సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీల ద్వారా మీ సృజనాత్మకతను వెలికితీయండి
వేవ్స్ కోసం ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ‘క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీల్లో పాల్గొనాలని ప్రధానమంత్రి పిలుపు: 114వ మన్ కీ బాత్ కార్యక్రమం
సంగీతం, విద్య, పైరసీ వ్యతిరేక రంగాలలో గేమింగ్, యానిమీ, రీల్ ఆండ్ ఫిల్మ్ మేకింగ్ పోటీల ద్వారా క్రియేటర్లకు అపరిమిత అవకాశం: శ్రీ నరేంద్ర మోదీ
మీడియా-వినోద పరిశ్రమ, క్రియేటర్ ఎకానమీని ప్రోత్సహించడానికి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ నిర్వహణ
Posted On:
29 SEP 2024 2:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన 114వ మన్ కీ బాత్ ప్రసంగంలో భాగంగా వేగంగా మార్పు చెందుతున్న ఉద్యోగాల తీరు, గేమింగ్, ఫిల్మ్ మేకింగ్ వంటి సృజనాత్మక రంగాల్లో పెరుగుతున్న అవకాశాల గురించి మాట్లాడారు. దేశంలో సృజనాత్మక ప్రతిభకు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘క్రియేట్ ఇన్ ఇండియా’ ఇతివృత్తంతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న 25 పోటీల్లో పాల్గొనాలని ఆయన క్రియేటర్లకు పిలుపునిచ్చారు.
జాబ్ మార్కెట్ రూపాన్ని మార్చనున్న సరికొత్త సృజనాత్మక రంగాలు
కొత్తగా ఉద్భవిస్తున్న రంగాలు జాబ్ మార్కెట్ రూపాన్ని మార్చేస్తున్నాయని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రధానంగా పేర్కొన్నారు. “మార్పు చెందుతున్న ప్రస్తుత కాలంలో ఉద్యోగాల స్వభావమూ మారుతోంది. గేమింగ్, యానిమీ, రీల్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్, పోస్టర్ మేకింగ్ వంటి కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నైపుణ్యాల్లో మీరు బాగా రాణించగలిగితే మీ ప్రతిభకు చాలా పెద్ద వేదిక లభిస్తుంది.” అని ఆయన అన్నారు. బ్యాండ్‌లు, కమ్యూనిటీ రేడియో ఔత్సాహికులు, సృజనాత్మక నిపుణులకు అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, మరింత ప్రోత్సహించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 25 పోటీలను ప్రారంభించింది. పైరసీ వ్యతిరేకత, విద్య, సంగీతం వంటి విభిన్న రంగాల్లో ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించడం ఈ పోటీల లక్ష్యం. ఈ పోటీల్లో పాల్గొనడానికి wavesindia.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని క్రియేటర్లకు ఆయన పిలుపునిచ్చారు. “దేశంలోని క్రియేటర్లు తప్పకుండా ఇందులో పాల్గొనాలి. వారి సృజనాత్మకతను బయటకు తీసుకురావాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నా” అని ఆయన పేర్కొన్నారు.
క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ - మొదటి సీజన్
క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ - మొదటి సీజన్‌ను న్యూఢిల్లీలో గత నెల 22న కేంద్ర సమాచార, ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. ఈ పోటీలు త్వరలో జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్(వేవ్స్)కు సన్నాహకంగా పని చేస్తాయి. 78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న “భారత్‌లో తయారీ, ప్రపంచం కోసం తయారీ” అనే సంకల్పానికి అనుగుణంగా ఇవి జరుగుతాయి.
***
(Release ID: 2060134)
Visitor Counter : 55
Read this release in:
Tamil
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Gujarati
,
Malayalam