హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎఎంసి)లో వివిధ అభివృద్ధి పనులు సహా ₹919 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర హోమ్-సహకార శాఖ‌ల


మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభోత్స‌వం.. శంకుస్థాపన

మహాత్ముని తర్వాత పరిశుభ్రతను ప్రజాఉద్యమంగా మలచిన ఏకైక జాతీయ నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ;

దేశమంతటా పరిశుభ్రతా కార్యక్రమం.. దాని విలువల వ్యాప్తికి ప్రధాని కృషి చేశారు;

త్వరలో నిర్వహించే ‘పరిశుభ్రత అధ్యయనం’లో అహ్మదాబాద్‌ అగ్రస్థానానికి చేరేలా కృషి చేయాలి;

‘నగర ప్రాథమిక శిక్షా సమితి’ (ఎన్‌పిఎస్ఎస్‌) ఆధ్వర్యాన ఆధునిక పాఠశాలల నిర్మాణం అభినందనీయం;

‘ఎన్‌పిఎస్ఎస్‌’ కార్యక్రమాలు విద్యా వ్యవస్థపరంగా సౌలభ్య కల్పనతోపాటు బాలల సమగ్ర వికాసానికి ఉపకరణాలు
కాగలవు

Posted On: 03 OCT 2024 6:28PM by PIB Hyderabad

కేంద్ర హోమ్-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎఎంసి) పరిధిలో వివిధ అభివృద్ధి పనులు సహా రాష్ట్రవ్యాప్తంగా 919 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంశంకుస్థాపన చేశారుఈ కార్యక్రమాల్లో రాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలతో శ్రీ అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారురాష్ట్రవ్యాప్తంగా నేడు 919 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారుఇవన్నీ ఆరోగ్యంవిద్యగ్రంథాలయాలుపార్కులు సహా చిన్న వీధి వ్యాపారుల సంక్షేమానికి సంబంధించినవని తెలిపారువీటిలో నగరపాలక సంస్థ పరిధిలోని నగర ప్రాథమిక శిక్షా సమితి (ఎన్‌పిఎస్ఎస్‌ద్వారా ఆధునిక పాఠశాలల నిర్మాణం అత్యంత కీలకమైనదని ఆయన వివరించారునగరపాలక సంస్థ కృషితో తాను ప్రాతినిధ్యం వహించే లోక్‌స‌భ స్థానంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలూ ఆదర్శ పాఠశాలలుగా రూపొందాయంటూ ‘ఎఎంసి’కి హోమ్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రాథమిక విద్యా కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నిటినీ బాలలు సద్వినియోగం చేసుకునేలా చూడగలిగితే దేశ భవిష్యత్తు ఉజ్వలం కాగలదనడంలో సందేహం లేదని శ్రీ అమిత్ షా అన్నారుపేద కుటుంబాల్లోని బాలలు శాస్త్రవిజ్ఞానకళాసంగీత రంగాలు సహా అనేక ఇతర అంశాలపై ఆసక్తి చూపడం ద్వారా జీవితాన్ని కమ్ముకున్న నిరాశానిస్పృహలు పటాపంచలు కాగలవన్నారుఅంతేగాక భవిష్యత్తులో భారత్ మరింత ప్రకాశిస్తుందన్న విశ్వాసం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సుమారు 472 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నేడు ప్రారంభోత్సవంశంకుస్థాపన చేసినట్లు శ్రీ అమిత్ షా చెప్పారుఅలాగే శ్రీ హస్ముఖ్ భాయ్ పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మదాబాద్ తూర్పు లోక్‌సభ స్థానంతోపాటు శ్రీ దినేష్‌ భాయ్ మక్వానా ప్రాతినిధ్యం వహించే అహ్మదాబాద్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గంలో మరో 446 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభంశంకుస్థాపన చేశామని తెలిపారుఇవన్నీ అహ్మదాబాద్ నగర వాసులకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాయన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ కొన్నేళ్లుగా అహ్మదాబాద్ నగరందాని పరిసర ప్రాంతాలతోపాటు కలోల్సనంద్ తాలూకాగాంధీనగర్ లోక్‌సభ స్థానం వగైరాల పరిధిలో మొత్తం 23,951 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు.  అంతేకాకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దాదాపు 14,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారని పేర్కొన్నారుఈ విధంగా  గడచిన ఐదేళ్లలో కేవలం ఒక్క లోక్‌సభ నియోజకవర్గంలోనే ఏకంగా 37,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

అహ్మదాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర మంత్రి తెలిపారువీటిద్వారా పిల్లలకు పౌష్టికాహారంవ్యాయామ సౌకర్యాలుకౌమారదశలో విజ్ఞాన వికాసం కోసం గ్రంథాలయాలుజల సేకరణ గుంతల తవ్వకంఏటా 40 లక్షల మొక్కలు నాటడంరహదారులురోడ్డు ఓవర్‌బ్రిడ్జిలువీధి దీపాలుఆసుపత్రులుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుప్రాథమిక పాఠశాలలు వంటివెన్నో ప్రజలకు సమకూరాయని ఆయన విశదీకరించారు.

పరిశుభ్రత కార్యక్రమ పోటీలో అహ్మదాబాద్‌ను అగ్రగామిగా నిలపాలని ‘ఎఎంసి’ కృతనిశ్చయంతో ఉందని శ్రీ అమిత్ షా తెలిపారుఆ మేరకు త్వరలో నిర్వహించే పరిశుభ్రత అధ్యయనం (స్వచ్ఛ సర్వేక్షణ్‌)లో అహ్మదాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని అందరికీ స్పష్టం చేశారుఅయితేఈ దఫా తొలి స్థానం సాధించడం సాధ్యంకాక పోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారుఅయినప్పటికీ వచ్చే ఏడాది ఈ దిశగా నవ్యరీతిలో కృషి చేయాలని సూచించారుతద్వారా పరిశుభ్రతలో దేశంలోనే అగ్రగామి నగరపాలక సంస్థగా రూపొందించే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మహాత్ముని తర్వాత పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మలచిన ఏకైక జాతీయ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీయేనని కేంద్ర హోమ్ మంత్రి అభివర్ణించారుదేశంలో ఇంటింటికీ మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించినట్లు గుర్తుచేశారుస్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారుఅలాగే ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరా సహా మన ఇళ్లుసమాజాలువీధులునగరాలుగ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం ద్వారా పౌరులలో పరిశుభ్రత సంస్కృతిని పెంపొందించేలా లక్ష్య నిర్దేశం చేసుకున్నారని గుర్తుచేశారుఎర్రకోట పైనుంచి మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడిన ఏకైక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక్కరేనని ఆయన అన్నారు.

నాగాలాండ్ నుంచి కేరళ దాకా... ఉత్తరప్రదేశ్ నుంచి అస్సాం వరకూ దేశం నలుమూలలా పరిశుభ్రత కార్యక్రమందాని విలువల వ్యాప్తికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అవిరళ కృషి చేశారని శ్రీ అమిత్ షా కొనియాడారు.

 

***


(Release ID: 2061718) Visitor Counter : 42