ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

3వ కౌటిల్య ఆర్థిక సమ్మేళనం -2024 లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 04 OCT 2024 7:45PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారునిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్ కె సింగ్ గారుఈ సమ్మేళనంలో పాల్గొంటున్న దేశవిదేశాలకు చెందిన ఇతర విశిష్ట అతిథులుమహిళలుపెద్దలు!

 

ఇది కౌటిల్య సమ్మేళనం మూడో సంచికమీ అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందివచ్చే మూడు రోజుల పాటు వివిధ ఆర్థిక అంశాలపై చర్చించేందుకు ఇక్కడ పలు సమావేశాలు జరగనున్నాయిఈ చర్చలు భారత్ వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను.  


 

మిత్రులారా

ప్రపంచంలోని రెండు ప్రధాన ప్రాంతాలు యుద్ధ వాతావరణంలో ఉన్న సమయంలో ఈ మహాసభలు జరుగుతున్నాయిప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఇంధన భద్రత పరంగా ఈ ప్రాంతాలు కీలకంఇంత తీవ్రమైన అంతర్జాతీయ అనిశ్చితి మధ్య, 'భారతీయ శకంగురించి చర్చించడానికి మనం ఇక్కడ సమావేశమవుతున్నాంఈ రోజు భారత్ పై ఉన్న నమ్మకం అద్వితీయమైనదని దీన్ని బట్టి అర్థమవుతోందిభారత్ ఆత్మవిశ్వాసం అసాధారణమని ఇది రుజువు చేస్తోంది

మిత్రులారా

నేడుభారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థభారత్ ప్రస్తుతం జిడిపి పరంగా అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందిగ్లోబల్ ఫిన్ టెక్ అడాప్షన్ రేట్ల పరంగా మనం నంబర్ వన్ గా ఉన్నాంప్రస్తుతం స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో మనం నెంబర్ వన్ గా ఉన్నాంప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగ వ్యవస్థ మనదేప్రపంచంలోని వాస్తవ డిజిటల్ లావాదేవీల్లో సగానికిపైగా భారత్ లోనే జరుగుతున్నాయిభారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థను కలిగి ఉందిపునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉందితయారీ విషయానికి వస్తేభారత్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుద్విచక్ర వాహనాలుట్రాక్టర్ల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందిఅంతే కాదుభారత్ ప్రపంచంలోనే అతి పిన్న దేశంశాస్త్రవేత్తలుసాంకేతిక నిపుణుల వనరులున్న మూడో అతి పెద్ద దేశం కూడా మనదేసైన్స్టెక్నాలజీఇన్నోవేషన్ ఏదైనా సరే భారత్ స్పష్టంగా ఒక అనుకూల స్థానంలో ఉంది.

మిత్రులారా

'సంస్కరణపనితీరుపరివర్తనఅనే మంత్రాన్ని అనుసరిస్తూ దేశాన్ని శరవేగంగా ముందుకు నడిపించేందుకు నిరంతరం నిర్ణయాలు తీసుకుంటున్నాంఈ ప్రభావమే 60 ఏళ్ల తర్వాత భారత ప్రజలు వరుసగా మూడోసారి ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి దారితీసిందిప్రజల జీవితాలు మారినప్పుడుదేశం సరైన మార్గంలో పయనిస్తోందనే నమ్మకం వారిలో కలుగుతుందిఈ భావన భారత ప్రజల తీర్పులో ప్రతిబింబించింది. 140 కోట్ల మంది పౌరుల విశ్వాసం ఈ ప్రభుత్వానికి గొప్ప ఆస్తి.

భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం మా నిబద్ధతమా మూడో పదవీ కాలం మొదటి మూడు నెలల్లో మేం చేసిన పనిలో మీరు ఈ నిబద్ధతను చూడవచ్చుసాహసోపేతమైన విధాన మార్పులుఉద్యోగాలు నైపుణ్యాల పట్ల బలమైన నిబద్ధతసుస్థిర వృద్ధి ఆవిష్కరణలపై దృష్టిఆధునిక మౌలిక సదుపాయాలుజీవన నాణ్యత వేగవంతమైన వృద్ధి కొనసాగింపు మా మొదటి మూడు నెలల విధానాలలో ప్రతిబింబిస్తాయిఈ కాలంలో 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన నిర్ణయాలు తీసుకున్నాంఈ మూడు నెలల్లోనే భారత్ లో అనేక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయిదేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక కేంద్రాలు (ఇండస్ట్రియల్ నోడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాంఅదనంగా కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాం

మిత్రులారా

భారతదేశం వృద్ధి కథలో మరొక ముఖ్యమైన అంశం దాని సమ్మిళిత స్ఫూర్తిఒకప్పుడు వృద్ధితో పాటు అసమానతలు వస్తాయని భావించేవారుకానీ భారత్ లో అందుకు విరుద్ధంగా జరుగుతోందివృద్ధితో పాటు భారత్ లో సమ్మిళిత కూడా చోటు చేసుకుంటోందిఫలితంగా గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారుభారత్ శరవేగంగా పురోగమించడంతో పాటు అసమానతలు తగ్గి అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నాం

మిత్రులారా

భారత్ వృద్ధి అంచనాలపై విశ్వాసం కూడా మనం ఏ దిశలో పయనిస్తున్నామో తెలియజేస్తుందిఇటీవలి వారాలునెలల డేటాలో మీరు దీనిని చూడవచ్చుగత ఏడాది మన ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందిప్రపంచ బ్యాంకు అయినాఐఎంఎఫ్ అయినామూడీస్ అయినా భారత్ పై తమ అంచనాలను నవీకరించాయి.  ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ 7+ రేటుతో వృద్ధి చెందుతుందని ఈ సంస్థలన్నీ చెబుతున్నాయిఅంతకంటే మెరుగ్గా రాణిస్తామనే నమ్మకం మన భారతీయులకు ఉంది.

మిత్రులారా

భారత్ పై ఈ నమ్మకం వెనుక బలమైన కారణాలు ఉన్నాయిఉత్పాదక రంగం అయినాసేవారంగమైనా నేడు ప్రపంచం భారత్ ను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా చూస్తోందిఇది యాదృచ్ఛికం కాదుగత పదేళ్లలో అమలు చేసిన పెద్ద సంస్కరణల ఫలితమేఈ సంస్కరణలు భారత్ స్థూల ఆర్థిక మౌలికాంశాలను మార్చివేశాయిభారత్‌ బ్యాంకింగ్‌ సంస్కరణలు కేవలం బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను బలపరచడమే కాకుండావాటి రుణాల మంజూరు సామర్థ్యాన్ని కూడా పెంచడం ఇందుకు ఉదాహరణఅదేవిధంగాజీఎస్టీ వివిధ కేంద్ర రాష్ట్ర పరోక్ష పన్నులను ఏకీకృతం చేసిందిదివాలా చట్టం (ఐబిసిబాధ్యతరికవరీ పరిష్కారాల కొత్త క్రెడిట్ సంస్కృతిని అభివృద్ధి చేసిందిగనులురక్షణఅంతరిక్షం వంటి రంగాలు ప్రైవేటు సంస్థలకుమన యువ పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరిచాయిప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఎఫ్డీఐ విధానాన్ని సరళీకరించాంరవాణా ఖర్చులు సమయాన్ని తగ్గించడానికి మేం ఆధునిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నాంగత దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను గణనీయంగా పెంచాం.

మిత్రులారా

భారత్ ప్రభుత్వంలో కొనసాగుతున్న కార్యక్రమాల్లో సంస్కరణల ప్రక్రియను సమగ్రంగా చేర్చాం. 40,000కి పైగా నిర్బంధ షరతులను తొలగించాంకంపెనీల చట్టాన్ని నేరరహితం చేశాంగతంలో వ్యాపార కార్యకలాపాలను క్లిష్టతరం చేసిన అనేక నిబంధనలను సవరించాంకంపెనీలకు అనుమతులు పొందడంప్రారంభించడంమూసివేయడం వంటి ప్రక్రియలను సులభతరం చేయడానికి జాతీయ సింగిల్ విండో వ్యవస్థ అందుబాటులో ఉందిఇప్పుడురాష్ట్ర స్థాయిలో సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నాం

మిత్రులారా

తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ ఐను ప్రవేశ పెట్టాందీని ప్రభావం ఇప్పుడు అనేక రంగాల్లో కనిపిస్తోందిగత మూడేళ్లలో పీఎల్ఐ సుమారు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందిదీంతో ఉత్పత్తివిక్రయాలు సుమారు రూ.11 లక్షల కోట్లు  పెరిగాయిఅంతరిక్షంరక్షణ రంగాల్లోనూ భారత్ గణనీయమైన  ప్రగతిని సాధించింది. ఈ రంగాలలో అవకాశాలు ఇటీవలే వచ్చినప్పటికీ అంతరిక్ష రంగంలో ఇప్పటికే 200కు పైగా స్టార్టప్ లు ఆవిర్భవించాయిప్రస్తుతం దేశంలోని మొత్తం రక్షణ ఉత్పత్తుల్లో మన ప్రైవేటు రక్షణ సంస్థల వాటా 20 శాతంగా ఉంది.

మిత్రులారా


 

ఎలక్ట్రానిక్స్ రంగం వృద్ధి మరింత చెప్పుకోదగినదిసరిగ్గా 10 సంవత్సరాల క్రితంభారత్  మొబైల్ ఫోన్లను ఎక్కువగా దిగుమతి చేసుకునేదిప్రస్తుతం భారత్ లో 33 కోట్లకుపైగా మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయినిజానికి మీరు ఏ రంగాన్ని చూసినా భారత్ లో పెట్టుబడులు పెట్టేవారు అధిక రాబడులు పొందడానికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి.

మిత్రులారా

భారత్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సెమీకండక్టర్స్ వంటి కీలక టెక్నాలజీలపై కూడా దృష్టి సారించిందిఈ రంగాల్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాంమా ఎఐ మిషన్ ఆ రంగంలో పరిశోధన,  నైపుణ్యాల అభివృద్ధి రెండింటినీ మెరుగు పరుస్తుందిఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద మొత్తం రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారుత్వరలో భారత్ లోని ఐదు సెమీకండక్టర్ ప్లాంట్లు 'మేడ్ ఇన్ ఇండియాచిప్ లను ప్రపంచంలోని ప్రతి మూలకు అందించడం ప్రారంభిస్తాయి.

మిత్రులారా

మీ అందరికి తెలిసిందేభారత్ సులభంగా అందుబాటులో ఉండే మేధోశక్తికి ప్రధాన వనరుగా ఉందిప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,700కు పైగా కంపెనీల సామర్థ్య కేంద్రాలు నేడు భారత్ లో పనిచేయడమే ఇందుకు నిదర్శనంఈ కేంద్రాలు ప్రపంచానికి అత్యంత నైపుణ్యం కలిగిన సేవలను అందిస్తున్న 20 లక్షల మంది భారతీయ యువతకు ఉపాధి కల్పిస్తున్నాయినేడుభారత్ ఈ యువత ప్రాతినిధ్యాన్ని గరిష్టంగా పెంచడంపై మరింత దృష్టిని కేంద్రీకరిస్తోందిఇందుకోసం విద్యఆవిష్కరణలునైపుణ్యాలుపరిశోధనలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారునూతన జాతీయ విద్యావిధానం అమలుతో ఈ రంగంలో గణనీయమైన సంస్కరణను ప్రవేశపెట్టాంగత పదేళ్లలో ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం,  ప్రతిరోజూ రెండు కొత్త కళాశాలలు ప్రారంభమయ్యాయిఇదే కాలంలో మన దేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపు అయింది.

ఇంకా మిత్రులారా 

విద్యను అందుబాటులోకి తేవడమే కాకుండా నాణ్యతను మెరుగుపర్చడంపై దృష్టి సారిస్తున్నాంఫలితంగా గత దశాబ్ద కాలంలో క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో భారతీయ సంస్థల సంఖ్య మూడు రెట్లు పెరిగిందిఈ ఏడాది బడ్జెట్ లో లక్షలాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధిశిక్షణ కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాంపీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కింద తొలిరోజే 111 కంపెనీలు పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్నాయిఈ పథకం ద్వారా కోటి మంది యువతకు ప్రధాన కంపెనీల్లో ఇంటర్న్ షిప్ లు ఇస్తున్నాం.

మిత్రులారా

గత పదేళ్లలో భారత పరిశోధనా ఫలితాలుపేటెంట్ కోసం దరఖాస్తులు కూడా వేగంగా పెరిగాయిదశాబ్ద కాలంలోనే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో భారత్ 81వ స్థానం నుంచి 39వ స్థానానికి ఎగబాకిందిఇంకా ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాంపరిశోధనలకు అనుకూల వ్యవస్థను బలోపేతం చేయడానికి  భారతదేశం ఒక ట్రిలియన్ రూపాయల విలువైన పరిశోధన నిధిని కూడా సృష్టించింది.

మిత్రులారా

నేడుహరిత (గ్రీన్భవిష్యత్తు హరిత ఉద్యోగాల విషయం లో ప్రపంచం భారతదేశం పై ఎన్నో అంచనాలను  కలిగి ఉందిఈ రంగంలో మీకు కూడా సమానంగా గణనీయమైన అవకాశాలు ఉన్నాయిభారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సును మీరంతా గమనించారుఈ సదస్సులోని అనేక విజయాలలో ఒకటి హరిత మార్పు కోసం పునరుద్ధరించిన ఉత్సాహంజి20 సదస్సులోభారత్‌ చొరవతో గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్‌ ప్రారంభమయిందిజి20 సభ్య దేశాలు భారత్ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన అభివృద్ధికి గట్టి మద్దతు ఇచ్చాయిభారత్‌లోఈ దశాబ్దం ముగిసే నాటికి మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాంమైక్రో స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తిని కూడా అభివృద్ధి చేస్తున్నాం

భారత ప్రభుత్వం పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందిఇది ఒక భారీ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకుసోలార్ మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించేందుకు ప్రతి ఇంటికీ నిధులు సమకూరుస్తున్నాంఇప్పటివరకు 13 మిలియన్లకు పైగా అంటే కోటి 30 లక్షల కుటుంబాలు ఈ పథకానికి నమోదు చేసుకున్నాయిఅంటే ఈ కుటుంబాలు సౌర విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారాయిదీనివల్ల ఒక్కో కుటుంబానికి సగటున రూ.25,000 ఆదా అవుతుందిఉత్పత్తి అయ్యే ప్రతి మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ కు 50-60 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించనున్నారుఈ పథకం సుమారు 17 లక్షలఃఉద్యోగాలను సృష్టిస్తుందినైపుణ్యం కలిగిన యువతతో విస్తారమైన శ్రామిక శక్తిని తయారు చేస్తుందిఅందువల్లఈ రంగంలో కూడా మీకు అనేక కొత్త పెట్టుబడి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.

మిత్రులారా

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గణనీయమైన మార్పు కు లోనవుతోందిబలమైన ఆర్థిక మూలాలతోభారతదేశం స్థిరమైన అధిక వృద్ధి మార్గంలో ఉందిప్రస్తుతం భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మాత్రమే కాకుండా అక్కడే స్థిరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోందినేడు ప్రపంచం అన్ని రంగాల్లో అపారమైన అవకాశాలను అందిస్తోందిఈ సమ్మేళనం లో మీ చర్చలు రాబోయే రోజుల్లో అనేక విలువైన దృక్కోణాలు అందిస్తాయని నేను విశ్వసిస్తున్నానుఈ ప్రయత్నానికి నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఇది మనకు చర్చా వేదిక మాత్రమే కాదుఇక్కడ జరిగే చర్చలుప్రస్తావించే అంశాలుచేయవలసినవిచేయకూడనివిప్రయోజనకరమైనవిమా ప్రభుత్వ వ్యవస్థలో కచ్చితంగా అన్వయింపచేసుకుంటాంఈ మథన ప్రక్రియలో మీరు అందించే విజ్ఞానాన్ని మా దేశానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడానికి మేము ఉపయోగిస్తాముఅందువల్ల మీ భాగస్వామ్యం మాకు చాలా ముఖ్యమైనదిమీరు ఇచ్చే ప్రతి సలహాకు విలువ ఉంటుందిమీ ఆలోచనలుమీ అనుభవం-అవి మా ఆస్తులుమీ అందరి సహకారానికి మరోసారి ధన్యవాదాలుప్రశంసనీయమైన ప్రయత్నాలకు గానూ ఎన్.కెసింగ్ ను ఆయన బృందాన్ని నేను అభినందిస్తున్నాను.

హృదయపూర్వక నమస్కారాలుశుభాకాంక్షలతో.

ధన్యవాదాలు!

 

***


(Release ID: 2062274) Visitor Counter : 98