ప్రధాన మంత్రి కార్యాలయం
సింగపూర్ అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
05 SEP 2024 4:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సింగపూర్ అగ్రశ్రేణి వాణిజ్యవేత్తల బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడి ఫండ్లు, మౌలిక సదుపాయాలు, తయారీ, ఇంధనం, ఆర్థిక-ఆర్థికేతర సుస్థిరత, రవాణా సంబంధిత రంగాల్లోని సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారు (సిఇఒ)లతో పలు అంశాలపై ఆయన చర్చించారు. సింగపూర్ ఉప ప్రధాని గౌరవనీయ గాన్ కిమ్ యోంగ్, హోం-న్యాయ వ్యవహారాల మంత్రి శ్రీ కె.షణ్ముగం కూడా ఇందులో పాల్గొన్నారు.
భారత్‌లో ఇప్పటికే వివిధ రంగాల్లో వారు పెట్టుబడులు పెట్టడాన్ని గుర్తుచేస్తూ ప్రధాని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా ఆర్థిక సహకార విస్తరణలో సింగపూర్ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు పోషించిన పాత్రను ప్రధాని కొనియాడారు. భారత్‌తో వారి వాణిజ్య భాగస్వామ్యానికి మరింత సౌలభ్యం దిశగా సింగపూర్‌లో ‘ఇన్వెస్ట్ ఇండియా’ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్-సింగపూర్ స్నేహబంధం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపుదిద్దుకోవడం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు పెద్ద పీట వేసినట్లు కాగలదని ఆయన అన్నారు.
***
(Release ID: 2052393)
Visitor Counter : 84
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam