ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లఖ్‌నవూ బాధితులకు పరిహారం: దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 08 SEP 2024 1:13PM by PIB Hyderabad

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఓ భవనం కూలిపోయిన దుర్ఘటనలో కొందరు మృత్యువాత పడటంపై ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.

 

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి దగ్గరి బంధువులకు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 వంతున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ఎక్స్ లో ఈ కింది విధంగా తెలిపింది:

 

‘‘ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఓ భవనం కూలిన కారణంగా ప్రాణనష్టం సంభవించడం విచారకరం. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను. మృతుల దగ్గరి బంధువులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున పరిహారాన్ని, గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తాం: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ(@narendramodi)’’


(Release ID: 2053008) Visitor Counter : 64