ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభంలో భాగంగా ప్రధాని చేసిన ప్రసంగానికి అనువాదం

Posted On: 29 SEP 2024 5:09PM by PIB Hyderabad

నమస్కారం!

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండేఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్శ్రీ అజిత్ పవార్పుణే పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడుమంత్రివర్గ యువ సహచరుడు శ్రీ మురళీధర్వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటున్న ఇతర కేంద్ర మంత్రులురాష్ట్రమంత్రులుఎంపీలుఎమ్మెల్యేలుఈ కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ..

అలాగే ప్రియమైన పుణే సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు!

ప్రధాన ప్రాజెక్టుల ప్రారంభోత్సవంశంకుస్థాపన నిమిత్తం రెండు రోజుల కిందటే పుణేకు రావాల్సి ఉందికానీ భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమం రద్దయిందిఇది నాకు వ్యక్తిగతమైన నష్టంఎందుకంటే పుణేలో అణువణువూ దేశభక్తితో నిండి ఉంటుందిఈ నగరంలోని ప్రతిభాగం సామాజిక స్పృహను కలిగి ఉందిఇలాంటి నగరాన్ని సందర్శించిన వారిలో శక్తి ప్రవేశిస్తుందిఈ రోజు కూడా ఈ నగరానికి నేను రాలేకపోయాను కాబట్టి ఇది నాకు నష్టమేఅయినా మిమ్మల్నందరినీ ఇలా కలుసుకునే అవకాశం ఇచ్చిన టెక్నాలజీకి ధన్యవాదాలుభార మహనీయుల్లో స్ఫూర్తి నింపిన ఈ పుణే భూమిమహారాష్ట్రలో సరికొత్త అధ్యాయానికి సాక్ష్యంగా నిలుస్తోందిజిల్లా కోర్టు నుండి స్వర్గేట్ సెక్షన్ వరకు మెట్రో మార్గం ఇప్పుడే ప్రారంభమైంది. ఈ మార్గంలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయిస్వర్గేట్-కత్రాజ్ సెక్షన్‌కు ఈ రోజే శంకుస్థాపన జరిగిందివీటికి అదనంగా మన సమాజంలో గణనీయమైన మార్పులకు నాంది పలికిన సావిత్రీబాయి ఫూలే స్మారక నిర్మాణానికి ఈరోజు పునాది పడిందిఈ నగరంలో ‘సులభతర జీవన విధానాన్ని’ పెంపొందించాలనే మా కలను సాకారం చేసే దిశలో వేగంగా మేం ప్రయాణిస్తున్నందుకు సంతోషిస్తున్నాను.

సోదర సోదరీమణులారా,

విఠల భగవానుని ఆశీస్సులతో ఆయన భక్తులకు అమూల్యమైన బహుమతి ఈ రోజు లభించిందిషోలాపూర్‌ను నేరుగా చేరుకునేలా విమానాశ్రయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయిటెర్మినల్ భవన సామర్థ్యాన్ని పెంచారుఅలాగే ప్రయాణికులకు నూతన సౌకర్యాలను అభివృద్ధి చేశారుఇది దేశవిదేశాల్లోని విఠల భక్తులకు ఉపయుక్తంగా ఉంటుందిఇప్పుడు స్వామిని దర్శించుకోవడానికి నేరుగా షోలాపూర్ చేరుకోవచ్చుఇది వాణిజ్యంవ్యాపారంపర్యాటకం పెరిగేలా చేస్తుందిఈ అభివృద్ధి పనుల విషయమై మహారాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలుశుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

ప్రస్తుతం మహారాష్ట్రకు కొత్త లక్ష్యాలుతీర్మానాలు అవసరంఅందుకే అభివృద్ధికి ఆస్కారం ఉన్న పుణే లాంటి నగరాలను సృష్టించాలిపుణే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా జనాభా కూడా పెరుగుతోందిఅభివృద్ధిపై జనాభా పెరుగుదల ప్రభావం చూపకుండా నగర సామర్థ్యాన్ని పెంచాలంటే దానికి తగిన చర్యలు ఇప్పుడే తీసుకోవాలిపుణేలో ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందినగరం విస్తరించినప్పుడు వివిధ ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు సైతం మెరుగ్గా ఉంటాయిఈ విధానంతోనే మహాయుతి ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోంది.

స్నేహితురాలా,

పుణే నగర ఆధునిక అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈపాటికే ఈ పని పూర్తయి ఉండాలిమెట్రో లాంటి అధునాతన రవాణా వ్యవస్థను చాలా కాలం కిందటే ప్రవేశపెట్టి ఉండాల్సిందిదురదృష్టవశాత్తూ గడచిన దశాబ్దాల్లో పట్టణాభివృద్ధికి సరైన ప్రణాళికదార్శనికత లేవుఒకవేళ ప్రణాళికపై చర్చ జరిగినా అది ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గిపోయేదిప్రాజెక్టును ఆమోదిస్తే అది పూర్తవడానికి దశాబ్దాలు సమయం పట్టేదిఈ విధమైన కాలం చెల్లిన పనితీరు వల్ల మనదేశంమహారాష్ట్రపుణేలకు నష్టం జరిగిందిపుణేలో మెట్రో నిర్మించాలనే ప్రతిపాదన 2008లోనే వచ్చిందన్న విషయం మీకు గుర్తుండే ఉంటుందిమన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అడ్డంకులు తొలగించివేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో 2016 నాటికి గానీ పునాదిరాయి పడలేదుప్రస్తుతం మెట్రో సజావుగా నడుస్తూ విస్తరణ దిశగా సాగుతోంది.

అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించడంతో పాటు స్వర్గేట్-కాత్రాజ్ లైన్‌కు శంకుస్థాపన చేశాంఈ ఏడాది మార్చిలో రూబీ హాల్ క్లినిక్ నుంచి రామ్‌వాడి వరకు మెట్రోసర్వీసును నేను ప్రారంభించాను. 2016 నుంచి మొదలుపెడితే ఈ ఏడెనిమిది ఏళ్లలో నగర మెట్రో ఎంతో ప్రగతి సాధించిందిఅనేక మార్గాలకు విస్తరణ దిశగా సాగుతోందిపాత తరహా పనితీరుతో ఇది సాధ్యం కాదుగత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎనిమిదేళ్లలో ఒక్క స్థంభాన్ని కూడా నిర్మించలేకపోయిందిమన ప్రభుత్వం మాత్రం పుణేలో ఆధునిక మెట్రో వ్యవస్థను నిర్మించింది.

స్నేహితులారా,

అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం కొననసాగడం రాష్ట్ర ప్రగతికి అవసరంఈ విషయంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోతుందిమెట్రో ప్రాజెక్టులుముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలురైతుల కోసం చేపట్టిన ప్రధానమైన సాగు ప్రాజెక్టులను చూడండిమహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారు రాక ముందు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు గాడి తప్పాయిదీనికి మరో ఉదాహరణ బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతంమన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నా స్నేహితుడు దేవేంద్ర ‘ఆరిక్ సిటీ’ని ప్రతిపాదించారుఢిల్లీ-ముంబయి ఇండస్ట్రియల్ కారిడార్‌లోని షెండ్ర-బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంత నిర్మాణానికి పునాది వేశారునేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా ఈ పనులు జరగాల్సి ఉందికానీ మధ్యలోనే పనులు నిలిచిపోయాయిఇప్పుడు షిండే నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఈ అడ్డంకులన్నింటినీ తొలగించిందిబిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతాన్ని ఈ రోజు జాతికి అంకితం చేశాంఇది ఛత్రపతి శంభాజీనగర్ లో ఎనిమిది వేల ఎకరాలకు పైగా విస్తరించనుందిఇప్పటికే అనేక భారీ పరిశ్రమలకు స్థలాలను కేటాయించారుఫలితంగా వేల కోట్ల పెట్టుబడులు వస్తాయివేలాది మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందిపెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాలను సృష్టించడమే మహారాష్ట్రలోని యువతను బలోపేతం చేసేందుకు పాటించాల్సిన మంత్రం.

వికసిత్ భారత్(అభివృద్ధి చెందిన భారత్లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో మైలురాళ్లను మనం దాటాల్సి ఉంటుందిమన మూలాలువిలువకు ప్రాధాన్యమిస్తూనే దేశాన్ని నవీకరించాలిమన వారసత్వ సంపదను సగర్వంగా ముందుకు తీసుకెళుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలిదేశ అవసరాలుప్రాధాన్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఆధునికీకరించాలిఒకే లక్ష్యంతో మన సమాజం ముందుకు సాగాలివీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మన ప్రయాణం కొనసాగించాలి.

మహారాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువయ్యేలా చేయడం ఎంత ముఖ్యమో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను రూపకల్పన చేయడం కూడా అంతే ముఖ్యంసమాజంలోని ప్రతి వర్గం దేశాభివృద్ధిలో పాలు పంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుందివికసిత్ భారత్‌కు మహిళలు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుందిసమాజంలో మార్పు తీసుకువచ్చే బాధ్యతను మహిళలు తీసుకుంటే ఏదైనా సాధ్యమవుతుందిమహారాష్ట్ర గడ్డ దానికి సాక్ష్యంమహిళల అక్ష్యరాస్యతకై ఈ నేల మీదే సావిత్రిబాయి ఫూలే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారుదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల ఇక్కడే ప్రారంభమైందిఈ ఉద్యమ జ్ఞాపకాలువారసత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యంబాలికల కోసం తొలి పాఠశాల స్థాపించిన ఈ ప్రదేశంలోనే సావిత్రీబాయి ఫూలే స్మారకానికి ఈరోజు శంకుస్థాపన చేశానుఇందులో నైపుణ్యాభివృద్ధి కేంద్రంగ్రంథాలయంఅవసరమైన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నానుఈ స్మారకం సామాజిక చైతన్య ఉద్యమ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతుందిఅలాగే సమాజానికిభవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలిగిస్తుంది.

సోదర సోదరీమణులారా,

స్వాతంత్ర్యానికి పూర్వం మన సమాజంలో పేదరికంవివక్ష ఎక్కువగా ఉండేవిఆరోజుల్లో విద్య బాలికలకు అందని ద్రాక్షలా ఉండేదిసావిత్రీబాయి ఫూలే లాంటి గొప్పవారు బాలికా విద్యకై కృషి చేశారుస్వాతంత్ర్యం సాధించిన తర్వాత కూడా మనదేశం పాత మనస్తత్వం నుంచి పూర్తిగా బయటపడలేదుగత ప్రభుత్వాలు చాలా విభాగాల్లో మహిళలకు ప్రవేశాన్ని అడ్డుకున్నాయిపాఠశాలల్లో మరుగుదొడ్ల లాంటి కనీస సౌకర్యాలు ఉండేవి కాదుఫలితంగా బడి ఉన్నప్పటికీ అమ్మాయిలకు మాత్రం దాని తలుపులు ఎప్పుడూ మూసే ఉండేవిఆడపిల్లలు కాస్త పెద్దయ్యేసరికి చదువు మానేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవిసైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశంపై నిషేధం ఉండేదిఅలాగే ఆర్మీలోని చాలా విభాగాల్లో మహిళలకు అనుమతి ఉండేది కాదుఅదేవిధంగా గర్భం దాల్చిన తర్వాత ఎంతో మంది మహిళలు ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చేదిగత ప్రభుత్వాలు అవలంభించిన ఈ తరహా పాత ధోరణిని మేము పూర్తిగా మార్చివేశాంస్వచ్ఛభారత్ అభియాన్ (క్లీన్ ఇండియాకార్యక్రమాన్ని ప్రారంభించాంఇది దేశంలోని కుమార్తెలుతల్లులకు  బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి కల్పించి మేలు చేకూర్చిందిపాఠశాలల్లో టాయిలెట్లను నిర్మించడం వల్ల బాలికల్లో చదువు మానేసేవారి సంఖ్య తగ్గిందిఆర్మీమిలటరీ పాఠశాలల్లో మహిళలకు అనేక అవకాశాలు కల్పించాంమహిళల భద్రత కోసం కఠినచట్టాలు తీసుకొచ్చాంవీటితో పాటుగా ప్రజాస్వామ్యంలో మహిళా భాగస్వామ్యం పెంచే హామీని నారీ శక్తి వందన్ అధీనియం ద్వారా ఇచ్చాం.

 

స్నేహితులారా,

మన ఆడపిల్లలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు ఎప్పుడు వస్తాయో అప్పుడే మన దేశ అభివృద్ధి తలుపులు తెరుచుకుంటాయిమహిళాసాధికారత దిశగా మనం చేస్తున్న ప్రయత్నాలుకార్యక్రమాలను సావిత్రీబాయి ఫూలే స్మారకం శక్తిమంతం చేస్తుందని నమ్ముతున్నాను.

స్నేహితులారా,

మహారాష్ట్ర ప్రాంతం అందించే ప్రేరణ ఎప్పటిలానే దేశానికి మార్గనిర్దేశం చేస్తుందని విశ్వసిస్తున్నానుమనమంతా కలసి, ‘వికసిత్ మహారాష్ట్రవికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన మహారాష్ట్రఅభివృద్ధి చెందిన భారత్లక్ష్యాన్ని సాధిద్దాంమరోసారి ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానుఅందరికీ ధన్యవాదాలు.

గమనిక: ప్రధాని హిందీలో చేసిన ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2060998) Visitor Counter : 29