ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 21 JUL 2024 9:33PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగులు ఎస్. జైశంకర్ గారుగజేంద్ర సింగ్ షెకావత్ గారుయునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే గారుమంత్రివర్గంలో ఇతర సభ్యులు రావు ఇందర్ జిత్ సింగ్ గారుసురేష్ గోపి గారుప్రపంచ వారసత్వ కమిటీ చైర్మన్ విశాల్ శర్మ గారుఇతర ప్రముఖులకూ, మహిళలకూ నమస్కారం.

నేడు భారతదేశం గురుపౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటోంది. ముందుగా మీ అందరికీదేశ ప్రజలందరికీ జ్ఞానంఆధ్యాత్మిక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం ఇంత దివ్యమైన రోజున ప్రారంభమైంది. భారత్ లో తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమం సహజంగానే నాతో సహా దేశ ప్రజలందరికీ ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన ప్రముఖులుఅతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలేకు శుభాకాంక్షలు. ప్రతీ ప్రపంచ సదస్సు మాదిరిగానే భారత్ లో ఈ సమావేశం కూడా సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

విదేశాల నుంచి తీసుకువచ్చిన ప్రాచీన వారసత్వ ప్రదర్శనను చూశాను. గత కొన్నేళ్లలో భారతదేశానికి చెందిన 350కి పైగా పురాతన వారసత్వ సంపదను తిరిగి తీసుకొచ్చాం. ప్రాచీన వారసత్వ సంపద తిరిగి రావడం ప్రపంచ ఉదారతనుచరిత్ర పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఒక అద్భుతమైన అనుభవం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీఈ రంగంలో పరిశోధనపర్యాటకానికి అపారమైన అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.

 

మిత్రులారా,

ప్రపంచ వారసత్వ కమిటీ కార్యక్రమ నిర్వహణ దేశానికి గర్వకారణమైన విజయంతో ముడిపడి ఉంది. మన ఈశాన్య భారతంలోని చారిత్రక ‘మోయిడాం’ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని ప్రతిపాదించినట్లు నాకు సమాచారం అందింది. ఇది భారతదేశం యొక్క 43 వ ప్రపంచ వారసత్వ ప్రదేశం కానుంది. ఈశాన్య భారతదేశం నుండి సాంస్కృతిక ప్రపంచ వారసత్వ హోదా పొందిన మొదటి వారసత్వ ప్రదేశం కానుంది. మోయిడాం ప్రత్యేక లక్షణాల కారణంగా చాలా ప్రత్యేకమైనది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన తర్వాత దాని ప్రజాదరణప్రపంచ ఆకర్షణ పెరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను.

 

మిత్రులారా,

 

నేటి కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన నిపుణులు ఈ సదస్సు గొప్పతనాన్ని ప్రతిబింబిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన సజీవ నాగరికతల్లో ఒకటైన భారత నేలపై ఈ సదస్సు జరుగుతోంది. ప్రపంచంలోని వివిధ వారసత్వ కేంద్రాలను మనం చూశాం. కానీ భారతదేశం అత్యంత పురాతనమైనది. దేశంలోని ప్రస్తుత ప్రతీ ప్రదేశం తన అద్భుతమైన గతాన్ని చెబుతుంది. ఢిల్లీని ఉదాహరణగా తీసుకుంటే... ఢిల్లీ భారతదేశ రాజధాని నగరంగా ప్రపంచానికి తెలుసు. కానీఈ నగరం వేల సంవత్సరాల పురాతన వారసత్వానికి కేంద్రం కూడా. ఇక్కడ అడుగడుగునా చారిత్రక వారసత్వం కనిపిస్తుంది. ఇక్కడికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అనేక టన్నుల బరువున్న ఇనుప స్తంభం ఉంది. ఇది 2,000 సంవత్సరాలుగా ఆరు బయట నిలబడి ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉన్న స్తంభం. ఆ సమయంలో భారత లోహశాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో దీన్ని బట్టి అర్థమవుతోంది. భారత వారసత్వం కేవలం చరిత్ర మాత్రమే కాదని స్పష్టం చేశారు. భారత వారసత్వం కూడా ఒక శాస్త్రమే.

 

మిత్రులారా,

 

భారత వారసత్వం కూడా అత్యున్నత స్థాయి ఇంజినీరింగ్ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. ఢిల్లీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో 3,500 మీటర్ల ఎత్తులో కేదార్‌నాథ్ ఆలయం ఉంది. నేటికీఆ ప్రదేశం భౌగోళికంగా చాలా దూరంలోఎత్తులో ఉందిప్రజలు అక్కడికి చేరుకోవాలంటే అనేక కిలోమీటర్లు నడవాలి లేదా హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి. నేటి కాలంలో ఇలాంటి నిర్మాణం చేపట్టడం చాలా సవాలుతో కూడుకున్నది... సంవత్సరంలో ఎక్కువ భాగంమంచు కారణంగా అక్కడ పని చేయడం అసాధ్యం. కానీకేదార్‌నాథ్ లోయలో ఇంత పెద్ద ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని ఇంజినీరింగ్ కఠినమైన వాతావరణంహిమానీనదాలు పరిగణనలోకి తీసుకుంది. అంతేకాకఆలయంలో మోర్టార్ ఉపయోగించలేదు. కానీఈ ఆలయం నేటికీ దృఢంగా ఉంది. అదేవిధంగా దక్షిణాన రాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వర ఆలయం కూడా ఉదాహరణగా నిలుస్తోంది. ఆలయ నిర్మాణ స్వరూపందాని సమాంతరనిలువు కొలతలుదాని శిల్పాలు ... ఆలయంలోని ప్రతి భాగం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది.

 

మిత్రులారా,

 

నేను పుట్టిన గుజరాత్ రాష్ట్రంలో ధోలావీరాలోథాల్ వంటి ప్రదేశాలు ఉన్నాయి.  ధోలావీరాలో  క్రీ.పూ 3000 నుండి 1500 వరకు పట్టణ ప్రణాళికనీటి నిర్వహణ వ్యవస్థఏర్పాట్లు ఉన్నాయి. అవి 21 వ శతాబ్దంలో కూడా నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. లోథాల్ లోని కోటదిగువ పట్టణ ప్రణాళికవీధులుమురుగు కాలువల ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ఆ పురాతన నాగరికత ఆధునిక స్థాయిని తెలియజేస్తుంది.

 

మిత్రులారా,

భారతదేశ చరిత్రనాగరికత... సాధారణ చారిత్రక జ్ఞానం కంటే చాలా పురాతనమైనవివిస్తృతమైనవి. నూతన వాస్తవలు వెలుగులోకి వస్తుండటంతో... చరిత్రపై శాస్త్రీయ పరిశీలన జరుగుతుండటంతోగతాన్ని చూడటానికి మనం కొత్త దృక్పథాలను పెంపొందించుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లోని సినౌలిలో దొరికిన ఆధారాల గురించి ప్రపంచ నిపుణులు తప్పక తెలుసుకోవాలి. సినౌలి పరిశోధనలు తామ్ర యుగానికి చెందినవి. కానీఅవి సింధు లోయ నాగరికత కంటే వైదిక నాగరికతతో సరిపోతాయి. 2018లో అక్కడ 4 వేల ఏళ్ల నాటి రథం కనిపించింది. ఈ పరిశోధనలుఈ కొత్త వాస్తవాలు భారత్‌ను అర్థం చేసుకోవడానికి ముందస్తు ఆలోచనలు లేని కొత్త ఆలోచన అవసరమని చెబుతున్నాయి. కొత్త వాస్తవాల వెలుగులో చరిత్రపై ఈ కొత్త అవగాహనలో మీరంతా భాగస్వాములు కావాలనిదాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.

 

మిత్రులారా,

 

వారసత్వం అనేది కేవలం చరిత్ర మాత్రమే కాదుమానవాళి భాగస్వామ్య చైతన్యం. ప్రపంచంలో ఎక్కడైనా వారసత్వం కనిపించినప్పుడల్లా మన మనసులు ప్రస్తుత భౌగోళిక-రాజకీయ కారకాలను అధిగమిస్తాయి. ఈ వారసత్వ సంపదను ప్రపంచ శ్రేయస్సు కోసం మనం ఉపయోగించుకోవాలి. మన వారసత్వం ద్వారా హృదయాలను అనుసంధానం చేసుకోవాలి. నేడు 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ద్వారా యావత్ ప్రపంచానికి భారత్ పిలుపునిస్తోంది. మనమంతా కలిసి ఒకరి వారసత్వాన్ని మరొకరం ముందుకు తీసుకెళదాం... మానవ సంక్షేమ స్ఫూర్తిని విస్తరించడానికి మనమందరం ఏకమవుదాం. మన వారసత్వాన్ని పరిరక్షిస్తూనే పర్యాటకాన్ని ప్రోత్సహించడానికిమరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడానికి అందరం కలిసి పనిచేద్దాం.

 

మిత్రులారా,

అభివృద్ధి పేరుతో వారసత్వాన్ని విస్మరించిన కాలాన్ని ప్రపంచం చూసింది. కానీ నేటి యుగంలో మరింత అవగాహన ఉంది. ప్రస్తుతం భారత్ అభివృద్ధితో పాటువారసత్వం అనే దార్శనికతతో ముందుకు వెళ్తోంది. గత పదేళ్లలోభారతదేశం ఆధునిక అభివృద్ధిలో కొత్త కోణాలను స్పృశించిందిఅదే సమయంలో 'విరాసత్ పర్ గర్వ్' (వారసత్వం పట్ల గర్వం) ప్రతిజ్ఞ కూడా చేసింది. వారసత్వ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నాం. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ నడవా కావచ్చు..అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావచ్చు...పురాతన నలంద విశ్వవిద్యాలయం ఆధునిక క్యాంపస్ నిర్మాణం కావచ్చుఇలాంటి అనేక పనులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వారసత్వం పట్ల భారత్ సంకల్పం మానవాళికి సేవ చేయాలనే స్ఫూర్తితో ముడిపడి ఉంది. భారత సంస్కృతి 'స్వయం' (ఆత్మ) కన్నా 'వయం' (మనం) గురించే మాట్లాడుతుంది. దేశ స్ఫూర్తి – ‘నేను’ కాదు,’ మనమే! ఈ మనస్తత్వంతో భారత్ ప్రపంచ శ్రేయస్సులో భాగస్వామి కావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది.

 

మిత్రులారా,

నేడు ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. నేడు ప్రపంచం ఆయుర్వేద శాస్త్రం ద్వారా ప్రయోజనం పొందుతోంది. ఈ యోగఆయుర్వేదం భారతదేశ శాస్త్రీయ వారసత్వాలు. గత ఏడాది జీ-20 సదస్సుకు కూడా ఆతిథ్యమిచ్చాం. 'ఒకే భూమిఒకే కుటుంబంఒకే భవిష్యత్తుఅనేది ఈ సదస్సు ఇతివృత్తం. ఈ స్ఫూర్తి మనకు ఎక్కడి నుంచి వచ్చింది? 'వసుధైక కుటుంబం' (ప్రపంచమే ఒకే కుటుంబం) అనే ఆలోచన నుంచి మాకు ఈ స్ఫూర్తి లభించింది. ఆహారంనీటి సంక్షోభం వంటి సవాళ్లను పరిష్కరించడానికి భారత్ చిరుధాన్యాలను ప్రోత్సహిస్తోంది. 'మాతా భూమిః పుత్రో హమ్ పృధ్వీయమా ఆలోచన. అంటేఈ భూమి మా తల్లిమేము ఆమె పిల్లలం. ఈ ఆలోచనతోనే నేడు అంతర్జాతీయ సౌర కూటమిమిషన్ ఎల్ఐఎఫ్ఈ వంటి పరిష్కారాలను భారత్ అందిస్తోంది.

 

మిత్రులారా,

చివరగా విదేశాల నుంచి వచ్చిన అతిథులందరికీ మరో విన్నపం. భారత్ ను అన్వేషించండి. మీ సౌలభ్యం కోసం ఘనమైన వారసత్వ ప్రదేశాల కోసం పర్యటక సిరీస్ కూడా ప్రారంభించాం. ఈ అనుభవం మీ సందర్శనను చిరస్మరణీయం చేస్తుందని భావిస్తున్నాను. ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలకు మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. కృతజ్ఞతలునమస్కారం.

 

***

 


(Release ID: 2050871) Visitor Counter : 61