సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"స్వచ్ఛత హీ సేవా" లో భాగంగా మరింత విస్తృతంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ : కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం

प्रविष्टि तिथि: 18 SEP 2024 9:21AM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన జూన్ 5  న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ‘ఏక్ పేడ్ మా కే నామ్’  ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు. ప్రధాని పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, భూవాతావరణాన్ని కాపాడుకోవడం ద్వారా  మరింత మెరుగైన జీవన శైలి  దిశగా సాగే ఉద్దేశంతో  మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ  ఆగస్ట్ రెండో వారం నుంచి  ప్రారంభించింది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంత్రిత్వ శాఖకు చెందిన స్థానిక అధికారులు ఇప్పటివరకు  7000 పైచిలుకు మొక్కలు నాటారు. సెప్టెంబర్ 17 నుంచి  మొదలై అక్టోబర్ 1 వరకూ కొనసాగే  స్వచ్ఛత హీ సేవా పక్షోత్సవాల్లో  భూ వాతావరణం,  పర్యావరణ రక్షణ లక్ష్యంగా  మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

 

***


(रिलीज़ आईडी: 2056265) आगंतुक पटल : 76
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Malayalam