రాష్ట్రపతి సచివాలయం
ఉపాధ్యాయ దినోత్సవం: భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
04 SEP 2024 6:19PM by PIB Hyderabad
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలను తెలియజేశారు.
రాష్ట్రపతి ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశంలో ఉపాధ్యాయులందరికీ నా హృదయ పూర్వక శుభాభినందనలను తెలియజేస్తున్నాను. ఈ రోజు మహనీయ విద్యావేత్త, తాత్త్వికుడు, భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలను అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన మొత్తం జాతికే ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
బాలలే దేశానికి భవిష్యత్తు. విద్యార్థులుగా వాళ్లు జీవన నైపుణ్యాలను, విలువలను నేర్చుకొంటారు. గురువులు మార్గదర్శకులుగా ఉంటూ, విద్యార్థులను భావితరం నేతలుగా మలచగలరు. వాళ్లే మన దేశ భవితవ్యాన్ని తీర్చి దిద్దగలుగుతారు.
ముందు తరం వారసుల మేధస్సులను వికసింపచేసే, సమగ్ర శ్రేష్ఠత్వ సాధన దిశగా పయనించేందుకు వారికి దారిని చూపే కీలక బాధ్యత గురువులదే. విద్యార్థినీ విద్యార్థుల్ని నైతిక విలువలు, గొప్ప ఆలోచనల దిశగా నడిచే నైపుణ్యాన్నీ, సమాజం పట్ల బాధ్యతతో నడుచుకొనేలా వివేకాన్నీ పాదుకొల్పవలసిన కర్తవ్యం గురువుల మీద ఉంది. ‘జాతీయ విద్య విధానం- 2020’ లో సూచించిన ప్రకారం, ఆధునిక పద్ధతుల్లో విద్యను బోధించడం, సాంకేతిక విజ్ఞానాన్నీ వీలయినంత వరకు గురువులు ఉపయోగించుకొంటూ విద్యార్థులు ఒక ఫలప్రద జీవనాన్ని గడిపేటట్టుగా, అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించేటట్టుగా వారికి సాధికారితను సమకూర్చేందుకు వీలు ఉంది.
మరో సారి యావత్తు ఉపాధ్యాయ సమాజానికి నా శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి వారు భారతదేశాన్ని గొప్ప గొప్ప శిఖర స్థాయులకు తీసుకుపోగలిగే విద్వత్తు కలిగిన విద్యార్థుల సముదాయాన్ని రూపొందించడంలో సఫలమవ్వాలని ఆకాంక్షిస్తున్నాను’’
Please click here to see the President's message –
(Release ID: 2052118)
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada