ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్ గేమ్స్ లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శనకు ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
08 SEP 2024 10:29PM by PIB Hyderabad
పారాలింపిక్ గేమ్స్ లో భారతదేశం కనబరచిన అత్యుత్తమ ప్రదర్శనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. పారిస్ లో జరిగిన ‘పారాలింపిక్ గేమ్స్ 2024’లో 29 పతకాలను చేజిక్కించుకుని, దేశ దివ్యాంగ క్రీడాకారులు ప్రదర్శించిన అంకిత భావాన్నీ, తిరుగులేని స్ఫూర్తినీ ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘పారాలింపిక్స్ 2024 ప్రత్యేకం, చరిత్రాత్మకం.
మన దివ్యాంగ క్రీడాకారులు 29 పతకాలను సాధించినందుకు భారతదేశం అమితంగా ఆనందిస్తోంది. పారాలింపిక్స్ క్రీడల్లో మనం పాల్గొంటున్నప్పటి నుంచీ చూస్తే, ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
మన క్రీడాకారులు చూపిన తిరుగులేని అంకితభావం, స్ఫూర్తి కారణంగానే ఈ అద్భుతం సాధ్యం అయింది. వారి ఆటతీరు మనకు అనేక మధుర జ్ఞాపకాలను అందించింది. వర్ధమాన క్రీడాకారులకు ప్రేరణనూ అందించింది.
(रिलीज़ आईडी: 2053149)
आगंतुक पटल : 80
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam