ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
Posted On:
04 SEP 2024 3:00PM by PIB Hyderabad
ఈ రోజు (బుధవారం) శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ తాలూకు ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇతరులకు సేవ చేయడం, ఇతరుల గురించి శ్రద్ధ వహించడంతో పాటు సమాజంలో సోదర బంధాన్ని, సద్భావనను ప్రోత్సహించడానికి ప్రపంచమంతటా లక్షల కొద్దీ ప్రజలకు ప్రేరణను శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అందిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ తాలూకు ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు.
ఇతరులకు సేవ చేయడానికి, ఇతరుల పట్ల శ్రద్ధ వహించడానికి ప్రపంచమంతటా లక్షల కొద్దీ ప్రజలకుశ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ప్రేరణ అందిస్తోంది. ఇది మనకు మన సమాజంలో సోదరత్వం తాలూకు బంధాలను, సద్భావనను ప్రోత్సహించాలన్న బోధనను కూడా అందిస్తోంది. మన భూ మండలాన్ని మెరుగైందిగా తీర్చిదిద్దడానికి మనం చేస్తున్న ప్రయత్నాల్లో దీని జ్ఞానం ఎల్లవేళల మనకు మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.’’
***
MJPS/RT
(Release ID: 2051861)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam