కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్పామింగ్ కు పాల్పడిన 50 సంస్థలు బ్లాక్ లిస్ట్
ట్రాయ్ ఆదేశాలతో సేవల సంస్థల చర్యలు
प्रविष्टि तिथि:
03 SEP 2024 3:18PM by PIB Hyderabad
వినియోగదారులు కోరుకోకుండానే వేరు వేరు అంశాలకు సంబంధించిన టెలిఫోన్ కాల్స్ వారికి రావడం అంతకంతకు పెరిగిపోతున్న సంగతిని టెలికం రెగ్యులేటరీ ఆథారిటి ఆఫ్ ఇండియా (ట్రాయ్) గమనించింది. పేర్లను నమోదు చేసుకోని టెలిమార్కెటర్లపై జనవరి నుంచి జూన్ వరకు అందిన ఫిర్యాదులు 7.9 లక్షలకు పైనే ఉన్నాయి.
ట్రాయ్ ఈ సమస్యను తీవ్రమైనదిగా పరిగణించి, ఇంటర్నెట్ సేవలు అందించే అన్ని సంస్థలకు ఈ నెల 13న కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐపి, పిఆర్ఐ లేదా ఇతర టెలికం వనరులను ఉపయోగించుకుంటూ టెలిమార్కెటింగ్ సంస్థలు గాని, లేదా పేర్లను నమోదు చేసుకోని వర్గాల వద్ద నుండి ఎలాంటి వ్యాపార ప్రోత్సాహక వాయిస్ కాల్స్ నైనా సరే వెనువెంటనే ఆపివేయాలంటూ ఏక్సెస్ ప్రొవైడర్స్ ను ట్రాయ్ ఆదేశించింది. ఈ వనరులను దుర్వినియోగ పరచినట్లు తేలిన నమోదు కానీ ఏ టెలిమార్కెటర్ అయినా సరే కఠిన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుంది; వీటిలో రెండు సంవత్సరాల వరకు టెలికం వనరులన్నిటిని దూరం చేయడంతో పాటు వ్యవహార నిషేధ జాబితా (బ్లాక్ లిస్ట్)లోచేరుస్తారు.
స్పామింగుకు పాల్పడుతూ టెలికం వనరులను దుబారా చేసే సంస్థలపై ఏక్సెస్ ప్రొవైడర్లు ఈమేరకు కఠిన చర్యలు తీసుకున్నారు. 50కి పైగా సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు 2.75 లక్షల ఎస్ఐపి డిఐడి/మొబైల్ నంబర్ లు/టెలికం వనరులను డిస్‌కనెక్ట్ చేసివేశాయి. ఈ చర్యలు స్పామ్ కాల్స్ ను తగ్గించడంలోను, వినియోగదారులకు ఊరటను కలిగించవచ్చని భావిస్తున్నారు. ఈ రంగంతో సంబంధం ఉన్న వర్గాలన్నీ (స్టేక్ హోల్డర్స్) ఆదేశాలను తూచా తప్పక పాటించాలని, టెలికం ఎకోసిస్టమ్ ను ఎక్కువ పారదర్శకత్వం కలిగిందిగాను, మరింత సమర్థంగాను మలచడంలో వాటి వంతు తోడ్పాటును అందించాలని ట్రాయ్ విజ్ఞప్తి చేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2051554)
आगंतुक पटल : 104