ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికా పర్యటనకు ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన
Posted On:
21 SEP 2024 6:12AM by PIB Hyderabad
అధ్యక్షుడు బైడెన్ తన స్వస్థలం విల్మింగ్టన్ లో నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి, న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తుకు సంబంధించిన శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ ) లో ప్రసంగించడానికి నేను మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు బయలుదేరుతున్నాను.
క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో నా సహచరులు అధ్యక్షుడు బైడెన్, ప్రధానమంత్రులు- అల్బనీస్, కిషిడాలను కలవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, పురోగతి, సౌభాగ్యం కోసం పనిచేయడానికి భావసారూప్యత కలిగిన దేశాల కీలక సమూహంగా క్వాడ్ వేదిక ఆవిర్భవించింది.
ప్రజల ప్రయోజనం కోసం, ప్రపంచ దేశాల శ్రేయస్సు కోసం భారత్- అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కొత్త మార్గాలను కనుగొనడానికి, గుర్తించడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో జరిగే నా సమావేశం ఒక అవకాశాన్ని అందిస్తుంది.
ప్రపంచంలోని అతిపెద్ద, అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశాల మధ్య గల ప్రత్యేక భాగస్వామ్యానికి ఉత్తేజాన్ని అందిస్తూ, ప్రధాన భాగస్వాములుగా ఉన్న భారతీయ ప్రవాసులు, ప్రముఖ అమెరికా వ్యాపారవేత్తలను కలిసి మాట్లాడేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
మానవాళి అభ్యున్నతి కోసం ప్రపంచ సమాజానికి మార్గాన్ని నిర్దేశించడానికి సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఒక మంచి అవకాశం. ప్రపంచ జనాభాలో ఆరో వంతు ప్రజల అభిప్రాయాలను నేను పంచుకుంటాను. ఎందుకంటే శాంతియుతమైన, సురక్షితమైన భవిష్యత్తులో మానవాళి ఆశలు, ఆకాంక్షలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవి.
***
(Release ID: 2057298)
Visitor Counter : 283
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam