ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వచ్చతా హీ సేవ - 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం

Posted On: 02 OCT 2024 7:20PM by PIB Hyderabad

నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ మనోహర్ లాల్ గారుశ్రీ సిఆర్పాటిల్ గారుశ్రీ తోఖాన్ సాహు గారుశ్రీ రాజ్ భూషణ్ గారుఇతర ప్రముఖులుమహిళలు ఇంకా పెద్దలు !

నేడు పూజ్య బాపూజీలాల్ బహదూర్ శాస్త్రిల జయంతిఈ భరతమాత గొప్ప కుమారులకు వినమ్రంగా నమస్కరిస్తున్నానుగాంధీజీఇతర మహనీయులు భారతదేశం కోసం కన్న కలను సాకారం చేసేందుకు కలిసి పనిచేయడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది.

 

స్నేహితులారా,

ఈ అక్టోబర్ 2నేను కర్తవ్య భావంతో నిండిపోయానుతీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానుస్వచ్ఛభారత్ మిషన్ కు నేటితో పదేళ్లు పూర్తయ్యాయిస్వచ్ఛభారత్ మిషన్ ఈ పదేళ్ల ప్రయాణం కోట్లాది మంది భారతీయుల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగడచిన పదేళ్లలో లెక్కకు మించి భారతీయులు ఈ మిషన్ ను స్వీకరించితమదిగా చేసుకునితమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారుప్రతి పౌరుడికిమన పారిశుద్ధ్య కార్మికులకుమన మత నాయకులకుమన అథ్లెట్లకుమన ప్రముఖులకుస్వచ్ఛంద సంస్థలకుమీడియా స్నేహితులకు నా హృదయపూర్వక ప్రశంసలుఅభినందనలు తెలియజేస్తున్నానుమీరంతా కలిసి స్వచ్ఛభారత్ మిషన్ ను ఇంత పెద్ద ప్రజా ఉద్యమంగా మార్చారుపరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని దేశానికి ఎనలేని స్ఫూర్తినిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్రపతిఉపరాష్ట్రపతిమాజీ రాష్ట్రపతిమాజీ ఉపరాష్ట్రపతిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానురాష్ట్రపతిఉపరాష్ట్రపతి అందించిన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలుప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయిప్రజలు తమ గ్రామాలునగరాలుపరిసర ప్రాంతాలను అవి చావిళ్ళుఫ్లాట్లుసొసైటీలు ఏదైనా సరే ఉత్సాహంగా శుభ్రపరుస్తున్నారుఅనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులుమంత్రులుఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారుకేవలం గత పక్షం రోజుల్లోనే దేశవ్యాప్తంగా కోట్లాది మంది పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 15 రోజుల పాటు జరిగిన సేవా పక్షోత్సవాల్లో దేశవ్యాప్తంగా 27 లక్షలకు పైగా కార్యక్రమాలు జరిగాయివీటిలో 28 కోట్ల మంది పాల్గొన్నారని నాకు సమాచారం అందిందినిరంతర కృషితోనే భారత్ ను పరిశుభ్రంగా ఉంచగలంప్రతి భారతీయుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

స్నేహితులారా,

నేడు ఈ ముఖ్యమైన సందర్భాన్ని పురస్కరించుకుని పరిశుభ్రతకు సంబంధించి దాదాపు రూ.10,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాంఅమృత్ మిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నీరుమురికి నీటి శుద్ధి (వాటర్సీవరేజ్ ట్రీట్ మెంట్ప్లాంట్లను నిర్మించనున్నాం. "నమామి గంగేఅయినా లేదా "గోబర్ధన్ప్లాంట్ల ద్వారా వ్యర్థాల నుండి బయోగ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన పనులు అయినా కావచ్చుఈ కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ మిషన్ ను కొత్త శిఖరాలకు తీసుకువెళతాయిస్వచ్ఛభారత్ మిషన్ ఎంత విజయవంతమైతే మన దేశం అంత వెలుగుతో మెరిసిపోతుంది.

 

స్నేహితులారా,

వెయ్యేళ్ల తర్వాత కూడా 21వ శతాబ్దపు భారత్ ను అధ్యయనం చేస్తే స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిస్సందేహంగా గుర్తుండిపోతుందిస్వచ్ఛభారత్ అనేది ప్రపంచంలోనే ఈ శతాబ్దపు అతిపెద్ద అత్యంత విజయవంతమైన ప్రజల నేతృత్వంలోనిప్రజల ఆధారిత ప్రజా ఉద్యమంనేను దైవంగా భావించే ప్రజల శక్తిని ఈ మిషన్ నాకు చూపించిందినాకు పరిశుభ్రత అనేది ప్రజల శక్తికి సంబరంగా మారిందినాకు చాలా గుర్తుకొస్తాయి... ఈ ప్రచారం ప్రారంభమైనప్పుడులక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో శుభ్రత కార్యక్రమాలు ప్రారంభించారుపెళ్లిళ్ల నుంచి బహిరంగ కార్యక్రమాల వరకు ప్రతిచోటా పరిశుభ్రత సందేశం ఉండేదిఓ వృద్ధ తల్లి మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించేందుకు తన మేకలను విక్రయించగాకొందరు మంగళసూత్రాలను సైతం విక్రయించారువమరికొందరు మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చారుకొందరు రిటైర్డ్ ఉపాధ్యాయులు తమ పింఛన్లను విరాళంగా ఇవ్వగాసైనికులు తమ రిటైర్మెంట్ నిధులను పరిశుభ్రతకు విరాళంగా ఇచ్చారుఈ విరాళాలను దేవాలయాలకు లేదా మరేదైనా కార్యక్రమానికి ఇచ్చి ఉంటే అవి పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కి వారం రోజుల పాటు చర్చకు వచ్చేవికానీ ఎప్పుడూ టీవీల్లో కనిపించని ముఖాలుఎప్పుడూ పతాక శీర్షికల్లో లేనివారుసమయం అయినాసంపద అయినా విరాళాలు ఇచ్చిఈ ఉద్యమానికి కొత్త బలాన్నిశక్తిని ఇచ్చారని దేశం తెలుసుకోవాలిఇది మన దేశ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.

 

ఒకటే సారి వాడే (సింగిల్ యూజ్ప్లాస్టిక్ ను వదులుకోవడం గురించి నేను మాట్లాడినప్పుడుకోట్లాది మంది షాపింగ్ కోసం జనపనారక్లాత్ బ్యాగులను ఉపయోగించడం ప్రారంభించారువారికి రుణపడి ఉంటానుఅలా గాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం గురించి నేను మాట్లాడి ఉంటేప్లాస్టిక్ పరిశ్రమకు చెందిన వారు నిరసన తెలిపేవారునిరాహార దీక్షలు చేసేవారు... కానీ వారు అలా చేయలేదుఆర్థికంగా నష్టపోయినా సహకరించారుఅలాగేనేను రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానుఎందుకంటే వారు మోదీ ఒకటే సారి వాడే ప్లాస్టిక్‌పై నిషేధం విధించడంతో నిరుద్యోగం పెరిగిందంటూ ఆందోళనకు దిగవచ్చని అనిపించినా వారు అలా చేయనందుకువారి దృష్టి అక్కడికి వెళ్లకపోవడం పట్ల నేను కృతజ్ఞతతో ఉన్నాను,

 

స్నేహితులారా,

ఈ మహోద్యమంలో మన సినీ పరిశ్రమ కూడా ఏ మాత్రం వెనుకబడలేదువాణిజ్య ప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేసే సినిమాలను పరిశ్రమ అందించిందిఈ 10 సంవత్సరాలలోఇది ఒక్కసారితో ముగిసే ప్రక్రియ కాదనిఇది ప్రతి క్షణం ప్రతిరోజూ చేయవలసిన నిరంతర పని అని నేను భావించానునేను ఒకటి ప్రత్యేకంగాభావించినప్పుడు నేను దానికి నమ్మకంగా కట్టుబడి ఉంటాను. 'మన్ కీ బాత్'లో పరిశుభ్రత గురించి నేను దాదాపు 800 సార్లు ప్రస్తావించిన విషయం మీకు గుర్తుండే ఉంటుందిపరిశుభ్రత పట్ల తమ కృషినిఅంకితభావాన్ని తెలియజేస్తూ ప్రజలు లక్షలాది లేఖలు పంపుతున్నారు.

 

స్నేహితులారా,

ఈ రోజునేను దేశం విజయాలనుదేశ ప్రజల విజయాలను చూస్తున్నప్పుడుఒక ప్రశ్న తలెత్తుతుందిఇది ఇంతకు ముందు ఎందుకు జరగలేదుస్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మాగాంధీ పరిశుభ్రతకు మార్గం చూపారుఆయన మనకు చూపించడమే కాకుండా నేర్పించారుమరి స్వాతంత్య్రానంతరం పరిశుభ్రతపై ఎందుకు దృష్టి పెట్టలేదుగాంధీ పేరు మీద అధికారం ఆశించిఆయన పేరు మీద ఓట్లు సంపాదించిన వారు ఆయన ఇష్టపడే అంశమైన పరిశుభ్రతను ఎందుకు విస్మరించారుమరుగుదొడ్లు లేకపోవడాన్ని వారు దేశానికి ఒక సమస్యగా చూడలేదుఆశుద్దాన్ని జీవనం లో భాగం అనుకున్నారుఫలితంగా ప్రజలు మురికి కూపాల్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందిమురికి నిత్యజీవితంలో భాగమైపోయిందిపరిశుభ్రతపై చర్చించడం మానేశారుకాబట్టినేను ఎర్రకోట నుండి ఈ సమస్యను లేవనెత్తినప్పుడుఅది తుఫానుకు కారణమైందిమరుగుదొడ్లుపరిశుభ్రత గురించి మాట్లాడటం భారత ప్రధాని పని కాదని కొందరు నన్ను ఎగతాళి చేశారుఇంకా ఎగతాళి చేస్తూనే ఉన్నారు.

 

 

కానీ ,స్నేహితులారా,

ఈ దేశంలోని సామాన్య ప్రజల జీవనాన్ని సులభతరం చేయడమే భారత ప్రధాని మొదటి పనినా బాధ్యతను అర్థం చేసుకుని మరుగుదొడ్ల గురించిశానిటరీ ప్యాడ్స్ గురించి మాట్లాడానుఈ రోజుమనం ఫలితాలను చూస్తున్నాము.

 

స్నేహితులారా,

పదేళ్ల క్రితం వరకు భారత జనాభాలో 60 శాతం మంది బహిరంగ మలవిసర్జన చేయాల్సి వచ్చేదిఇది మనిషి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిఅంతే కాదుఇది దేశంలోని పేదలకుదళితులకుగిరిజనులకువెనుకబడిన వర్గాలకు జరిగిన అవమానంతరతరాలుగా కొనసాగుతున్న అవమానంఇళ్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో అక్కాచెల్లెళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారువారికి బాధను అసౌకర్యాన్ని భరించడం తప్ప వేరే మార్గం లేకపోయిందితమను తాము ఉపశమనం చేసుకోవడానికి చీకటి పడే వరకు వేచి ఉండాల్సి వచ్చేదిఆ చీకటి వారి భద్రతకు హానికరంగా కూడా మారిందిచలి ఉన్నావర్షం పడ్డా సూర్యోదయానికి ముందే వారు ఆరు బయలుకు వెళ్లాల్సి వచ్చేదినా దేశంలో కోట్లాది మంది తల్లులు ప్రతిరోజూ ఈ పరీక్షను ఎదుర్కొన్నారుబహిరంగ మలవిసర్జన వల్ల కలిగే ఏర్పడే మురికి మన పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందిశిశు మరణాలకు ఇది ప్రధాన కారణంఅపరిశుభ్ర పరిస్థితుల కారణంగా గ్రామాలుమురికివాడల్లో వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం.

 

స్నేహితులారా,

ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా ఎలా పురోగతి సాధిస్తుందిఅందుకే పరిస్థితులు యథాతథంగా కొనసాగకూడదని నిర్ణయించుకున్నాంమేము దీనిని జాతీయ మానవతా సవాలుగా తీసుకున్నాందీనిని పరిష్కరించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించాముఇక్కడే 'స్వచ్ఛ భారత్ మిషన్' (క్లీన్ ఇండియా మిషన్కు బీజం పడిందిఈ కార్యక్రమంఈ మిషన్ఈ ఉద్యమంఈ ప్రచారం ప్రజా చైతన్యం కోసం ఈ ప్రయత్నం బాధ నుంచి పుట్టిందిబాధల నుంచి పుట్టిన ఉద్యమాలు ఎప్పటికీ అంతరించి పోవుఅనతికాలంలోనే కోట్లాది మంది భారతీయులు గొప్ప విజయాలు సాధించారుదేశంలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. 40 శాతం కంటే తక్కువ ఉన్న టాయిలెట్ కవరేజీ ఇప్పుడు 100 శాతానికి చేరుకుంది.

 

 

స్నేహితులారా,

దేశంలోని సాధారణ పౌరుల జీవితాలపై స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభావం వెలకట్టలేనిదితాజాగా ఓ ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లో ఓ అధ్యయనం ప్రచురితమైందిఅమెరికాలోని వాషింగ్టన్ లోని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాఒహియో స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారుస్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏటా 60 వేల నుంచి 70 వేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడినట్లు ఈ అధ్యయనం తెలిపిందిఎవరైనా రక్తదానం చేసి ఒక్క ప్రాణాన్ని కాపాడినా అదొక మహత్తర ఘట్టంకానీపరిశుభ్రతచెత్తాచెదారం తొలగించడంమురికిని తొలగించడం ద్వారా 60,000-70,000 మంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగాం – దేవుడి నుంచి ఇంతకంటే ఆశీర్వాదం ఏముంటుందిప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, 2014 - 2019 మధ్య 300,000 మంది ప్రాణాలను కాపాడారులేకపోతే డయేరియాతో వారిని కోల్పోవాల్సి వచ్చేదిఇది మానవ సేవ కర్తవ్యంగా మారింది మిత్రులారా.

 

ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం కారణంగా 90 శాతానికి పైగా మహిళలు సురక్షితంగా ఉన్నారని యునిసెఫ్ నివేదిక పేర్కొందిస్వచ్ఛభారత్ మిషన్ వల్ల మహిళల్లో అంటువ్యాధుల వల్ల వచ్చే అనారోగ్యాలు కూడా గణనీయంగా తగ్గాయిఇది అంతటితో ఆగిపోలేదువేలాది పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మధ్యలో బడి మానేసే (డ్రాపవుట్బాలికల శాతం బాగా తగ్గిందిపరిశుభ్రత కారణంగా గ్రామీణ కుటుంబాలు ఏటా సగటున రూ.50,000 ఆదా చేస్తున్నాయని యునిసెఫ్ మరో అధ్యయనంలో వెల్లడైందిఇంతకుముందు ఈ నిధులను తరచూ అనారోగ్యాల చికిత్సల కోసం లేదా అనారోగ్యం కారణంగా పనిచేయలేకపోవడం వల్ల కోల్పోయే ఆదాయం బదులు ఖర్చు చేసేవారు.

 

స్నేహితులారా,

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడం పిల్లల ప్రాణాలను కాపాడగలంనేను మీకు మరొక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నానుకొన్నేళ్ల క్రితం గోరఖ్ పూర్పరిసర ప్రాంతాల్లో మెదడువాపు వ్యాధితో వందలాది మంది చిన్నారులు చనిపోతున్నారని బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయికానీ ఇప్పుడు మురికి తొలగిపోయి పరిశుభ్రత రావడంతో ఆ వార్తలు కూడా లేవుమురికితో పాటు ఏం పోతుందో చూడండిదీనికి ప్రధాన కారణం స్వచ్ఛభారత్ మిషన్ ప్రజల్లో తెచ్చిన చైతన్యంఆ తర్వాత వచ్చిన పరిశుభ్రత.

 

స్నేహితులారా,

 

శుభ్రత పట్ల పెరిగిన గౌరవం దేశ ప్రజలలో ఒక ప్రధానమైన మానసిక మార్పును తీసుకువచ్చిందిఈ రోజు ఈ విషయాన్ని ప్రస్తావించడం ముఖ్యమని నేను భావిస్తున్నానుఇంతకు ముందుపారిశుధ్య పనులతో సంబంధం ఉన్న వ్యక్తులను ఒక నిర్దిష్ట కోణం లో చూసేవారువారిని ఎలా హీనంగా చూసేవారో మనందరికీ తెలుసుసమాజంలోని సంపన్న వర్గాలు చెత్తను పేర్చడం తమ హక్కు గానూదానిని శుభ్రపరచడం మరొకరి బాధ్యత గానూ ప్రచారం చేసేవారుపైగా శుభ్రపరిచిన వారిని కించపరుస్తూ అహంకారంతో జీవించే వారుకానీ మనమంతా పరిశుభ్రత ప్రయత్నాలలో పాల్గొనడం ప్రారంభించినప్పుడుశుభ్ర పరిచే పనిలో ఉన్నవారికి కూడా తాము చేస్తున్న పని ఎంత ముఖ్యమోతమ ప్రాధాన్యత ఏమిటో గుర్తించారుఇతరులు కూడా తమ ప్రయత్నాలలో భాగం అవుతున్నందుకు గర్విస్తున్నారుఇది పెద్ద మానసిక మార్పుకు దారితీసిందిస్వచ్ఛభారత్ మిషన్ కుటుంబాలకుపారిశుద్ధ్య కార్మికులకు ఎనలేని గౌరవాన్నిహుందా తనాన్ని తెచ్చిపెట్టిందిఈ రోజు వారు తాము అందించే సేవకు గర్వపడుతున్నారుతమ కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండాదేశం ప్రకాశవంతంగా మారడానికి కూడా కృషి చేస్తున్నారని వారు ఇప్పుడు గర్వపడుతున్నారుస్వచ్ఛభారత్ మిషన్ లక్షలాది మంది పారిశుద్ధ్య కార్మికులకు గర్వకారణంగా నిలిచిందిపారిశుద్ధ్య కార్మికుల భద్రతకువారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందిసెప్టిక్ ట్యాంకుల్లోకి మాన్యువల్ గా ప్రవేశించడం వల్ల కలిగే ప్రమాదాలను తొలగించేందుకు కృషి చేస్తున్నాంప్రభుత్వంప్రయివేటు రంగంప్రజలు కలిసి పనిచేస్తుండటంతో కొత్త సాంకేతికలతో అనేక కొత్త స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయి.

 

స్నేహితులారా,

స్వచ్ఛభారత్ మిషన్ కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదుదాని పరిధి విస్తృతంగా విస్తరిస్తోందిఇది ఇప్పుడు పరిశుభ్రత ఆధారిత అభ్యున్నతికి మార్గాన్ని సుగమం చేస్తోందిస్వచ్ఛ భారత్ మిషన్ పెద్ద ఎత్తున ఉపాధి కూడా కల్పించిందిగత కొన్నేళ్లుగా కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణంతో అనేక రంగాలకు లబ్ధి చేకూరిందిప్రజలకు ఉపాధి లభిస్తోందిగ్రామాల్లో తాపీ మేస్త్రీలుప్లంబర్లుకూలీలు ఇలా ఎంతోమందికి కొత్త అవకాశాలు దొరికాయిఈ మిషన్ వల్ల సుమారు 1.25 కోట్ల మంది ఆర్థిక ప్రయోజనం లేదా ఉపాధి పొందారని యునిసెఫ్ అంచనా వేసిందికొత్త తరం మహిళా తాపీ మేస్త్రీలు కూడా ఈ ప్రచారం ఫలితమేఇంతకు ముందుమనం మహిళా మేస్త్రీల గురించి ఎప్పుడూ వినలేదుకానీ ఇప్పుడు మీరు మహిళలు తాపీ మేస్త్రీలుగా పనిచేయడం చూడవచ్చు.

 

క్లీన్ టెక్నాలజీ తో యువతకు మెరుగైన ఉద్యోగాలుఅవకాశాలు లభిస్తున్నాయిప్రస్తుతం క్లీన్ టెక్ రంగంలో వేల స్టార్టప్ లు రిజిస్టర్ అయ్యాయివ్యర్థాల నుంచి సంపదవ్యర్థాల సేకరణరవాణానీటి పునర్వినియోగంరీసైక్లింగ్ వంటి రంగాల్లో అనేక అవకాశాలు కల్పిస్తున్నారుఈ దశాబ్దం చివరి నాటికి ఈ రంగంలో 65 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనాస్వచ్ఛ భారత్ మిషన్ ఇందులో నిస్సందేహంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 

స్నేహితులారా,

స్వచ్ఛ భారత్ మిషన్ సంపూర్ణ ఆర్థిక వ్యవస్థకి కూడా కొత్త ఊపునిచ్చిందిఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల నుంచి కంపోస్టుబయోగ్యాస్విద్యుత్రోడ్డు నిర్మాణానికి అవసరమైన బొగ్గు వంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నాంనేడు పశుపోషణలో నిమగ్నమైన రైతులకువృద్ధ పశువులను నిర్వహించడం ఆర్థిక భారంగా మారవచ్చుకానీఇప్పుడుగోబర్ ధన్ యోజనకు ధన్యవాదాలుఇకపై పాలను ఉత్పత్తి చేయని లేదా పొలాల్లో పని చేయని పశువులు కూడా ఆదాయ వనరుగా మారవచ్చువీటితో పాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా వందలాది సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేశారుఈ రోజుఅనేక కొత్త ప్లాంట్లకు ప్రారంభోత్సవంశంకుస్థాపనలు జరిగాయి.

 

స్నేహితులారా,

శరవేగంగా మారుతున్న ఈ కాలంలో పరిశుభ్రతకు సంబంధించిన సవాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యంమన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీపట్టణీకరణ పెరిగే కొద్దీ వ్యర్థాల ఉత్పత్తి కూడా పెరుగుతుందిఇది మరింత చెత్తకు దారితీస్తుందిఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వాడి పారవేసే ("యూజ్ అండ్ త్రో" ) నమూనా కూడా ఈ సమస్యకు దోహదం చేస్తుందిఎలక్ట్రానిక్ వ్యర్థాలతో సహా కొత్త రకాల వ్యర్థాలను ఎదుర్కొంటాంకాబట్టిమన భవిష్యత్తు వ్యూహాలను మెరుగుపరుచుకోవాలిరీసైకిల్ చేయదగిన పదార్థాలను ఎక్కువగా ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మాణ రంగం లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందిమన కాలనీలుగృహ సముదాయాలుభవనాలను సాధ్యమైనంత వరకు వ్యర్థ రహితానికి (జీరో వేస్ట్కు దగ్గరగా తెచ్చే విధంగా డిజైన్ చేయాలిమనం దానిని జీరో వేస్ట్ లోకి తీసుకురాగలిగితేఅది నిజంగా చాలా బాగుంటుంది.

 

నీరు వృథా కాకుండాశుద్ధి చేసిన మురుగునీటిని సమర్థవంతంగా వినియోగించేలా చూడాలినమామి గంగే ప్రాజెక్టు మనకు ఆదర్శంఈ చొరవ ఫలితంగా గంగానది ఇప్పుడు మరింత పరిశుభ్రంగా మారిందిఅమృత్ మిషన్అమృత్ సరోవర్ ప్రచారం కూడా గణనీయమైన మార్పులు తెస్తున్నాయిఇవి ప్రభుత్వంప్రజల భాగస్వామ్యం ద్వారా తీసుకువచ్చిన మార్పు కు శక్తిమంతమైన నమూనాలుఅయితేఇది సరిపోదని నేను నమ్ముతున్నానునీటి సంరక్షణనీటి శుద్ధినదుల ప్రక్షాళన కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలిపరిశుభ్రతకుపర్యాటకానికి ఎంత దగ్గరి సంబంధం ఉందో మనందరికీ తెలుసుఅందువల్ల మన పర్యాటక ప్రదేశాలుపవిత్ర స్థలాలువారసత్వ ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

 

స్నేహితులారా,

గత పదేళ్లలో పరిశుభ్రత విషయంలో ఎంతో సాధించాంఅయితే వ్యర్థాలను సృష్టించడం రోజువారీ దినచర్యగా ఉన్నట్లేపరిశుభ్రత పాటించడం కూడా రోజువారీ అలవాటుగా ఉండాలివ్యర్థాలను సృష్టించబోమని ఏ వ్యక్తి లేదా జీవి చెప్పలేరువ్యర్థాలు అనివార్యమైతే పరిశుభ్రత కూడా అనివార్యమేఈ పనిని మనం ఒక రోజుకోఒక తరానికో కాదురాబోయే తరాలకూ కొనసాగించాలిపరిశుభ్రతను ప్రతి పౌరుడు తమ బాధ్యతగాకర్తవ్యంగా అర్థం చేసుకున్నప్పుడుమార్పు తథ్యంఈ దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉందిఇదే దేశం ప్రకాశించగలదని చెప్పడానికి భరోసా.

పరిశుభ్రత అనేది ఒక రోజు పని కాదుజీవితకాల అభ్యాసందాన్ని తరతరాలకు మనం అందించాలిపరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి సహజ ప్రవృత్తిగా ఉండాలిఇది మన దైనందిన జీవితంలో భాగం కావాలిమనం మురికి పట్ల అసహనాన్ని పెంపొందించుకోవాలిమనచుట్టూ మురికిని చూడకూడదుచూసి సహించకూడదుమురికిపట్ల ద్వేషమే పరిశుభ్రత సాధనలో మనల్ని నిర్బంధంబలోపేతం చేస్తుంది,

 

ఇళ్లలో చిన్న పిల్లలు వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వారి పెద్దలను ఎలా ప్రేరేపిస్తారో మనం చూశాముచాలా మంది తమ మనవలు లేదా పిల్లలు 'మోదీగారు ఏం చెప్పారో చూడండిఎందుకు చెత్త వేస్తున్నారు?" అని తరచూ గుర్తు చేస్తుంటారని నాకు చెప్పారుకారు కిటికీలోంచి బాటిల్ విసిరేయకుండా కూడా వారు అడ్డుకుంటున్నారుఈ ఉద్యమం వారిలో కూడా ఒక బీజం వేసింది.

 

అందువల్లఈ రోజు నేను యువతకు తరువాతి తరం పిల్లలకు చెప్పాలనుకుంటున్నానునిబద్ధతతో ఉందాంపరిశుభ్రత అవసరాన్ని ఇతరులకు వివరించడం ప్రోత్సహించడం కొనసాగిద్దాంఐక్యంగా ఉందాందేశం పరిశుభ్రంగా ఉండే వరకు మనం ఆగకూడదుఅది సాధ్యమేననిమనం సాధించగలమనిభారతమాతను మురికి నుంచి కాపాడుకోవచ్చని గత పదేళ్ల విజయాలు మనకు చూపిస్తున్నాయి.

 

స్నేహితులారా,

 

ఈ రోజుఈ ప్రచారాన్ని జిల్లాబ్లాక్గ్రామంపరిసరాలు వీధి స్థాయిలకు తీసుకెళ్లాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నానుపరిశుభ్రమైన పాఠశాలలుపరిశుభ్రమైన ఆసుపత్రులుపరిశుభ్రమైన కార్యాలయాలుపరిశుభ్రమైన పరిసరాలుపరిశుభ్రమైన చెరువులుపరిశుభ్రమైన బావుల కోసం వివిధ జిల్లాలుబ్లాకుల్లో పోటీలు నిర్వహించాలిఇది పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుంది నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన రివార్డులుసర్టిఫికెట్లు ఇవ్వాలిభారత ప్రభుత్వం కేవలం 2-4 నగరాలను పరిశుభ్రంగా లేదా 2-4 జిల్లాలను పరిశుభ్రంగా ప్రకటిస్తే సరిపోదుదీన్ని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందిమన మున్సిపాలిటీలు నిరంతరం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలిఅందుకోసం వాటికి తగిన ప్రతిఫలం ఇవ్వాలివ్యవస్థలు తిరిగి పాత పద్దతులకు వెళ్లడం కంటే దారుణం మరొకటి ఉండదుఅన్ని స్థానిక సంస్థలు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలనిదీనికే తొలి ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నాను.

 

అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాంనేను నా తోటి పౌరులకు ‘ఇంట్లోపొరుగున లేదా పనిప్రాంతంలోఎక్కడ ఉన్నా-మేం మురికిని సృష్టించందానిని సహించం అని ప్రతిజ్ఞ చేయాలని అభ్యర్థిస్తున్నానుపరిశుభ్రత మన సహజ అలవాటుగా మారాలిమన ప్రార్థనా స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లేమన పరిసరాల పట్ల కూడా అదే భావాన్ని పెంపొందించుకోవాలి. 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశంప్రయాణంలో మనం చేసే ప్రతి ప్రయత్నం "పరిశుభ్రత శ్రేయస్సుకు దారితీస్తుందిఅనే మంత్రాన్ని బలపరుస్తుందిమరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుకొత్త ఉత్సాహంతోఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతూ,వ్యర్థాలను సృష్టించబోమనిపరిశుభ్రత కోసం మన వంతు కృషి చేస్తామనిమన బాధ్యతల నుంచి ఎప్పుడూ వెనకడుగు వేయబోమని ప్రతిజ్ఞ చేసి పూజ్య బాపుజీకి నిజమైన నివాళి అర్పిద్దాంమీ అందరికీ శుభాభినందనలు.

 

చాలా ధన్యవాదాలు.

 

***


(Release ID: 2061710) Visitor Counter : 67