ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

అమెరికాలోని న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం

Posted On: 23 SEP 2024 3:58AM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

నమస్తే అమెరికాఇప్పుడు మన "నమస్తేకూడా స్థానికం నుంచి అంతర్జాతీయంగా మారిపోయిందిఇదంతా మీ వల్లేభారత్ ను హృదయానికి  దగ్గరగా ఉంచుకునే ప్రతి భారతీయుడు దీన్ని సుసాధ్యం చేశాడు.

స్నేహితులారా,

మీరంతా దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారుకొన్ని ముఖాలు సుపరిచితమైనవిమరికొన్ని కొత్తవిమీ ప్రేమపట్ల నాకు గొప్ప గౌరవం ఉందినేను ప్రధానినీముఖ్యమంత్రినీనాయకుడినీ ఎంతమాత్రం కాని రోజులు గుర్తున్నాయిఅప్పట్లో ఈ దేశాన్ని చూడాలన్నఅర్థం చేసుకోవాలన్న ఆసక్తితోమనసులో ఎన్నో ప్రశ్నలతో జిజ్ఞాసగల యాత్రికుడిగా ఇక్కడికి వచ్చే వాడినినేను ఎలాంటి అధికారిక పదవిలో లేకుండానే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించానుఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాక టెక్నాలజీ ద్వారా మీతో మమేకమయ్యానుతరువాత ఒక ప్రధానమంత్రిగా కూడా మీ నుండి అపారమైన ప్రేమ,  స్నేహాన్ని పొందాను. 2014లో మాడిసన్ స్క్వేర్, 2015లో శాన్ జోస్, 2019లో హ్యూస్టన్, 2023లో వాషింగ్టన్ఇప్పుడు 2024లో న్యూయార్క్—ప్రతిసారీమీరు గత రికార్డును అధిగమిస్తూ వెళుతున్నారు.

స్నేహితులారా

ప్రవాస భారతీయుల బలాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తిస్తానునేను ఏ అధికారిక పదవిలో లేనప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకున్నానుఇప్పుడు కూడా అర్థం చేసుకుంటున్నానుమీరు ఎల్లప్పుడూ భారతదేశానికి అత్యంత శక్తిమంతమైన బ్రాండ్ అంబాసిడర్లుఅందుకే నేను మిమ్మల్ని 'భారత దేశ దూతలుఅని పిలుస్తానుమీరు అమెరికాను భారత దేశంతో,  భారత్‌ను అమెరికాతో కలిపారుమీ నైపుణ్యాలుప్రతిభనిబద్ధత అమోఘంమీరు సప్త సముద్రాలు దాటినామీ హృదయంలో ఉన్న భారతదేశం నుండి మిమ్మల్ని వేరు చేసేంత లోతైన సముద్రం లేదుభారతమాత నేర్పిన విషయాలను మనం ఎప్పటికీ మరచిపోలేంఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాంవైవిధ్యాన్ని ఆలింగనం చేసుకోవడంఅందులో జీవించడంచివరికి దానిని మనలోపలికి తీసుకోవడం—ఇవే మన విలువలుమనలో అంతర్లీనంగా ఉన్న విశ్వాసాలుమనం వందలాది భాషలుమాండలికాలుఅనేక మతాలకుతెగలకు పుట్టినిల్లు అయిన దేశం నుంచి వచ్చాంఅయినా ఐక్యంగా ముందుకు సాగుతున్నాంఈ హాల్లోనే కొందరు తమిళంమరికొందరు తెలుగుమలయాళంకన్నడపంజాబీమరాఠీ లేదా గుజరాతీ మాట్లాడే వారు ఉన్నారుమన భాషలు వేరు కావచ్చుకానీ మన ఆత్మ ఒక్కటే. “భారత మాతా కి జై”ఇదే భారతీయ స్ఫూర్తిప్రపంచంతో కలవడంలో ఇదే మన అత్యంత గొప్ప శక్తిఈ విలువలు మనల్ని  సహజంగానే 'విశ్వబంధు' (ప్రపంచ మిత్రుడు)గా మారుస్తాయిమన శాస్త్రాలు చెబుతున్నట్లుగా, "తేన త్యక్తేన భుజీథాః అంటే త్యాగం చేసే వారే నిజమైన ఆనందాన్ని పొందుతారుఇతరులకు మంచి చేయడం ద్వారాత్యాగం చేయడం ద్వారా ఆనందాన్ని పొందగలంమనం ఎక్కడ నివసిస్తున్నాఈ  స్ఫూర్తి ఇలాగే ఉంటుందిమనం  నివసించే సమాజాలకు మన వంతు సేవలను పూర్తిగా అందిస్తాంఅమెరికాలో డాక్టర్లుపరిశోధకులుసాంకేతిక నిపుణులుశాస్త్రవేత్తలు లేదా ఇతర వృత్తుల్లో ఉన్నామీరు అత్యున్నత స్థాయికి ఎదిగారుదాన్ని ప్రపంచం కూడా చూచిందికొద్ది రోజుల కిందట ఇక్కడ టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ జరిగిందిఅమెరికా జట్టు అద్భుతంగా ఆడిందిఆ జట్టులో ఇక్కడ నివసించే భారతీయుల ప్రతిభను కూడా ప్రపంచం చూసింది

స్నేహితులారా

ప్రపంచానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అర్థంకానీ నేను ఏఐ  అంటే అమెరికాఇండియా అని భావిస్తాను.  ఈ అమెరికాఇండియా (భారత్ స్ఫూర్తి కొత్త ప్రపంచానికి ఏఐ శక్తిఇది ఇండోఅమెరికా సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందిప్రవాస భారతీయులైన మీ అందరికీ నా వందనాలు.

స్నేహితులారా

నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రతి నాయకుడి నుంచి ప్రవాస భారతీయుల గురించిన ప్రశంసలు మాత్రమే వింటానునిన్ననే అధ్యక్షుడు బైడెన్ నన్ను డెలావేర్ లోని తన ఇంటికి ఆహ్వానించారుఆయన చూపించిన ఆప్యాయతఆతిథ్యం మనసుకు హత్తుకుందిఈ గౌరవం 140 కోట్ల భారతీయులకుమీ కష్టానికిఇక్కడ నివసిస్తున్న లక్షలాది భారతీయులకే చెందుతుందిప్రెసిడెంట్ బైడెన్‌కుమీ అందరికీ నా కృతజ్ఞతలు.

స్నేహితులారా,

2024 సంవత్సరం ప్రపంచానికి అత్యంత కీలకమైనదిఒకవైపు దేశాల మధ్య సంఘర్షణలుఉద్రిక్తతలు కనిపిస్తాయిమరొకవైపు కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంతో పరిఢవిల్లుతాయిఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో భారత్అమెరికా కలిసి ఉన్నాయిఇక్కడ అమెరికాలో ఎన్నికలు రాబోతున్నాయిభారత్ ఇప్పటికే తన ఎన్నికలను నిర్వహించిందిఈ ఎన్నికలు భారతదేశంలోనే కాకుండామానవ చరిత్రలోనే అతి పెద్దవిమీరు ఊహించవచ్చుమీరు ఊహించుకోండి-  అమెరికా మొత్తం జనాభాకు దాదాపు రెట్టింపు ఓటర్లుయూరోప్ మొత్తం జనాభా కన్నా ఎక్కువ మంది ఓటర్లుభారత్‌లో ఎంతో మంది తమ ఓటు ఉపయోగించుకున్నారుభారత్ ప్రజాస్వామ్య విస్తీర్ణాన్ని చూస్తుంటేఅది మనలో గర్వాన్ని నింపుతుందిమూడు నెలలపాటు సాగిన ఓటింగ్ ప్రక్రియ,1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది, 10 లక్షల ఓటింగ్ కేంద్రాలు, 2,500 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, 8,000 కంటే ఎక్కువ అభ్యర్థులుఅనేక భాషలలో వేలాది పత్రికలువందలాది రేడియో స్టేషన్లుటీవీ న్యూస్ చానళ్లులక్షలాది సోషల్ మీడియా ఖాతాలులక్షల సోషల్ మీడియా చానళ్లు— ఇవన్నీ  భారత ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతం చేస్తున్నాయి.  ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ విస్తరిస్తున్న కాలంమన ఎన్నికల ప్రక్రియ పున సమీక్షకు లోనవుతున్న సమయం

స్నేహితులారా

సుదీర్ఘంగా సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ ఈసారి భారత్ లో అనూహ్య పరిణామానికి దారితీసిందిఏం  జరిగిందిఏం  జరిగిందిఏం జరిగింది? 'అబ్కీ బార్ – ' ( మళ్లీ ఈసారి-), 'అబ్కీ బార్ – ' ( మళ్లీ ఈ సారి-), 'అబ్కీ బార్ – ' (ఈసారి మళ్లీ-)!

స్నేహితులారా

మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందిగత 60 ఏళ్లలో భారత్ లో ఇలా జరగలేదుభారత ప్రజలు మనకు ఇచ్చిన తీర్పు చాలా ఘనమైనదిముఖ్యమైనదిఈ మూడోసారి అధికారంలో మనం ఇంకా ఎక్కువ లక్ష్యాలను సాధించాల్సి ఉందిమూడు రెట్ల బలంతోమూడు రెట్ల వేగంతో ముందుకు సాగాలిమీకు ఒక పదం గుర్తుంటుందిపుష్పం (పువ్వు). అవునుఇది కమలం అనుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదుఈ పుష్ప్  పి యు ఎస్ హెచ్ పి ని నేను ఇలా నిర్వచిస్తానుపి ప్రోగ్రెసివ్ (అభ్యుదయభారత్యుఅన్ స్టాపబుల్ (ఎదురులేనిభారత్ఎస్-  స్పిరిచ్యువల్ (ఆధ్యాత్మికభారత్ హెచ్హ్యూమానిటీ ఫస్ట్ (మానవత్వం ప్రాధాన్యభారత్ పిప్రోస్పరస్ సంపన్నభారత్పువ్వు లోని ఈ అయిదు రేకులు కలిసి ‘వికసిత్ భారత్ 'గా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తీర్చి దిద్దుతాయి.

స్నేహితులారా

స్వాతంత్రం వచ్చిన తరువాత జన్మించిన తొలి భారత ప్రధానిని నేనేస్వాతంత్ర్య సంగ్రామ సమయంలో లక్షలాది మంది భారతీయులు స్వరాజ్యం (స్వయం పాలనకోసం తమ జీవితాలను అంకితం చేశారువారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు లేదా సుఖాల గురించి ఆలోచించ లేదుఅన్నీ వదిలిపెట్టి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారువారిలో కొంతమందిని ఉరి తీశారుకొందరిని కాల్చి చంపారుకొందరు చిత్రహింసలకు గురయ్యారుఇంకా అనేక మంది యువకులు జైళ్లలో మగ్గిపోయారు.

స్నేహితులారా

మనం మన దేశం కోసం చనిపోనక్కరలేదుకానీ దాని కోసం  జీవించగలగాలి.  చనిపోవడం మన చేతుల్లో లేదుకానీ జీవించడం మన చేతుల్లోనే ఉందిమొదటి నుంచీ నా మనస్సులక్ష్యం స్పష్టంగా ఉందినేను ‘స్వరాజ్’ (స్వాతంత్ర్యంకోసం నా జీవితం ఇవ్వలేకపోయానుకానీ ‘ సురాజ్’ మంచి  పాలన) ‘సమృద్ధ’ (సంపన్న భారత్‌కు నా జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నానునా జీవితంలో ఎక్కువ భాగం ఏళ్ల తరబడి దేశమంతటా తిరుగుతూ గడిపానుఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తిన్నానుఎక్కడ కాస్త చోటు దొరికితే అక్కడ పడుకున్నానుసముద్ర తీరాల నుండి పర్వతాల వరకుఎడారి నుండి మంచుతో కప్పబడిన శిఖరం వరకు ప్రతి ప్రాంతంలో ప్రజలను కలుసుకుని వారి గురించి తెలుసుకున్నానుఅర్థం చేసుకున్నానునా దేశం గురించి,  సంస్కృతిసవాళ్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నానునా మార్గం వేరైనప్పటికీ విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందినేను ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా ఊహించలేదుకానీ 13 ఏళ్ల పాటు గుజరాత్ లో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాను. 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నన్ను ఆ తర్వాత ప్రజలు ప్రధానిగా పదోన్నతి ఇచ్చారుదేశవ్యాప్తంగా పర్యటించి నేను నేర్చుకున్న పాఠాలు రాష్ట్రకేంద్ర స్థాయిల్లో నా పాలనా నమూనాను రూపొందించాయిగత పదేళ్లలోఈ పాలనా నమూనా విజయం మీకు,  ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తుందిఇప్పుడు ఎంతో నమ్మకంతో భారత ప్రజలు నాకు మూడోసారి అవకాశం ఇచ్చారుఈ మూడో టర్మ్ ను మూడు రెట్ల బాధ్యతతో చూస్తున్నాను.

స్నేహితులారా

నేడుభారతదేశం ప్రపంచంలోని అతి పిన్నవయసు కలిగిన దేశాల్లో ఒకటిభారత్ అనేది శక్తికలలతో నిండిన దేశంప్రతి రోజు కొత్త రికార్డులు నమోదవుతున్నాయిప్రతిరోజూ కొత్త వార్తలుఈ రోజే గొప్ప శుభవార్త అందిందిచెస్ ఒలింపియాడ్ పురుషులుమహిళల విభాగాల్లోభారత్ స్వర్ణం సాధించిందికానీ నేను మీకు మరొక విషయం చెబుతున్నానుదీనికి మరింత చప్పట్లు అవసరందాదాపు వందేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారిచదరంగం క్రీడాకారులను చూసి యావత్ దేశంప్రతి భారతీయుడు గర్వపడుతున్నారుఅన్నట్టు భారత్‌ను నడిపించే మరో ఏఐ ఉందిఅది ఏమిటంటేఎ అంటే యాస్పిరేషనల్ ఐ అంటే ఇండియా (భారత్).  యాస్పిరేషనల్ ఇండియా అంటే ఆకాంక్షాత్మక భారత్ఇది మన కొత్త శక్తికోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు భారత్ అభివృద్ధిని నడుపుతున్నాయిప్రతి ఆకాంక్ష కొత్త విజయానికి దారితీస్తోందిప్రతి విజయం కొత్త ఆకాంక్షకు ఊపిరి పోస్తోందికేవలం దశాబ్ద కాలంలోనే భారత్ 10వ స్థానం నుంచి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందిభారత్ త్వరగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడునేడుభారతదేశ జనాభాలో అధిక భాగం ప్రజల ప్రాథమిక అవసరాలు తీరాయిగత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛమైన వంటగ్యాస్కుళాయి నీరువిద్యుత్మరుగుదొడ్లు పొందారుఈ కోట్ల మంది ఇప్పుడు మెరుగైన జీవన ప్రమాణాలను ఆశిస్తున్నారు

స్నేహితులారా

భారత ప్రజలకు కేవలం రోడ్లు మాత్రమే అక్కర్లేదువారు అద్భుతమైన ఎక్స్ ప్రెస్ వేలను కోరుకుంటున్నారుఇప్పుడు భారత ప్రజలు కేవలం రైలు సౌకర్యాన్ని  మాత్రమే కోరుకోవడం లేదుహైస్పీడ్ రైళ్లు కావాలంటున్నారుభారత్ లోని ప్రతి నగరం  మెట్రో సేవలను ఆశిస్తోందిఅలాగే ప్రతి నగరం సొంత విమానాశ్రయం కోసం ఎదురుచూస్తోందిగ్రామం నుంచైనానగరం నుంచైనా ప్రతి పౌరుడుప్రపంచ స్థాయి సౌకర్యాలను కోరుకుంటున్నారుమేం ఈ ఆకాంక్షల ఫలితాలను చూస్తున్నాం. 2014లో భారత్ లో కేవలం అయిదు నగరాల్లో మాత్రమే మెట్రో సర్వీసులు ఉన్నాయిప్రస్తుతం 23 నగరాల్లో మెట్రోలు ఉన్నాయిప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో సర్వీసులు కలిగిన దేశంభారత్ రోజురోజుకూ విస్తరిస్తోంది.

స్నేహితులారా

2014లో భారత్ లో కేవలం 70 నగరాల్లో మాత్రమే విమానాశ్రయాలు ఉన్నాయినేడు, 140 కి పైగా నగరాలలో విమానాశ్రయాలు ఉన్నాయి. 2014లో 100 కంటే తక్కువ గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఉందినేడు, 200,000 కంటే ఎక్కువ పంచాయతీలు దీనిని కలిగి ఉన్నాయి. 2014 లో భారతదేశంలో 14 కోట్ల ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారునేడుఈ సంఖ్య 31 కోట్లకు పైగా పెరిగిందిఏళ్ల తరబడి పట్టే పనులు ఇప్పుడు నెలల లోనే  పూర్తవుతున్నాయిభారతదేశ ప్రజలలో కొత్త విశ్వాసం కనబడుతోందితమ లక్ష్యాలను చేరుకునే సంకల్పం వారిలో ఉందిభారత్‌లో అభివృద్ధి ప్రజల ఉద్యమంగా మారుతోందిప్రతి భారతీయుడు ఈ అభివృద్ధి ఉద్యమంలో సమాన భాగస్వామిగా మారుతున్నారువారు భారత్ విజయంపైఅది సాధించే వాటిపై నమ్మకంతో ఉన్నారు

స్నేహితులారా

నేడు భారత్ లో ఎన్నో అవకాశాలు అందుబాటు లో ఉన్నాయిఇక అవకాశాల కోసం భారత్ ఎదురు చూడవలసిన పరిస్థితి లేదుఅవకాశాలను భారత దేశమే సృష్టిస్తుందిగత పదేళ్లుగా ప్రతి రంగంలో అవకాశాలు తెరిచేందుకు  భారత్ కొత్త ప్రయోగ వేదికను సిద్ధం చేసిందిఇది చూడండి గత దశాబ్దంలో, 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తెచ్చాంఇది మీకు గర్వకారణంఇది ఎలా జరిగిందిఇది పాత ఆలోచన విధానాన్నిపద్ధతులను మారిస్తేనే ఇది సాధ్యమైంది.  పేదల సాధికారతపై దృష్టి పెట్టాం. 50 కోట్లకుపైగా ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించాం. 55 కోట్లకు పైగా ప్రజలకు 5,00,000 రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించాం. 4 కోట్లకు పైగా కుటుంబాలకు సరైన గృహాలను అందించాంపూచీకత్తు లేకుండా లక్షలాది మందికి సులభంగా రుణాలను అందించాంఅలాంటి చొరవ ప్రజలను పేదరికం నుండి పైకి తీసుకురావడానికి సహాయపడిందిపేదరికాన్ని అంత మొందించడానికి సహాయపడిందిపేదరికం నుండి బయటపడిన వారు నేడు కొత్త మధ్య తరగతిగా ఆవిర్భవించారుఆ వర్గమే నేడు భారతదేశ అభివృద్ధిని వేగవంతం చేసే చోదక శక్తిగా మారింది.

స్నేహితులారా

మహిళా సంక్షేమంతో పాటు మహిళా ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాంప్రభుత్వం నిర్మించిన కోట్లాది ఇళ్లను మహిళల పేరిట రిజిస్టర్ చేయిస్తున్నాంతెరిచిన బ్యాంకు ఖాతాల్లో సగానికిపైగా మహిళల పేరిటే ఉన్నాయిగత దశాబ్ద కాలంలో 10 కోట్ల మంది భారతీయ మహిళలు ‘‘సూక్ష్మ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పథకం’’లో మరో ఉదాహరణ చెబుతానుభారతదేశంలో వ్యవసాయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడానికి మేం గణనీయమైన ప్రయత్నాలు చేస్తున్నాంనేడు వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నాండ్రోన్లు మీకు కొత్త కాకపోవచ్చుకానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటేవాటికి ఎవరు బాధ్యత వహిస్తున్నారో మీకు తెలుసావారు  గ్రామీణ మహిళలుడ్రోన్ పైలట్లుగా మారేందుకు వేలాది మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నాంవ్యవసాయంలో ఈ అద్భుతమైన సాంకేతిక విప్లవానికి  గ్రామీణ మహిళలే సారధ్యం వహిస్తున్నారు

స్నేహితులారా

ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు ఇప్పుడు జాతీయ ప్రాధాన్యాలుగా మారాయిమునుపటి కంటే ఈ రోజు భారత్ ప్రపంచానికి మరింత చేరువ అయిందిభారతదేశ జి మార్కెట్ ప్రస్తుత పరిమాణం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చునేను చెబితే మీకు అభ్యంతరం లేదుగానేడుభారతదేశ జి మార్కెట్ అమెరికా కంటే పెద్దదిఈ ఘనత కేవలం రెండు సంవత్సరాలలో సాధ్యం అయిందిప్రస్తుతం భారత్ మేడ్ ఇన్ ఇండియా 6జీపై పనిచేస్తోందిఇది ఎలా జరిగిందిఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేం విధానాలను రూపొందించడం వల్ల ఇది జరిగిందిమేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీచౌకైన డేటామొబైల్ ఫోన్ల తయారీలో పెట్టుబడులు పెట్టాంనేడు ప్రపంచంలోని ప్రతి ప్రధాన మొబైల్ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియాప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు భారత్నా పదవీకాలానికి ముందుమేం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందికానీనేడు వాటిని ఎగుమతి చేస్తున్నాం.

స్నేహితులారా

భారత్  ఇక వెనకడుగు వేయదుభారత్ నేడు కొత్త వ్యవస్థలను సృష్టిస్తోందిదిశా నిర్దేశం చేస్తోందిడిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐఅనే కొత్త భావనను భారత్ ప్రపంచానికి పరిచయం చేసిందిడిపిఐ సమానత్వాన్ని ప్రోత్సహించిఅవినీతిని తగ్గించడంలో శక్తిమంతమైన సాధనంగా మారిందిభారత యూపీఐ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందిమీ జేబులో వాలెట్ ఉందిభారతదేశంలో ప్రజలు తమ ఫోన్లలో ఫిజికల్ వాలెట్లు-వాలెట్లు రెండింటినీ కలిగి ఉన్నారుచాలా మంది భారతీయులు ఇప్పుడు అవసరమైన పత్రాలను వెంట తీసుకు వెళ్ళడం లేదుఎందుకంటే వారు ఇప్పుడు డిజీలాకర్ ను ఉపయోగిస్తున్నారువిమానాశ్రయాలకు వెళ్ళడానికి వారు సులభంగా డీజీయాత్రను ఉపయోగిస్తున్నారుఇది డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్కొత్త ఆవిష్కరణఉద్యోగసృష్టి సంబంధిత ప్రతి సాంకేతికతకు కొత్త వేదికగా మారింది

స్నేహితులారా

భారత్ ఇప్పట్లో ఆగదునెమ్మదించదుభవిష్యత్తులో సాధ్యమైనంత వరకు ఎక్కువ అంతర్జాతీయ సాంకేతిక పరికరాలు భారత్ తయారీ (మేడ్ ఇన్ ఇండియాచిప్స్ తోనే పనిచేస్తాయిసెమీకండక్టర్ రంగాన్ని భారత్ వేగవంతమైన వృద్ధికి పునాదిగా చేసుకున్నాంగత ఏడాది జూన్ లో సెమీకండక్టర్ పరిశ్రమకు భారత్ ప్రోత్సాహకాలను ప్రకటించగా కొద్ది నెలలకే మైక్రాన్ తొలి సెమీకండక్టర్ యూనిట్ కు శంకుస్థాపన జరిగిందిఇప్పటి వరకు భారతదేశంలో అలాంటి అయిదు యూనిట్లకు అనుమతి లభించిందిఅమెరికాలో కూడా మేడ్ ఇన్ ఇండియా చిప్స్ చూసే రోజు ఎంతో దూరంలో లేదుఈ చిన్న చిప్ భారత్ ను అభివృద్ధి దిశగా అపూర్వ శిఖరాలకు తీసుకెళ్తుందిఇది మోదీ వాగ్దానం.

స్నేహితులారా,

నేడు భారత్ లో సంస్కరణల పట్ల అపూర్వమైన సంకల్పంనిబద్ధత  ఉన్నాయిమా హరిత ఇంధన మార్పు కార్యక్రమం (గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్)’ దీనికి ప్రధాన ఉదాహరణప్రపంచ జనాభాలో 17 శాతం ఉన్నప్పటికీప్రపంచ కర్బన ఉద్గారాలలో భారత్ వాటా కేవలం శాతం మాత్రమేభూగోళానికి  హాని కలిగించడంలో మా పాత్ర ఏమీ లేదువాస్తవానికిమిగిలిన ప్రపంచంతో పోలిస్తేమా వల్ల ప్రభావం చాలా తక్కువమేం కూడా  కార్బన్ ఉద్గారాలపై  ఆధారపడి మా అభివృద్ధిని పెంచుకోవచ్చు
. కానీ ప్రకృతి పట్ల ఉన్న మా ప్రగాఢ గౌరవాన్ని ఆధారంగా చేసుకుని హరిత మార్గాన్ని ఎంచుకున్నాంఅందుకే మేం సౌరగాలినీరుగ్రీన్ హైడ్రోజన్అణుశక్తి వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాంజీ20లో పారిస్ పర్యావరణ లక్ష్యాలను సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. 2014 నుంచి మన సౌరశక్తి సామర్థ్యం 30 రెట్లు పెరిగిందిదేశంలోని ప్రతి ఇంటిని సౌరశక్తితో నడిచే ఇల్లుగా మార్చేందుకు కృషి చేస్తున్నాంఅందుకోసం విస్తృత రూఫ్ టాప్ సోలార్ మిషన్ ను ప్రారంభించాంనేడు రైల్వే స్టేషన్లువిమానాశ్రయాలు సౌరశక్తి వినియోగ కేంద్రాలుగా మారుతున్నాయిఇళ్ల నుంచి వీధుల్లోకి భారత్ ఇంధన సమర్థవంతమైన లైటింగ్ వైపు ప్రయాణం ప్రారంభించిందిఈ ప్రయత్నాల వల్ల భారత్ లో పెద్ద సంఖ్యలో హరిత (గ్రీన్ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి

స్నేహితులారా,

21వ శతాబ్దం భారత్ విద్యనైపుణ్యాలుపరిశోధనఆవిష్కరణల ద్వారా అభివృద్ధి చెందుతోందినలంద విశ్వవిద్యాలయం  మీ అందరికీ సుపరిచితమేభారతదేశ ప్రాచీన నలందా విశ్వవిద్యాలయాన్ని ఆధునిక రూపంలో పునరుద్ధరించారుఇవాళఅది కేవలం విశ్వవిద్యాలయం మాత్రమే కాదుపునర్జన్మ పొందిన నలందా ఆత్మ కూడాప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భారత్ కు వచ్చి చదువుకునేందుకు ఆకర్షించే ఆధునిక విద్యా అనుకూల వ్యవస్థను సృష్టిస్తున్నాంగత పదేళ్లలో భారత్ లో చెప్పుకోదగిన సంఘటన ఒకటి జరిగిందిఈ కాలంలోభారతదేశంలో ప్రతివారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు అయిందిప్రతిరోజూ రెండు కొత్త కళాశాలలు స్థాపించాంప్రతిరోజూ ఒక కొత్త ఐటీఐ ప్రారంభం అయిందిదశాబ్ద కాలంలో ఐఐఐటీల సంఖ్య నుంచి 25కుఐఐఎంల సంఖ్య13 నుంచి 21కిఎయిమ్స్ సంఖ్య మూడు రెట్లు పెరిగి 22కు చేరిందిఇదే కాలంలో మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు అయిందినేడు ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు భారత్ కు వస్తున్నాయిభారత్ ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి పొందిందిప్రపంచం భారతీయ డిజైనర్ల శక్తిని చాలా కాలంగా చూస్తోందిఇప్పుడు అది 'డిజైన్ ఇన్ ఇండియాఅద్భుతాలను చూస్తుంది

స్నేహితులారా,

ఈ రోజుభారత్ భాగస్వామ్యాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయిగతంలోభారత్ సమాన దూరం విధానాన్ని అనుసరించిందికానీ ఇప్పుడు అందరూ దగ్గరేఅన్న విధానాన్ని తీసుకుందిమనం ప్రపంచ దక్షిణాది బలమైన గొంతుగా కూడా మారుతున్నాంభారత్ ప్రయత్నం వల్లఆఫ్రికా యూనియ‌న్ G20 లో శాశ్వత సభ్యత్వం పొందడాన్ని మీరు గమనించారుఈ రోజుభారత్ ప్రపంచ వేదికపై మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం వినడమే కాదుఅర్థం చేసుకుంటోందిఇటీవలే "ఇది యుద్ధ కాలం కాదుఅని నేను చెప్పినప్పుడుఆ ప్రకటన ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా అర్థమైంది.

స్నేహితులారా,

ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభం తలెత్తినప్పుడు ముందుగా స్పందించేది భారత్ మాత్రమేకోవిడ్-19 మహమ్మారి సమయంలో 150కి పైగా దేశాలకు వ్యాక్సిన్లుమందులు పంపాంభూకంపం అయినాతుఫాను అయినాఅంతర్యుద్ధం అయినా మొదట సాయం అందించింది మేమేఇది మన పూర్వీకులు నేర్పిన విలువలుబోధనలకు ప్రతిబింబం.

స్నేహితులారా,

ప్రపంచ వేదికపై భారత్ కొత్త ఉత్ప్రేరకంగా ఆవిర్భవిస్తోందిదాని ప్రభావం అన్ని రంగాల్లోనూ కనబడుతోందిప్రపంచ వృద్ధిని వేగవంతం చేయడంప్రపంచ శాంతిని ప్రోత్సహించడంపర్యావరణ చర్యలను ముందుకు తీసుకెళ్లడంఅంతర్జాతీయ నైపుణ్యాల లోటును పూడ్చడంసృజనాత్మకతను ప్రోత్సహించడంఅంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను స్థిరీకరించడం వంటి కార్యక్రమాల్లో భారత్ పాత్ర కీలకంగా మారింది.

స్నేహితులారా,
భారతదేశానికి శక్తిసామర్థ్యాలు "జ్ఞానాయ దానాయ చ రక్షణాయ", అంటే జ్ఞానం పంచడానికీ
ధనం ఆపన్నులను ఆదుకోవడానికీఅధికారం ఇతరులను రక్షించడానికి అని అర్థంఅందుచేత ఆధిపత్యాన్ని ప్రదర్శించడం భారత్ ప్రాధాన్యం కాదుఇతరులను ప్రభావితం చేయడమే మా లక్ష్యం. మేం దహించే అగ్ని కాదువెలుగును అందించే సూర్య కిరణాలంమనం ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించడం లేదుకానీ దాని శ్రేయస్సుకు కోసం ప్రయత్నిస్తాం. యోగాను ప్రోత్సహించడం అయినాసూపర్ ఫుడ్ చిరుధాన్యాలకు మద్దతు ఇవ్వడం అయినా లేదా మిషన్ లైఫ్ విజన్ (పర్యావరణం కోసం జీవనశైలిను ముందుకు తీసుకు వెళ్ళడం అయినా భారత్ జిడిపి-కేంద్రిత అభివృద్ధితో పాటు మానవ -కేంద్రిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందిఇక్కడ సాధ్యమైనంత వరకు మిషన్ లైఫ్ ను ప్రమోట్ చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానుజీవనశైలిలో చిన్న మార్పులు పర్యావరణంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయిమీరు విని ఉండవచ్చు ఇంకా భారత్ లో ఊపందుకుంటున్న ఉద్యమంలో ఇప్పటికే మీలో కొందరు పాల్గొని ఉండవచ్చుదేశవ్యాప్తంగా ప్రజలు తమ మాతృ మూర్తుల గౌరవార్థం ఒక చెట్టు (ఎక్ పేడ్.. మా కే నామ్నాటుతున్నారుమీ అమ్మ గారు జీవించి ఉంటే ఆమెతో కలసి ఒక మొక్క నాటండిఆమె జీవించి లేకపోతే ఆమె ఫోటో ను మీతో పెట్టుకుని ఆమె పేరు మీద ఒక మొక్క నాటండిఈ ఉద్యమం భారతదేశంలోని ప్రతి మూలలో జరుగుతోంది. ఇలాంటి ప్రచారాన్ని ఇక్కడ ప్రారంభించడానికి నేను మీ అందరినీ ప్రోత్సహిస్తున్నారుఇది మనకు జీవితాన్ని ప్రసాదించిన తల్లులను మాత్రమే కాదుభూమాతను కూడా గౌరవిస్తుంది.

స్నేహితులారా,

భారత్ ఈ రోజు పెద్ద కలలు కంటోందివాటిని నెరవేర్చు కోవడానికి ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందికొద్ది రోజుల కిందట పారిస్ ఒలింపిక్స్ ముగిశాయితదుపరి ఆతిథ్యం అమెరికాదేత్వరలో భారత్ లో జరిగే ఒలింపిక్స్ ను కూడా మీరు చూడబోతారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాంక్రీడలువ్యాపారంవినోదం ఇలా ఏ రంగంలోనైనా భారత్ ప్రపంచ ఆకర్షణ కేంద్రంగా మారిందిఈ రోజు ఐపీఎల్ వంటి భారతీయ లీగ్ లు ప్రపంచంలోని అగ్ర లీగ్‌లలో ఒకటిగా ఉన్నాయిఉంటాయిభారతీయ సినిమాలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయిప్రపంచ  టూరిజంలో కూడా భారత్ దూసుకెళ్తోందివివిధ దేశాల్లో భారతీయ పండుగలను జరుపుకోవడానికి ఆసక్తి పెరుగుతోందినవరాత్రి కోసం గర్భా నేర్చుకుంటున్న వారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో కనిపిస్తున్నారుఇది  భారత్‌ పట్ల వారి ప్రేమను ప్రతిబింబిస్తుంది.

స్నేహితులారా,

నేడుప్రతి దేశం భారతదేశం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోందిమీకు ఆనందం కలిగించే మరో విషయం నా దగ్గర ఉందినిన్ననేభారతదేశం నుండి దొంగతనానికి గురైన 1,500 నుండి 2,000 సంవత్సరాల పురాతన శిలాశాసనాలువిగ్రహాలను అమెరికా భారతదేశానికి తిరిగి ఇచ్చింది. ఇప్పటివరకు అమెరికా అటువంటి 500 కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇచ్చిందిఇది కేవలం కొన్ని వస్తువులను తిరిగి ఇవ్వడం గురించి మాత్రమే కాదు. ఇది వెయ్యేళ్ల నాటి మరో గొప్ప వారసత్వానికి నివాళిఇది భారత్ కుమీ అందరికీ గర్వకారణంఇందుకు అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు.  

స్నేహితులారా,

భారత్అమెరికాల మధ్య భాగస్వామ్యం రోజురోజుకూ బలపడుతోందిసహకారం అన్నది ప్రపంచ ప్రయోజనం కోసం
. మేం అన్ని రంగాలలో సహకారాన్ని పెంచుకుంటున్నాంమీ సౌలభ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. గత సంవత్సరంనేను సియాటెల్ లో ఒక కొత్త కాన్సులేట్ ను ప్రారంభించాను. అది ఇప్పుడు పని ప్రారంభించిందిమరో రెండు కాన్సులేట్ల ప్రారంభానికి మీ సూచనలను నేను కోరానుమీ సూచనల ఆధారంగాబోస్టన్లాస్ ఏంజిల్స్ లలో కొత్త కాన్సులేట్ ను తెరవాలని భారత్ నిర్ణయించిందని మీకు తెలియ చేయడానికి సంతోషిస్తున్నాను.

హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో తమిళ అధ్యయనాల కోసం తిరువళ్లువర్ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం కూడా సంతోషంగా ఉందిగొప్ప తమిళ ప్రవక్త తిరువళ్లువర్ తత్వాన్ని ప్రపంచానికి ప్రచారం చేయడానికి ఇది మరింత సహాయపడుతుంది.

స్నేహితులారా,
మీతో ఈ ఆత్మీయ సమావేశం నిజంగా మరపురానిది.. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం ఎంతో అద్భుతం.. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరు కావాలని కోరుకున్నారనికానీ వేదిక చాలా చిన్నదని తెలిసిందిరాలేకపోయిన వారికి క్షమాపణలు చెబుతున్నానువచ్చేసారి మీ అందరినీ మరో వేదికపై కలిసేందుకు ఎదురు చూస్తానుఏదేమైనాఉత్సాహం అలాగే ఉంటుందనిఅభిరుచి తగ్గదని నాకు తెలుసు. మీరంతా ఆరోగ్యసౌభాగ్యాలతో ఉండాలనిభారత్-అమెరికా మైత్రిని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నానుమీ అందరికీ శుభాకాంక్షలతో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నాతో కలసి చెప్పండి…

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

ధన్యవాదాలు..

 

****



(Release ID: 2058065) Visitor Counter : 26