ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డెలావర్ లోని విల్మింటన్ లో అమెరికా అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 22 SEP 2024 2:02AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున డెలావేర్ లో జరిగే క్వాడ్ సమిట్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో భేటీ అయ్యారుశ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం అధ్యక్షుడు శ్రీ బైడెన్ విల్మింటన్ లోని తన ఇంట్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

భారత్ అమెరికాల భాగస్వామ్యానికి ముందుకు తీసుకుపోవడంలో అధ్యక్షుడు శ్రీ బైడెన్ అసమానమైన సేవలను అందించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందలు తెలిపారుఅమెరికాలో 2023 జూన్ లో తాను పర్యటించడాన్నిఅదే సంవత్సరం సెప్టెంబరు నెలలో భారతదేశంలో జరిగిన జి-20 నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారత్ కు రావడాన్ని శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తు చేశారుఈ పర్యటనలు భారత్అమెరికా భాగస్వామ్యాన్ని ఉపయోగకరంగా మార్చాయనీతగిన వేగాన్నీ అందించాయనీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ంచి కోసం జరిగే ప్రయత్నాలూప్రజాస్వామ్య విలువలూపరస్పర ప్రయోజనాలూ కలగలిసిన భారత్అమెరికా భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యం పరిపూర్ణ దశకు చేరుకోవడాన్ని ఇరుదేశాలూ ఆస్వాదిస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇప్పటి కన్నా మరింత ఎక్కువగా పెంపొందింప చేసుకొనేందుకు ఏయే మార్గాలను అనుసరించాలన్నది నేతలిద్దరూ ఈ సమావేశంలో చర్చించారుఇండో-పసిఫిక్ ప్రాంతంఆ ప్రాంతానికి వెలుపల సైతం సహకరించుకోవడాన్ని గురించీభౌగోళిక అంశాలను గురించీప్రాంతీయ అంశాలను గురించీ ఉభయులూ చర్చించారురెండు దేశాల సంబంధాలకు ఉన్న శక్తిప్రతికూలస్థితులను సైతం దీటుగా ఎదుర్కొంటూ ఈ సంబంధాలు పురోగమిస్తున్న తీరు, ఇతర రంగాలల్లో భార- అమెరికా సంబంధాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా నేతలిరువురూ పరస్పరం విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

***


(Release ID: 2057640) Visitor Counter : 38