ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మిథున్ చక్రవర్తి కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: ప్రధాన మంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
30 SEP 2024 11:39AM by PIB Hyderabad
భారత చలనచిత్ర రంగానికి అందించిన అసమానమైన సేవలకు గాను ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని’ శ్రీ మిథున్ చక్రవర్తికి ప్రదానం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు అభినందనలు తెలియజేశారు. శ్రీ మిథున్ చక్రవర్తి సాంస్కృతిక రంగంలో ఓ ప్రముఖుడు; ఆయన బహుముఖ పాత్రపోషణ ప్రతిభ ప్రేక్షకలోకంలో తరాలకు అతీతంగా ప్రశంసలకు పాత్రమైందంటూ శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.
కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఒక సందేశానికి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, తన అభిప్రాయాన్ని ఈ కింది విధంగా వ్యక్తం చేశారు:
“భారత చలనచిత్ర రంగానికి శ్రీ మిథున్ చక్రవర్తి అందించిన సాటిలేనటువంటి సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాకరమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించడం నాకు సంతోషాన్ని కలిగించింది. సాంస్కృతిక రంగంలో ఆయనో ప్రముఖుడు, అనేక విధాల పాత్రలను చాలా ప్రతిభాన్వితంగా ఆయన పోషించిన తీరు తరాలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానానికి నోచుకొంది. ఆయనకు ఇవే అభినందనలు, శుభాకాంక్షలు కూడా..."
(रिलीज़ आईडी: 2060218)
आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam