ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఖాదీ అమ్మకాల్లో కొత్త రికార్డు ప్రోత్సాహకరమైన విజయం: కొనియాడిన ప్రధాన మంత్రి


దేశ ప్రజల్లో స్వదేశీ ధోరణి వేగంగా పెరుగుతోంది: ప్రధాన మంత్రి

Posted On: 05 OCT 2024 2:56PM by PIB Hyderabad

ఖాదీ అమ్మకాల్లో నమోదైన కొత్త రికార్డును ప్రోత్సాహకరమైన విజయంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొనియాడారు. దేశ ప్రజల్లో స్వదేశీ ధోరణి వేగంగా పెరుగుతోందని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఖాదీ ఇండియా చేసిన పోస్టుకు ఆయన స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

"చాలా ప్రోత్సాహకరమైన విజయం! ఖాదీ అమ్మకాల్లో ఈ కొత్త రికార్డు దేశ ప్రజలలో స్వదేశీ ధోరణి ఎంత వేగంగా పెరుగుతోందో తెలియజేస్తోంది. ఖాదీతో అనుబంధం ఉన్న మా చేతివృత్తుల సోదర సోదరీమణుల జీవితాలను సులభతరం చేసే ఈ సెంటిమెంట్ చాలా ముందుకు సాగినందుకు నేను సంతోషిస్తున్నాను.”

 

 

***

MJPS/SR



(Release ID: 2062530) Visitor Counter : 6