గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వచ్చే దశాబ్దంలోకి అలవోకగా స్వచ్ఛ భారత్ మిషన్
కేంద్రం అంచనా వేసిన 2 లక్షలను మించి రాబోయే 15 రోజుల్లో 5 లక్షల ప్రదేశాలలో చెత్తను శుభ్రం చేయనున్న రాష్ట్రాలు రికార్డు సృష్టించడానికి సిద్ధంగా భారత్
లక్షలాది మంది స్వచ్ఛంద శ్రమదానంతో వినూత్నంగా ప్రారంభం కానున్న ప్రచారం
Posted On:
17 SEP 2024 2:57PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 లో స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రారంభించినప్పుడు దాని వల్ల వచ్చే మార్పు ప్రభావాన్ని కొద్ది మంది మాత్రమే ఊహించి ఉంటారు. ప్రవర్తనాపరమైన మార్పు కోసం ప్రారంభమైన ఈ కార్యక్రమం శిశు మరణాలనూ, వ్యాధులనూ తగ్గించడం, పాఠశాలకు హాజరయ్యే బాలికల సంఖ్యను పెంచడం, మహిళలపై నేరాలను తగ్గించడం, జీవనోపాధిని మెరుగుపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ మారింది. స్వచ్ఛ భారత్ మిషన్ తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది స్వచ్ఛతా హీ సేవ (ఎస్. హెచ్ ఎస్ ) 2024 ప్రచారం ‘స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత’ అనే ఇతివృత్తాన్ని స్వీకరించింది. రాజస్థాన్ లోని ఝున్ ఝున్ లో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ప్రచారం జాతీయ స్థాయిలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ హాజరైన ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ ఎంఎల్ ఖట్టర్, రాజస్థాన్ సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి శ్రీ అవినాష్ గెహ్లాట్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఎస్ హెచ్ ఎస్ 2024 మూడు ముఖ్యాంశాల కింద, దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. పరిసరాల పరిశుభ్రత కోసం మూకుమ్మడిగా ప్రజలు పాల్గొనేందుకు దాదాపు 5 లక్షల యూనిట్లను గుర్తించారు. పక్షం రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే పరిశుభ్రతా (స్వచ్ఛతా మే జన్ భాగీదారీ) కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమం కింద 36,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా 70,000కు పైగా సఫాయిమిత్ర సురక్షా శిబిరాల్లో సఫాయిమిత్రలు పాల్గొంటారు. పౌరులు ఎస్ హెచ్ ఎస్ పోర్టల్ Https://SwachhtaHiseva.gov.in/ లో ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
స్వచ్ఛ భారత్ మిషన్ గత దశాబ్ద కాలంలో పౌరులు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు , పరిశ్రమల అలుపెరగని అంకితభావం, స్వచ్చత పట్ల వాటి సమైక్య దృష్టితో ఉన్న గ్రామాలు, నగరాలలో గణనీయమైన మార్పు తెచ్చింది. దేశవ్యాప్తంగా గతంలో సురక్షిత పారిశుద్ధ్యం అందుబాటులో లేని సుమారు 12 కోట్ల కుటుంబాలకు ఇప్పుడు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు.
రాజస్థాన్ లోని ఝున్ ఝున్ లో ఎస్ హెచ్ ఎస్ 2024 ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా పరిశుభ్రత కోసం, మార్పు కోసం 5 లక్షలకు పైగా లక్షిత ప్రాంతాలను గుర్తించడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. మోదా పహార్ వద్ద రూ.13.18 కోట్ల విలువైన 65 టిపిడి సామర్థ్యం కలిగిన ఆర్ డి ఎఫ్ , కంపోస్ట్ ప్లాంట్ తో కూడిన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు శ్రీ జగ్ దీప్ ధన్కడ్ శంకుస్థాపన చేసి, స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ కింద ఝున్ ఝున్ ప్రజలకు అంకితం చేశారు. బగ్గర్ రోడ్డులో 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ను కూడా ప్రారంభించారు.
200 మందికి పైగా ఎన్ సి సి క్యాడెట్లు, 100 మంది మేరా యువ (ఎంవై) భారత్ వలంటీర్లు కేంద్ర మంత్రి ఎంఎల్ ఖట్టర్ తో కలిసి ఝున్ ఝున్ లోని పరిశుభ్రత టార్గెట్ యూనిట్ (సి టి యు) ప్రాంతంలో స్వచ్ఛతా కార్యక్రమంలో చేరడంతో కార్యక్రమం ఆ రోజున ప్రారంభమైంది. అనంతరం 'ఏక్ పెడ్ మా కే నామ్' కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం, ఎస్ హెచ్ ఎస్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ భారతదేశం స్వచ్చత పట్ల ఉత్తేజాన్ని చూపించడంలో ప్రపంచ ఉదాహరణగా నిలిచిందని, పెట్టుబడులకు, అవకాశాలకు అత్యంత సానుకూల ప్రోత్సాహక కేంద్రంగా నిలిచిందన్నారు. చక్ర భ్రమణ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ, మొదట్లో వ్యర్థాల చుట్టూ మనం ఉన్నామని, ఇప్పుడు వ్యర్థాలు ఆర్థిక వ్యవస్థలో చక్ర భ్రమణాన్ని చేర్చిందని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల వృద్ధిలో స్వచ్చత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. వికాస్ భారత్ దార్శనికతలో పాలుపంచుకునేందుకు దాదాపు 1.5 కోట్ల మంది యువత ముందుకు వచ్చిన మై (ఎంవై) భారత్ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యంగా స్వచ్చత ద్వారా ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల, విద్యుత్ శాఖల మంత్రి శ్రీ ఎం.ఎల్.ఖట్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రచారంలో వ్యక్తిగత బాధ్యత ప్రాముఖ్యతను తెలియచేస్తూ ‘స్వభావం, సంస్కారం రూపంలో స్వచ్చత’ అన్న ఇతివృత్తాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఈ 10 సంవత్సరాల విజయాలను సూచించే ప్రచారం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే లక్ష్యాన్ని సాధించాలని, స్వచ్ఛ భారత్ పట్ల నిబద్ధతను పునరుద్ధరించాలని అన్నారు. ఎస్ హెచ్ ఎస్ ప్రచారం ప్రాముఖ్యతను వివరిస్తూ, స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్ బి ఎం) తన తదుపరి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నందున వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి లక్షల సంఖ్యలో పౌరులు స్వచ్ఛ శ్రమదాన కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్ లో జరిగిన ఎస్ హెచ్ ఎస్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సఫాయిమిత్ర, ఎమ్మెల్యేలు, మేయర్లు, ప్రతిపక్ష నాయకులు, మున్సిపల్ కమిషనర్లు ఉపరాష్ట్రపతితో ఆన్ లైన్ లో సంభాషించారు.
ఎస్ హెచ్ ఎస్ ప్రారంభ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ లోని ప్రతాప్ ఘడ్ కు చెందిన సఫాయి మిత్ర తరుణ్ దావ్రే మధ్య జరిగిన సంభాషణ ఒక ముఖ్య ఆకర్షణగా నిలిచింది. న్యూఢిల్లీ లో తమను కలవాలని దావ్రే కుటుంబాన్ని ఉప రాష్ట్రపతి ఆహ్వానించారు. శ్రీ తరుణ్ దావ్రే కుమార్తె, ఎస్ టి సి రెండో సంవత్సరం విద్యార్థిని అయిన పూర్వ దావ్రేకు వారం రోజుల ఇంటర్న్ షిప్ అవకాశాన్ని కూడా అందించారు. అదే విధంగా, తమ అతిథిగా భారత పార్లమెంటును సందర్శించడానికి లంబి అహిర్ గ్రామ సర్పంచి ఎం.ఎస్.నీరూ యాదవ్ ను ఉప రాష్ట్రపతి ఆహ్వానించారు.
నమస్తే పథకం కింద ఉప రాష్ట్రపతి సఫాయి మిత్రులను సత్కరించి, పిఎమ్ఎవై ప్రయోజనాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, కిట్లను అందజేయడంతో కార్యక్రమం ముగిసింది.
***
(Release ID: 2055850)
Visitor Counter : 69