ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీమతి అబేని తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
భారత్-జపాన్ మధ్య బలమైన సంబంధాలపై పునరుద్ఘాటన
प्रविष्टि तिथि:
06 SEP 2024 8:51PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జపాన్ మాజీ ప్రధాన మంత్రి దివంగత షింజో అబే భార్య శ్రీమతి అబేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, శ్రీ మోదీ దివంగత ప్రధానమంత్రి షింజో అబేతో తనకున్న సన్నిహిత వ్యక్తిగత స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశం-జపాన్ సంబంధాలపై అబే సాన్ కున్న బలమైన నమ్మకాన్ని ప్రస్తావించారు.
భారతదేశం పట్ల ఉన్న శ్రీమతి అబేకి ఉన్న నిరంతర అనుబంధానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన మంత్రి 'ఎక్స్' లో పోస్ట్ చేసారు;
“ఈ మధ్యాహ్నం శ్రీమతి అబేని కలవడం ఆనందంగా ఉంది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో నాకున్న సన్నిహిత స్నేహాన్ని గుర్తు చేసుకున్నాను. భారతదేశం-జపాన్ సంబంధాలపై అబే సాన్ కున్న విశ్వాసం మనకు శాశ్వతమైన బలాన్ని ఇస్తుంది. భారతదేశంతో శ్రీమతి అబే కొనసాగిస్తున్న లోతైన అనుబంధాన్ని ఎంతో అభినందిస్తున్నాను"
(रिलीज़ आईडी: 2052804)
आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam