ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజ‌రాత్, గాంధీన‌గ‌ర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగం

Posted On: 16 SEP 2024 2:58PM by PIB Hyderabad

గుజరాత్ గవర్నర్శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ,

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ జీ,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు జీ,

రాజస్థాన్ ముఖ్యమంత్రి, శ్రీ భజన్ లాల్ శర్మ జీ; మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ జీ

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, గోవా ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నారు.

వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులూ

జర్మనీ ఆర్థిక సహకార మంత్రి డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వ‌చ్చిన‌ విశిష్ట అతిథులూ నా మంత్రి మండ‌లి స‌భ్యులు ప్రహ్లాద్ జోషి జీశ్రీపాద్ నాయక్ జీ ప‌లు దేశాల నుండి వ‌చ్చిన ప్రతినిధులు...

 

వివిధ దేశాల నుండి ఇక్కడకు వచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక స్వాగతంఇది రెన్యువ‌బుల్ ఎన‌ర్జీరీ ఇన్వెస్ట్ కాన్ఫరెన్స్ నాలుగో ఎడిషన్‌రాబోయే మూడు రోజుల్లో ఇంధనంసాంకేతికరంగ‌ విధానాల భవిష్యత్తుపై విస్తృతంగా చర్చలు జరుగుతాయని భావిస్తున్నానుప‌లువురు సీనియర్ ముఖ్యమంత్రులుఈ రంగంలో విస్తృత అనుభవం ఉన్నవారు ఇక్క‌డ ఉన్నారుఈ చర్చల సమయంలో వారి విలువైన ఆలోచ‌న‌ల‌ నుండి మనం అందరం త‌ప్ప‌కుండా ప్రయోజనం పొందుతామని అనుకుంటున్నానుఇక్కడ మనం పంచుకునే జ్ఞానం మొత్తం మానవాళి అభివృద్ధికి దోహదపడుతుందిమీ అందరికీ నా శుభాకాంక్షలు.

 

స్నేహితులారా

 

మీకో విషయం తెలుసునాభారతదేశ ప్రజలు 60 ఏళ్లలో మొదటిసారి వరుసగా మూడోసారి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారుఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక భారత దేశ ప్ర‌జ‌ల‌ ఉన్న‌త‌మైన‌ ఆకాంక్షలు ఉన్నాయి. 140 కోట్ల మంది భారతీయులకు ముఖ్యంగా యువతమహిళలకుగత పదేళ్లలో వారి ఆకాంక్షలకు త‌గినంత ప్రోత్సాహం ల‌భించిందిఆ కార‌ణంగా వారు మా ప్ర‌భుత్వం మూడోసారి కూడా మరింత ఉన్నతంగా రాణిస్తామ‌న్న విశ్వాసంతో ఉన్నారుమా ప్ర‌భుత్వ మూడోసారి పాలన వల్ల దేశంలోని పేదలుఅట్టడుగున ఉన్నవారుఅణగారిన వర్గాలు గౌరవప్రదమైన జీవితం ల‌భిస్తుంద‌ని న‌మ్ముతున్నారు.

 

భారతదేశం లోని 140 కోట్ల మంది పౌరులు భార‌త‌ దేశాన్ని ప్ర‌పంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒక‌టిగా చేయాల‌నే సంకల్పంలో ఐక్యంగా ఉన్నారుకాబ‌ట్టి నేటి కార్య‌క్ర‌మాన్ని విడిగా చూడ‌కూడ‌దుఇది గొప్ప దార్శనిక‌త‌తో కూడిన‌కీల‌క‌ మిషన్‌లో భాగం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మా కార్యాచరణ ప్రణాళికలో ఇది కీలకమైన అంశంఈ మూడోసారి పాలనలో మొదటి 100 రోజులలో మేం తీసుకున్న నిర్ణయాల కార‌ణంగా సాధించిన‌ పురోగతి తాలూకా ముంద‌స్తు సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

స్నేహితులారా,

 

మొదటి 100 రోజులలోమా ప్రాధాన్యతల్లో స్పష్టత వ‌చ్చిందిమా వేగంస్థాయి స్పష్టంగా ఉన్నాయిఈ సమయంలోభారతదేశ‌ అభివృద్ధి వేగానికి అవసరమైన ప్రతి రంగంపైప్రతి అంశంపై మేం దృష్టి సారించాంఈ 100 రోజుల్లోభౌతికసామాజిక మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాంభారత్‌లో 70 మిలియన్లు లేదా కోట్ల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలుసుకుని మన అంతర్జాతీయ అతిథులు ఆశ్చర్యపోవచ్చుఈ ఇళ్ల సంఖ్య అనేక దేశాల జనాభా కంటే ఎక్కువమా ప్రభుత్వ పాల‌న‌లో మొదటి రెండు పర్యాయాలలో 40 మిలియన్లు లేదా కోట్ల గృహాలను నిర్మించాం.

ఇప్పుడుఈ మూడోసారి పాలనలో అదనంగా 30 మిలియన్లు లేదా కోట్ల గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాంగత 100 రోజుల్లోభారత్‌లో 12 కొత్త పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ఆమోదం తెలిపాంఈ సమయంలో, 8 హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపాంఅదనంగామేడ్-ఇన్-ఇండియా సెమీ-హై-స్పీడ్ వందే భారత్ రైళ్లను 15కు పైగా ప్రారంభించాంపరిశోధనఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక ట్రిలియన్ రూపాయల పరిశోధన నిధిని ఏర్పాటు చేశాంవిద్యుత్ వాహ‌నాల వినియోగం పెంచడానికి అనేక కార్యక్రమాలను ప్ర‌క‌టించాంఅధిక-పనితీరు గల బయో టెక్నాలజీ ఆధారిత త‌యారీ రంగాన్ని అభివృద్ధి చేయ‌డం మా లక్ష్యంఇది భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందిదీని కోసం బ‌యో ఇ3 ( BioE3 ) విధానానికి ఆమోదం తెలిపాం.

 

స్నేహితులారా,

గడిచిన వంద రోజుల్లో హ‌రిత ఇంధ‌నాన్ని ప్రోత్స‌హించేందుకు మేం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రూ. 7,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే ప్రణాళికలతోఆఫ్‌షోర్ ప‌వ‌న విద్యుత్ ప్రాజెక్టుల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాంసమీప భవిష్యత్తులో 31,000 మెగావాట్ల జలవిద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు భారత్ కృషి చేస్తోందిదీని కోసం రూ. 12,000 కోట్లకు పైగా బ‌డ్జెట్టుకు ఆమోదం తెలిపాం.

 

స్నేహితులారా,

భారత‌దేశ‌ వైవిధ్యంస్థాయిసామర్థ్యంస‌మ‌ర్థ‌త‌ పనితీరు అన్నీ అసాధారణమైనవిఅందుకే ప్ర‌పంచవ్యాప్తంగా ఉప‌యోగ‌ప‌డేలా భారతీయ పరిష్కారాలుంటాయ‌ని నేను అంటుంటానునా ఈ ఆలోచ‌న‌ను ప్ర‌పంచం బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించిందినేడుభారతీయులే కాకుండా ప్రపంచం మొత్తం భారత్‌ను 21వ శతాబ్దపు అత్యంత ఆశాజనకమైన అవ‌కాశాల‌నందించే దేశంగా భావిస్తోందిఈ నెల ప్రారంభంలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ను పరిగణన‌లోకి తీసుకోండిదాని తర్వాతప్రపంచవ్యాప్తంగా ప‌లు దేశాల‌కు చెందిన‌వారు మొదటి సౌర విద్యుత్ అంత‌ర్జాతీయ ఉత్స‌వానికి హాజరయ్యారుఆ త‌ర్వాత గ్లోబల్ సెమీకండక్టర్ సమ్మిట్ కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్ర‌తినిధులు భారత్‌కు వచ్చారుఅదే స‌మ‌యంలోనే పౌర విమానయానానికి సంబంధించిన ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించే బాధ్యతను కూడా భారత్ స్వీకరించిందిఇప్పుడుఈ రోజు మ‌నం గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇక్క‌డ‌ సమావేశమయ్యాం.

 

స్నేహితులారా,

గుజ‌రాత్ లో ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం కాక‌తాళీయం. శ్వేత విప్ల‌వం లేదా క్షీర విప్ల‌వం జ‌రిగిన నేల ఇదితీపి లేదా తేనె విప్ల‌వం ఇక్క‌డే సంభ‌వించిందిఈ నేల‌పైనే సౌర విప్ల‌వం ప్రారంభ‌మైంది.

భారత్‌లో తొలిసారిగా సౌర విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం గుజరాత్ఇదంతా గుజరాత్‌లో ప్రారంభమైందిఆపై మేం జాతీయ స్థాయిలో విస్త‌రించాంశ్రీ భూపేంద్ర భాయ్ పేర్కొన్నట్లుగాప్ర‌పంచంలోనే వాతావరణం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను రూపొందించిన ప్ర‌భుత్వాల్లో గుజరాత్ కూడా ఉందిభారత్‌లో సౌర విద్యుత్ గురించి పెద్దగా చర్చకు రాని రోజుల్లో గుజరాత్‌లో వందల మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి.

 

స్నేహితులారా,

 

ఈ వేదికకు మహాత్మా గాంధీ-మహాత్మా మందిర్ పేరు పెట్టడం మీరు గమనించే ఉంటారుప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల సమస్య తలెత్తడానికి చాలా కాలం ముందే దానిపై మహాత్మా గాంధీ ప్రపంచాన్ని హెచ్చరించారుఆయన జీవితాన్ని పరిశీలిస్తేప్రకృతికి అనుగుణంగాకనీస కార్బన్ ఉద్గారాల‌తో ఆయ‌న‌ జీవించిన విష‌యం మ‌న‌కు తెలుస్తుంది. "మన అవసరాలను తీర్చడానికి తగినన్ని వనరులు భూమిపై ఉన్నాయికానీ మన దురాశకు స‌రిపోయేంత లేవుఅని ఆయ‌న ఒక గొప్ప విష‌యాన్ని చెప్పారుమహాత్మా గాంధీ క‌న‌బ‌రిచిన‌ ఈ దార్శనికత భారతదేశ ఉన్న‌త‌ సంప్రదాయాల్లో ఇమిడిపోయింది.. మనకుహ‌రిత భ‌విష్య‌త్ నికర సున్నా క‌ర్బ‌న ఉద్గారాలు వంటి భావనలు కేవలం స‌ర‌దా పదాలు కావుఅవి భారత్‌కు చాలా ముఖ్య‌మైన భావ‌న‌లుఅవి భార‌త‌ కేంద్ర ప్ర‌భుత్వంతోపాటుఅన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధతను ప్రతిబింబిస్తాయిఅభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని సాకు చెప్పిఈ నిబ‌ద్ద‌త‌ల‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి మాకు అవ‌కాశం ఉందిప‌ర్యావ‌ర‌ణానికి నష్టం కలిగించడంలో మా పాత్ర లేదని ప్రపంచానికి చెప్పవచ్చుకానీ మేం అలా చేయలేదుబదులుగాబాధ్యతాయుతమైన చర్యలు చేప‌ట్టాంమానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం త‌పిస్తూ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచాం.

 

నేడు భారత్ కేవలం వర్తమానానికి మాత్రమే కాకుండా రాబోయే వెయ్యి సంవత్సరాలకు పునాది వేస్తోందిమా లక్ష్యం కేవలం ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాదుమేం అక్కడే ఉండడం కోసం ప‌ని చేస్తున్నాంభారత్ తన ఇంధ‌న అవసరాలను పూర్తిగా అర్థం చేసుకుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఏం అవసరమో పూర్తిగా తెలుసుకుందిమాకు సొంత చమురుగ్యాస్ నిల్వలులేవనిఇంధ‌నం విష‌యంలో స్వతంత్రంగాలేమ‌ని తెలుసుఅందువల్లమేం మా భవిష్యత్తును సౌరశక్తిపవన శక్తిఅణుశక్తి జలశక్తి ఆధారంగా నిర్మించుకుంటున్నాం.

 

స్నేహితులారా,

పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన వాతావరణ ల‌క్ష్యాల‌ను షెడ్యూల్ కంటే తొమ్మిదేళ్ల ముందే సాధించాంత‌ద్వారా వాటిని నెరవేర్చిన మొదటి G-20 దేశంగా భారత్ నిలిచింది. G-20 గ్రూప్‌లో అలా చేసిన ఏకైక దేశం మాదిఅభివృద్ధి చెందిన దేశాలు సాధించని వాటిని భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం సాధించి ఆ విష‌యాన్ని ప్రపంచానికి చాటింది. 2030 నాటికి 500 గిగా వాట్స్ పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని చేరుకోవడానికిబహుళ స్థాయుల్లో పని చేస్తున్నాంహరిత ప‌రివ‌ర్త‌న‌ను ప్రజా ఉద్యమంగా మారుస్తున్నాంమీరు వీడియోలో చూసినట్లుగామా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను అధ్యయనం చేయమని మీకు విజ్ఞ‌ప్తి చేస్తున్నానురూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల కోసం ప్రారంభించిన ప్రత్యేకమైన కార్య‌క్ర‌మంద్వారా సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాంఈ పథకంతో భారత్‌లోని ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారుగా మారవచ్చుఇప్పటివరకు, 13 మిలియన్లకు పైగా అంటే కోటి 30 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం పేర్ల‌ను నమోదు చేసుకున్నాయిఈ పథకం కింద 3.25 లక్షల ఇళ్లలో వీటి ఏర్పాటు పూర్తయింది.

 

స్నేహితులారా,

 

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఫలితాలు నిజంగా విశిష్ట‌మైన‌విఉదాహరణకునెలకు 250 యూనిట్ల విద్యుత్ వినియోగించే చిన్న కుటుంబాన్నే తీసుకోండి. 100 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి తిరిగి గ్రిడ్‌కు విక్రయిస్తే ఏడాదికి రూ.25 వేలు ఆదా అవుతుందిఅంటే వారి కరెంటు బిల్లుపై పొందే మొత్తం పొదుపువారు సంపాదించే ఆదాయం క‌లిపితే సంవత్సరానికి సుమారు రూ. 25,000. ఇప్పుడు ఆ కుటుంబానికి న‌వ‌జాత శిశువు ఉంద‌ని అనుకుంటే వారు ఈ డబ్బును పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టినట్లయితేఆ బిడ్డ‌కు 20 ఏళ్లు వచ్చే సమయానికివారు 10-12 లక్షల రూపాయలకు పైగా పొదుపు చేసి ఉంటారుఈ డబ్బు ఆమె చదువు దగ్గర నుంచి పెళ్లి వరకు ఎంత బాగా ఉపయోగపడుతుందో అనే విష‌యాన్ని ఒక్కసారి ఊహించండి.

 

స్నేహితులారా,

ఈ పథకంతో మరో రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయివిద్యుత్తు ఖర్చులను ఆదా చేయడంతో పాటుఉపాధి కల్పన పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ పథకం చోద‌క‌శ‌క్తిగా మారుతోందిహ‌రిత ఉద్యోగాల (గ్రీన్ జాబ్స్క‌ల్ప‌న చాలా వేగంగా జ‌ర‌గ‌బోతున్న‌దిదీనికి వేల మంది విక్రేతలులక్షల మంది స్థాపితదారులు అవసరంఈ పథకం దాదాపు రెండు మిలియన్లు లేదా 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందిప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం కింద, 3 లక్షల మంది యువకులకు నైపుణ్య‌ శిక్షణ ఇవ్వడంవారిలో లక్ష మందిని సోలార్ పీవీ టెక్నీషియన్లను చేయ‌డం లక్ష్యంఅంతేకాకుండాఉత్పత్తి చేసిని ప్రతి కిలోవాట్ల సౌర విద్యుత్తు 50-60 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధిస్తుందిఅంటే ప్ర‌ధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో పాల్గొనే ప్రతి కుటుంబం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో గణనీయమైన కృషి చేస్తుంది.

 

స్నేహితులారా,

 

21వ శతాబ్దపు చరిత్రను లిఖిస్తే అందులో భారత్ సౌర విప్లవం సువర్ణాక్షరాలతో లిఖిస్తారు.

 

స్నేహితులారా,

 

మ‌న అంత‌ర్జాతీయ అతిథుల‌కుఇక్కడి నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రామం గురించి తెలియజేయాలనుకుంటున్నానుదాని పేరు మొధేరాఈ గ్రామంలో శతాబ్దాల నాటి సూర్య దేవాలయం ఉందిఇది భారతదేశంలోని మొదటి సౌరశక్తితో పనిచేసే గ్రామంఇక్కడ అన్నిర‌కాల ఇంధ‌న అవసరాలను సౌరశక్తి ద్వారా తీర్చడం జ‌రుగుతోందిఈరోజుదేశవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని సౌరశక్తితో పనిచేసే గ్రామాలను రూపొందించడానికి మేం కృషి చేస్తున్నాం.

 

స్నేహితులారా,

 

నేను ఇటీవల ఇక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్‌ని సందర్శించానుదానిని చూడటానికి మీరు కూడా సమయాన్ని వెచ్చించమని విజ్ఞ‌ప్తి చేస్తున్నానుశ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య గురించి మీ అందరికీ సుపరిచితమేరాముడు సూర్యవంశానికి చెందినవాడునేను ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడుఉత్తరప్రదేశ్‌ నుంచి వ‌చ్చిన‌ ఒక స్టాల్‌ను చూశానుకాశీ పార్లమెంటు సభ్యునిగా సహజంగానే ఉత్తరప్రదేశ్ స్టాల్‌ని సందర్శించాలని భావించి అక్క‌డ‌కు వెళ్లానుఆ సంద‌ర్శ‌న‌తో నా కోరిక ఒక‌టి నెర‌వేరిన విష‌యం తెలుసుకొని సంతోషించానురాముడికి అంకితం చేసిన ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించినప్పుడు సూర్యవంశీయుడైన శ్రీరామునితో అనుబంధంగ‌ల అయోధ్య‌ నగరాన్ని-మోడల్ సోలార్ సిటీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాంఈ విష‌యాన్ని నేను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానుపనులు దాదాపు పూర్తయ్యాయిఅయోధ్యలోని ప్రతి ఇల్లుప్రతి కార్యాలయంప్రతి సేవసౌరశక్తితో నడిచేలా చూడడమే మా లక్ష్యంఇప్పటికే అయోధ్యలోని అనేక గృహాలనుసౌకర్యాలను సౌరశక్తికి అనుసంధానించామనే విష‌యాన్ని మీ అంద‌రితో పంచుకోవడానికి సంతోషిస్తున్నానుఅయోధ్యలో పెద్ద సంఖ్యలో సౌరశక్తితో పనిచేసే వీధి దీపాలుకూడళ్లుపడవలునీటి ఏటీఎంల‌నుభవనాలను చూడవచ్చు.

 

ఇదే పద్ధతిలో దేశ‌వ్యాప్తంగా సౌర నగరాలుగా అభివృద్ధి చేయాలనుకుంటున్న 17 నగరాలను గుర్తించాంసోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మన వ్యవసాయ రంగాన్నిపొలాలనురైతులను కూడా శక్తిమంతం చేస్తున్నాంనీటిపారుదల కోసం సోలార్ పంపులుచిన్న సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవ‌డానికిగాను రైతులకు సహాయం చేస్తున్నాంపునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన ప్రతి రంగంలో భారత్ వేగంగాభారీ స్థాయిలో ముందడుగు వేస్తోందిగత దశాబ్దంలోఅణుశక్తి ద్వారా విద్యుదుత్పత్తిని 35% పెంచాందాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడితో హరిత ఉదజని మిషన్‌ను ప్రారంభించిన భారత‌దేశం గ్రీన్ హైడ్రోజన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి కృషి చేస్తోందిభారత్‌లో వ్య‌ర్థాల‌ నుంచి ఇంధ‌నాన్ని త‌యారు చేయాల‌నే ప్రచారం కూడా జరుగుతోందిక్లిష్టమైన ఖనిజాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి వృత్తాకార విధానాన్ని (స‌ర్క్యుల‌ర్ అప్రోచ్ప్రోత్సహిస్తున్నాంపునర్వినియోగంరీసైక్లింగ్ కు సంబంధించి మెరుగైన సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్న అంకుర సంస్థ‌ల‌కు మ‌ద్దతు ఇస్తున్నాం.

 

స్నేహితులారా,

 

భూగోళ అనుకూల ప్రజలు’ అన్నది మా నిబద్ధతఇందుకోసమే మిషన్ లైఫ్పర్యావరణానికి జీవనశైలి అనే దార్శ‌నిక‌త‌ను భార‌త‌దేశం ప్రపంచానికి అందించిందిభార‌త్‌ అంతర్జాతీయ సౌరకూటమి ద్వారా వందలాది దేశాలను అనుసంధానించిందిభారత్ G-20 అధ్య‌క్ష స్థానంలో ఉన్న‌ సమయంలోహ‌రిత ప‌రివ‌ర్త‌న‌పై గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో దృష్టి సారించాంజి-20 శిఖ‌రాగ్ర స‌మావేశం సందర్భంగా గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌ను ప్రారంభించాంతన రైల్వే రంగాన్ని ఈ దశాబ్దం చివరి నాటికి నికర జీరో ఉద్గారన స్థాయికి మార్చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని కూడా భార‌త‌దేశం నిర్దేశించుకుందిభారత్‌లో నికరసున్నా రైల్వేలు అంటే ఏమిటి అని కొందరు ఆశ్చర్యపోవచ్చుదీన్ని నేను వివరిస్తానుమా రైల్వే వ్యవస్థ విస్తారంగా ఉందిప్రతిరోజూ దాదాపు 1-1.5 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు.. ఈ మొత్తం వ్యవస్థను నికర జీరో క‌ర్బ‌న ఉద్గ‌రాల వ్య‌వ‌స్థ‌గా మార్చ‌బోతున్నాంఅదనంగా, 2025 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని నిర్ణయించుకున్నాంభారతదేశం అంతటా గ్రామాల్లో నీటి సంరక్షణ కోసం వేలాది అమృత్ సరోవరాల‌ను నిర్మించాం. 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి కోసం ఒక చెట్టుకార్య‌క్ర‌మం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు తమ తల్లుల గౌరవార్థం చెట్లను నాటే సంప్ర‌దాయాన్ని మీరు గమనించే ఉంటారుమీ అందరితో పాటు ప్రతి ప్రపంచ పౌరుడిని కూడా ఈ ఉద్య‌మంలో భాగం కావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

 

స్నేహితులారా,

 

పునరుత్పాదక శక్తి కోసం భార‌త్‌లో డిమాండ్ పెరుగుతోందిఈ డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తోందిసాధ్యమైనన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోందిఅంటే ఇంధన ఉత్పత్తిలోనే కాకుండా తయారీ రంగంలో కూడా అవకాశాలున్నాయని అర్థంభార‌త‌దేశంలోనే త‌యారీ ప‌రిష్కారాల‌పై దృష్టిని కేంద్రీక‌రించి భారత్ ప్రయత్నాలు కొన‌సాగుతున్నాయిమీ అందరికీ అనేక అవకాశాలను సృష్టించ‌డం జ‌రుగుతోందివ్యాపార‌ విస్తరణ మెరుగైన రాబడులకు నిజ‌మైన చోటు భార‌త్‌ఈ ప్రయాణంలో మీరు పాల్గొంటారని ఆశిస్తున్నానుఈ రంగంలో పెట్టుబడులకు భార‌త్ కంటే మంచి దేశం లేదుఆవిష్కరణలకు ఇంత కంటే మంచి దేశం లేదుకొన్నిసార్లు మీడియాలో వ‌స్తున్న‌ గాసిప్ కాలమ్‌ల గురించి ఆలోచిస్తుంటానుఅవి త‌ర‌చుగా చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఆసక్తికరంగా ఉంటాయిఅయితే వారు ఒక విషయాన్ని విస్మరించారుదాన్ని ఈ రోజు తర్వాత వారు ఖచ్చితంగా తెలుసుకుంటారుఇప్పుడే ఇక్కడ ప్రసంగించిన ప్రహ్లాద్ జోషి మన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రికానీ నా గత ప్రభుత్వంలో ఆయన బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారుకాబట్టినా మంత్రులు కూడా బొగ్గు నుండి పునరుత్పాదక శక్తికి మారారు!

 

భారత్ చేప‌ట్టిన హ‌రిత‌ పరివర్తన కార్య‌క్ర‌మాల్లో పెట్టుబడి పెట్టాలని అందరినీ మరోసారి ఆహ్వానిస్తున్నానుఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలుఈ భూమిలో పుట్టిన నాకు గుజరాత్ చాలా నేర్పిందిఅందువల్లగుజరాత్ ముఖ్యమంత్రితో పాటుమీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిస్వాగతం పలకడం నా బాధ్యతగా భావిస్తున్నానుఇందులో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుఇక్కడ మాతో చేరిన ముఖ్యమంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ శిఖరాగ్ర సమావేశంఇక్క‌డ జ‌రిగే చ‌ర్చ‌లు రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మ‌న‌ల్ని ఏక‌తాటిపైకి తెస్తాయి.

 

నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ద్వైపాక్షిక చర్చల కోసం భారత్‌లో పర్యటించిన సందర్భం నాకు గుర్తుందిఢిల్లీలో నిర్వ‌హించిన‌ విలేకరుల సమావేశంలో ఓ విలేకరి నన్ను ఓ ప్రశ్న అడిగారుఆ సమయంలోవివిధ ప్రపంచ సమస్యల ప‌రిష్కారంకోసం అనేక దేశాలు ప‌లు ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ప్రకటించాయిఆ కార‌ణంగా నాపైన ఏమైనా ఒత్తిడి ఉందా అని జర్నలిస్టు అడిగాడు. ‘‘ఇక్క‌డ ఉన్నది మోదీబయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు’’ అని నేను బదులిచ్చానుకానీ నిజం చెప్పాలంటే నేను ఒక ఒత్తిడిలో ఉన్నానుఅది భవిష్యత్ తరాల పట్ల బాధ్యత అనే ఒత్తిడిపుట్టబోయే పిల్లలువారి ఉజ్వల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతున్నానునేను మోస్తున్న ఒత్తిడి అదేఅందుకే రాబోయే తరాల సంక్షేమం కోసం నేను కట్టుబడి ఉన్నానుఈ శిఖరాగ్ర సమావేశం మన తర్వాత రెండుమూడునాలుగు తరాల ఉజ్వల భవిష్యత్తుకు హామీగా నిలుస్తుందినిజం చెప్పాలంటే మీరంద‌రూ కీల‌క‌మైన విజ‌యం సాధించడానికి ఇక్కడకు వచ్చారుమహాత్మా గాంధీ గౌరవార్థం నిర్మించిన ఈ మహాత్మా మందిరానికి వచ్చారుమరొక్కసారిమీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.

అంద‌రికీ న‌మ‌స్కారాలు.

 

***


(Release ID: 2055864) Visitor Counter : 74