ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా వాటి పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ప్రధానమంత్రి పునరుద్ఘాటన
ఖడ్గమృగాలను పరిరక్షణలో పాలుపంచుకుంటున్న అందరికీ అభినందనలు
Posted On:
22 SEP 2024 11:12AM by PIB Hyderabad
ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ఖడ్గమృగాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత్‌లో ఎక్కువ సంఖ్యలో ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కును సందర్శించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ మేరకు ప్రధానమంత్రి 'ఎక్స్'లో ఇలా పోస్ట్ చేశారు:
“ఇవాళ ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా మన ఖండంలోని అత్యంత ప్రసిద్ధ జీవుల్లో ఒకటైన ఖడ్గమృగాలను రక్షించేందుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. గత అనేక సంవత్సరాలుగా ఖడ్గమృగాలను పరిరక్షించడంలో భాగస్వాములు అవుతున్న అందరికీ అభినందనలు.
పెద్ద సంఖ్యలో ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు భారత్ నివాసంగా ఉండటం ఎంతో గర్వించాల్సిన విషయం. అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కును నేను సందర్శించిన విషయాన్ని అభిమానంతో గుర్తు చేసుకుంటున్నాను. మీరంతా కూడా దానిని తప్పకుండా సందర్శించాలని కోరుతున్నాను.”
(Release ID: 2057628)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam