ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందన
Posted On:
17 SEP 2024 10:48PM by PIB Hyderabad
భారత పురుషుల హాకీ జట్టు 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.
మన జట్టు దేశం గర్వపడేలా చేసిందని, వారి కఠోర శ్రమ, అకుంఠిత దీక్షకు ఈ విజయం నిదర్శనమని శ్రీ మోదీ కొనియాడారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘అద్భుత ప్రతిభతో ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ-2024ను సాధించిన భారత జట్టుకు నా అభినందనలు! వారి కఠోర శ్రమ, అచంచల దీక్ష, అంకితభావం యావద్బారతాన్నీ గర్వపడేలా చేశాయి’’ అని ప్రధానమంత్రి కొనియాడారు.
(Release ID: 2056562)
Visitor Counter : 38