ప్రధాన మంత్రి కార్యాలయం
బహుమతుల వేలంలో పాల్గొని, నచ్చిన వాటిని కొనాలంటూ ప్రధాని విజ్ఞప్తి
Posted On:
19 SEP 2024 8:28PM by PIB Hyderabad
వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన జ్ఞాపికలను వేలం వేస్తున్నట్లు ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నానని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ వేలం నుంచి వచ్చే సొమ్ము నమామి గంగే కార్యక్రమానికి వెళ్తుందని ఆయన చెప్పారు. ఈ జ్ఞాపికలను సొంతం చేసుకోవడానికి pmmementos.gov.in మాధ్యమం ద్వారా నిర్వహించే వేలంపాటలో పాలుపంచుకోవాల్సిందంటూ పౌరులను ప్రధాని కోరారు.
ప్రధాన మంత్రి సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘వివిధ కార్యక్రమాలలో నేను స్వీకరించే మెమెంటోలను ప్రతి ఏటా వేలం వేస్తుంటాను. ఈ వేలంలో అందే సొమ్ము నమామి గంగే కార్యక్రమానికి దక్కుతుంది. ఈ సంవత్సరం వేలం ప్రారంభమైందని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మీకు ఆసక్తికరంగా తోచిన మెమెంటోలను సొంతం చేసుకోవడానికి వేలం పాటలో పాల్గొనగలరు.
pmmementos.gov.in”
(Release ID: 2056967)
Visitor Counter : 44
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam