వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (పీఎం-కేఎంవై) కు అయిదేళ్లు పూర్తి

Posted On: 09 SEP 2024 4:41PM by PIB Hyderabad

పరిచయం
ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (పీఎం-కేఎంవై) దేశవ్యాప్తంగా భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ (ఎస్ఎంఎఫ్ లు) సామాజిక భద్రతను అందిస్తోంది. 2019 సెప్టెంబర్ 12న ఈ పథకం ప్రారంభమైంది.

ఈ వృద్ధాప్య పెన్షన్ పథకం స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. ఈ కార్యక్రమం కింద, అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు  అరవై ఏళ్లు వచ్చిన తర్వాత  నెలవారీ పెన్షన్ రూ.3,000 చెల్లిస్తారు. రైతులు తమ పని సంవత్సరాల్లో పెన్షన్ ఫండ్‌కు తమ వాటాను చెల్లించడం దీని అర్హత. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి  సమాన వాటా నెలవారీ జమ అవుతుంది.
వృద్ధాప్యంలో రైతులకు భద్రత కల్పించడంలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ పథకం అమలులోకి వచ్చి అయిదేళ్లు పూర్తి అయింది.

విజయవంతంగా అమలవుతున్న పీఎం-కేఎంవై

ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (పీఎం-కేఎంవై) కింద, చిన్న, సన్నకారు రైతులు పెన్షన్ ఫండ్‌కు నెలవారీ చందా చెల్లించి నమోదు చేసుకోవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల లోపు రైతులు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు రూ. 55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, నమోదు చేసుకున్న రైతులు, పథకం మినహాయింపు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, నెలవారీ పెన్షన్ రూ. 3,000 పొందుతారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) పెన్షన్ ఫండ్‌ను నిర్వహిస్తుంది. కామన్ సర్వీస్ సెంటర్‌లు (సీఎస్ సిలు), రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధిదారులుగా నమోదు చేసుకోవచ్చు.

2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి ఉండి,  2019 ఆగస్ట్ ఒకటో తేదీ నాటికి రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత భూ రికార్డులలో నమోదు అయిన రైతులందరూ, ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు. ఆగస్టు 6, 2024 నాటికి, మొత్తం 23.38 లక్షల మంది రైతులు ఈ పథకంలో చేరారు.
ఈ పథకం కింద 3.4 లక్షల రిజిస్ట్రేషన్లతో బీహార్ అగ్రస్థానంలో ఉండగా, 2.5 లక్షల రిజిస్ట్రేషన్లతో జార్ఖండ్ రెండో స్థానంలో ఉంది.
ఇంకా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో వరుసగా 2.5 లక్షలు, 2 లక్షలు, 1.5 లక్షల మంది రైతుల రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఈ పథకం కింద ఈ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున నమోదులు జరగడం, రైతులకు సామాజిక భద్రత కల్పించడంలో పథకం పరిధిని, ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. విస్తృతమైన భాగస్వామ్యం చిన్న, సన్నకారు రైతులలో పీఎం-కేఎంవై పథకం పట్ల పెరుగుతున్న అవగాహన, స్వీకరణను స్పష్టం చేస్తుంది.

 పీఎం-కేఎంవై కింద ప్రధాన ప్రయోజనాలు

కనీస పెన్షన్ హామీ: పథకంలోని ప్రతి చందాదారునికి 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు  రూ.3000  పెన్షన్ హామీ ఇస్తుంది.
కుటుంబ పెన్షన్: చందాదారుడు తాను పెన్షన్ పొందుతూ మరణించినట్లయితే, తన జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్‌గా చందాదారు పొందుతున్న మొత్తంలో 50 శాతం సమానమైన, అంటే నెలకు రూ.1500 కుటుంబ పెన్షన్‌కు అర్హులు. జీవిత భాగస్వామి అప్పటికే పథకం లబ్ధిదారు కానట్లయితే మాత్రమే ఇది వర్తిస్తుంది. కుటుంబ పెన్షన్ ప్రయోజనం జీవిత భాగస్వామికి మాత్రమే ఇస్తారు.
పీఎం-కిసాన్ ప్రయోజనం: ఎస్ఎంఎఫ్ లు తమ పీఎం-కిసాన్ ప్రయోజనాలను స్కీమ్‌కు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడానికి ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు. దీని కోసం, అర్హత కలిగిన ఎస్ఎంఎఫ్ లు తప్పనిసరిగా ఎన్‌రోల్‌మెంట్-కమ్-ఆటో-డెబిట్-మాండేట్ ఫామ్‌పై సంతకం చేసి సమర్పించాలి. ఇది వారి పీఎం-కిసాన్ ప్రయోజనాలు జమ అయ్యే బ్యాంక్ ఖాతా నుంచి వారి కంట్రిబ్యూషన్‌ల ఆటోమేటిక్ డెబిట్‌కు అధికారం ఇస్తుంది.
ప్రభుత్వ సమాన కంట్రిబ్యూషన్: కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ సహకార శాఖ, రైతు సంక్షేమ శాఖ ద్వారా, అర్హులైన చందాదారు అందించిన సమాన మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తుంది.
నెల వారీ కంట్రిబ్యూషన్లు : నెలవారీ కంట్రిబ్యూషన్లు రూ.55 నుంచి రూ.200 వరకు,  పథకంలోకి ప్రవేశించే సమయంలో రైతు వయసు ఆధారంగా. కాంట్రిబ్యూషన్ చార్ట్ ...


పథకంలోకి ప్రవేశించినపుడు ఉన్న వయసు ఆధారంగా కంట్రిబ్యూషన్ చార్ట్

నమోదు ప్రక్రియ

స్కీమ్‌లో నమోదు చేసుకోవడానికి, అర్హత ఉన్న రైతులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్ సీ)ని సందర్శించాలి లేదా రాష్ట్ర లేదా యూటీ ప్రభుత్వాలు నియమించిన నోడల్ ఆఫీసర్ (పీఎం-కిసాన్)ని సంప్రదించాలి. www.pmkmy.gov.inలో స్కీమ్ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.

రిజిస్ట్రేషన్ సస్మయంలో లబ్ధిదారు ఈ కింది సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది:

● రైతు / జీవిత భాగస్వామి పేరు, పుట్టిన తేదీ

● బ్యాంకు ఖాతా నెంబర్

● ఐఎఫ్ఎస్ సి/ఎంఐసిఆర్ కోడ్

● మొబైల్ నెంబర్

● ఆధార్ నెంబర్

పెన్షన్ పథకం నుంచి బయటకు రావడం



 ముగింపు

అయిదు సంవత్సరాల అమలులో, పీఎం-కేఎంవై దేశం అంతటా చిన్న, సన్నకారు రైతులకు (ఎస్ఎంఎఫ్) గణనీయమైన సాధికారతను అందించింది. పీఎం-కేఎంవై ముఖ్య విజయాలలో ఒకటి రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం. వీరిలో చాలా మంది వ్యవసాయంలో కాలానుగుణ స్వభావం, హెచ్చుతగ్గుల ఆదాయాల కారణంగా అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం బాసటగా నిలిచింది.  

విశ్రాంత రైతులు పెన్షన్‌ను పొందడం ద్వారా, ఈ పథకం గ్రామీణ జనాభాకు సామాజిక భద్రతలో గణనీయమైన అంతరాన్ని పరిష్కరించింది. గత అయిదేళ్లలో సాధించిన విజయం ఈ దేశ ‘అన్నదాత’ జీవన నాణ్యతను పెంపొందించడంలో ఎంత కీలక పాత్ర వహిస్తుందో స్పష్టం అవుతుంది.

 

***


(Release ID: 2053415) Visitor Counter : 150