పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
Posted On:
05 OCT 2024 3:49PM by PIB Hyderabad
దేశం నలుమూలల ను౦చి ఇక్కడకు వచ్చేసిన వారందరికి ధన్యవాదాలు— గౌరవనీయులైన సోదర సోదరీమణులారా! జై సేవాలాల్! జై సేవాలాల్!
మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ గారు.. ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు.. కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్.. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నా సోదరసోదరీమణులు, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదర సోదరీమణులు.. ఇతర గౌరవనీయులైన ప్రముఖులు, మహారాష్ట్ర సోదర సోదరీమణులారా.. ఈ పవిత్ర భూమి వాషిం నుంచి పోహ్రాదేవికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నవరాత్రుల సందర్భంగా ఈ రోజు జగదాంబ అమ్మవారి ఆశీస్సులు పొందే భాగ్యం కలిగింది. సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రాంరావ్ మహారాజ్ సమాధిని సందర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాను. ఈ వేదిక మీద నుంచి ఈ ఇద్దరు మహానుభావులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను.
ఈ రోజు గొప్ప యోధురాలు, గోండ్వానా రాణి రాణి దుర్గావతి గారి జయంతి. గతేడాది ఆమె 500వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుకుంది. రాణి దుర్గావతికి నివాళులు అర్పిస్తున్నాను.
మిత్రులారా,
నేడు హర్యానాలో పోలింగ్ కూడా జరుగుతోంది. హర్యానాలోని దేశభక్తులందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఓటు హర్యానాను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది.
మిత్రులారా,
ఈ పవిత్ర నవరాత్రుల సమయంలో, పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను విడుదల చేసే అవకాశం నాకు లభించింది. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు ఇవాళ బదిలీ చేశాం. మహారాష్ట్ర డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇక్కడి రైతులకు రెట్టింపు ప్రయోజనాలు కల్పిస్తోంది. నమో షెట్కారీ మహాసన్మాన్ యోజన కింద మహారాష్ట్రలోని 90 లక్షల మంది రైతులకు సుమారు రూ.1900 కోట్లు అందాయి. వ్యవసాయం, పశుసంవర్ధక, రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్‌పీఓ) సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను నేడు ప్రజలకు అంకితం చేశాను. పోహరాదేవి ఆశీస్సులతో మహిళా సాధికారత కల్పిస్తున్న లాడ్లీ బెహనా యోజన ద్వారా లబ్ధిదారులకు సాయం అందించే గౌరవం నాకు దక్కింది. మహారాష్ట్ర సోదర సోదరీమణులకు, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు.
గమనిక: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి దగ్గరి అనువాదం. ఆయన వాస్తవ ప్రసంగం హిందీలో ఉంది.
***
(Release ID: 2062657)
Visitor Counter : 43
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam