ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆస్ట్రియాలో నివ‌సిస్తున్న ప్ర‌వాస భార‌తీయుల‌నుద్దేశించి ప్ర‌ధాని ప్రసంగం

Posted On: 10 JUL 2024 11:59PM by PIB Hyderabad

భార‌త్ మాతాకు జై ! 

భార‌త్ మాతాకు జై ! 

భార‌త్ మాతాకు జై ! 

 

ప్ర‌సంగం మొద‌లుపెట్ట‌మంటారా గౌరవనీయ ఆస్ట్రియా ఆర్థిక‌కార్మిక శాఖ మంత్రీ,  ప్ర‌వాస భార‌తీయులంద‌రికీభార‌త‌దేశ స్నేహితుల‌కుశ్రేయోభిలాషులంద‌రికీనా శుభాకాంక్ష‌లు.

 

గుటెన్ టాగ్ ( గుడ్ డేహ‌లో)

 

స్నేహితులారా

ఆస్ట్రియాలో ఇది నా మొద‌టి ప‌ర్య‌ట‌న‌. ఇక్క‌డ క‌నిపిస్తున్న ఉత్సాహంఉల్లాసం అద్భుతం. 41 ఏళ్ల  త‌ర్వాత భార‌త‌దేశ ప్ర‌ధాని ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. చివ‌రిసారిగా భార‌త ప్ర‌ధాని ఈ దేశంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు మీలో చాలా మంది జ‌న్మించే ఉండ‌రు. ఈ నిరీక్ష‌ణ మ‌రీ ఎక్కువ స‌మ‌యం తీసుకుంద‌ని అనుకుంటున్నారా?  మొత్తానికి మీ ఎదురు చూపులు ముగిశాయి. ఇప్పుడు మీరంతా సంతోషంగా ఉన్నారా?  మీరు నిజంగానే సంతోషంగా ఉన్నారా?  లేక మొహ‌మాటం కొద్దీ చెబుతున్నారా?  మీ సంతోషం నిజ‌మే!

 

స్నేహితులారా

ఒక చారిత్ర‌క సంద‌ర్భాన మీ నిరీక్ష‌ణ ముగిసింది. మీలో చాలా మందికి ఈ విష‌యం తెలియ‌కపోవచ్చు. భార‌త్‌ఆస్ట్రియా దేశాల స్నేహ‌సంబంధాలు మొద‌లై 75 సంవ‌త్స‌రాలవుతున్న శుభ‌వేళ ఇది. అద్భుతంగా స్వాగ‌తం ప‌లికినందుకు ఛాన్స‌ల‌ర్ కార్ల్ నెహ‌మ్మ‌ర్ కు మ‌న‌సారా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఆర్ధిక‌కార్మిక శాఖ మంత్రి మార్టిన్ కొచ‌ర్ కు కృత‌జ్ఞ‌త‌లు. మీకు ఆస్ట్రియాలోని ప్ర‌వాస భార‌తీయులు ఎంత ప్రత్యేక‌మో చెప్పడానికి మీరు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వ్వ‌డ‌మే నిద‌ర్శ‌నం. 

 

స్నేహితులారా

భౌగోళికంగా చూసిన‌ప్పుడుభార‌త్ ఆస్ట్రేలియాలు ప్ర‌పంచ ప‌టంలో రెండు వైపులా ఉన్నాయి. కానీ ఇరు దేశాల మ‌ధ్య సారూప్య‌తలు చాలా ఉన్నాయి. మ‌న రెండు దేశాల‌ను ప్ర‌జాస్వామ్యం క‌లుపుతోంది. స్వేచ్ఛసమాన‌త్వంసాంస్కృతిక వైవిధ్యంప‌రిపాల‌న మొద‌లైన‌వి ఇరు దేశాలు ఉమ్మ‌డిగా క‌లిగిన అంశాలు. మ‌న స‌మాజాలు బ‌హుళ సంస్కృతుల‌నుబ‌హుభాష‌ల‌ను క‌లిగి ఉన్నాయి. వైవిధ్యాన్ని సంబ‌రంలా భావించ‌డం మ‌న రెండు దేశాల సంప్ర‌దాయాల్లో ఉంది. ఈ విలువల్ని మ‌న దేశాల్లో నిర్వ‌హించే ఎన్నిక‌లు ప్ర‌తిఫ‌లిస్తున్నాయి. మ‌రికొన్ని నెల‌ల్లో ఆస్ట్రియాలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. భార‌త‌దేశం ఈ మ‌ధ్య‌నే ఎన్నిక‌ల‌నే ప్ర‌జాస్వామ్య పండ‌గ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఎన్నిక‌లు ఈ మ‌ధ్య‌నే ముగిశాయి. 

 

స్నేహితులారా,

 

భారత్‌లో ఎన్నికల గురించి విన‌గానే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కొన్ని వారాల క్రితం ముగిసిన ఎన్నికలలో65 కోట్లకు పైగా ప్రజలు ఓటు వేశారు. ఆస్ట్రియా జనాభాతో పోల్చితే ఇది 65 రెట్లు ఎక్కువ‌. ఒక సారి ఊహించండిఇంత భారీ స్థాయిలో ఎన్నికలు జరిగినాకొన్ని గంటల్లోనే ఫలితాలను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది.  ఇది భారతదేశ‌ ఎన్నికల యంత్రాంగ బ‌లంఅంతే కాదు  మన ప్రజాస్వామ్య బలం కూడా. 

 

స్నేహితులారా

 

ఈ ఎన్నికల్లో వందలాది రాజకీయ పార్టీలుఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఇవి పోటోపోటీగా జ‌రిగిన ఎన్నిక‌లు. అంతే కాదు వైవిధ్య‌మైన ఎన్నిక‌లివి. భార‌త‌దేశ ప్ర‌జ‌లు త‌మ తీర్పును ప్ర‌క‌టించారు. ఆ తీర్పు ఎలాంటిది?  60 ఏళ్ల త‌ర్వాత‌భార‌త్ లో మొద‌టిసారిగా ఒక ప్ర‌భుత్వానికి వ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ల‌భించింది. కోవిడ్ అనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతను చూశాం. చాలా దేశాల్లో ప్రభుత్వాలకు మనుగడ సాగించడం అంత సులభంగా లేదు. మళ్లీ అధికారంలోకి రావడం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లోని ప్రజలు నన్నునా పార్టీనిఎన్డీయేను విశ్వసించారు. భారత్ స్థిరత్వాన్నిపాల‌న‌ కొనసాగింపును కోరుకుంటుందనడానికి ఈ తీర్పు ఒక నిదర్శనం. గత పదేళ్ల విధానాలు,  కార్యక్రమాల వ‌ల్ల ఈ పాల‌న కొన‌సాగింపు అనేది సాధ్య‌మైంది.. ఈ అధికార‌ కొనసాగింపు సుపరిపాలన కోసమే. ఈ కొనసాగింపు అనేది  ఉన్న‌త‌ తీర్మానాల అమ‌లుకోసం అంకితభావంతో పనిచేయడానికే. 

 

స్నేహితులారా,

కేవ‌లం ప్ర‌భుత్వాల వ‌ల్ల‌నే రెండు దేశాల మ‌ధ్య‌న బంధాలు నిర్మితంకావ‌నే విష‌యాన్ని నేను ఎల్ల‌ప్పుడూ న‌మ్ముతాను. ఈ సంబంధ బాంధ‌వ్యాలు బ‌లోపేతంకావాలంటే ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం కీల‌కం. అందుకే ఈ బంధాల్లో మీ పాత్ర చాలా ముఖ్య‌మ‌ని నేను భావిస్తున్నాను. ప్ర‌ఖ్యాత సంగీత విద్వాంసుడు మొజార్ట్ నీ, స్ట్రుడెల్స్ ( పేస్ట్రీలాంటి ఆహారం) నీ మీవిగా భావించారు. అయితే అదే స‌మ‌యంలో మీ మాతృభూమి సంగీతంరుచులు ఇంకా మీ హృద‌యాల్లోనే నిలుపుకున్నారు. వియ‌న్నాగ్రాజ్లింజ్‌ఇన్స్ బ్ర‌క్‌సాల్జ్ బ‌ర్గ్ మొద‌లైన ఆస్ట్రియా న‌గ‌రాల వీధుల‌ను భార‌త‌దేశ రంగుల‌తో నింపారు. దీపావ‌ళి కావ‌చ్చుక్రిస్మ‌స్ సంబ‌రం కావ‌చ్చుఆయా పండ‌గ‌ల‌ను ఉత్సాహంగా జ‌రుపుకుంటూ ఉన్నారు. ఎంతో సంతోషంతో టోర్టెల‌ను ( స్థానిక కేకులు)ల‌డ్డూల‌ను త‌యారు చేస్తున్నారు. ఆర‌గిస్తున్నారు. ఇత‌రుల‌కు పంచుతున్నారు. ఆస్ట్రియా ఫుట్ బాల్ టీమ్ ప‌ట్ల కావ‌చ్చుభార‌త‌దేశ క్రికెట్ టీమ్ ప‌ట్ల కావ‌చ్చు మీ ప్రేమ‌లో తేడా లేదు. ఇక్క‌డి కాఫీని మీరు ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతున్నారు. అలాగే భార‌త‌దేశ టీ స్టాళ్ల‌ను అంతే ప్రేమ‌గా గుర్తుపెట్టుకుంటున్నారు. 

 

స్నేహితులారా

భారత్ లాగాఆస్ట్రియా చరిత్ర,  సంస్కృతి కూడా చాలా పురాతనమైనవిఅద్భుతమైనవి. మన చారిత్రక సంబంధాలు రెండు దేశాలకు సాంస్కృతికంగానువాణిజ్యపరంగాను ప్రయోజనం చేకూర్చాయి. సుమారు 200 సంవత్సరాల క్రితంవియన్నా విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. 1880లో ఇండాలజీకి స్వతంత్ర పీఠాన్ని ఏర్పాటు చేయడమ‌నేది ఈ దేశంలో సంస్కృతంపట్ల  ఆసక్తిని మరింత పెంచింది. ఈరోజుఇక్కడ కొంతమంది ప్రసిద్ధ ఇండాల‌జిస్టుల‌ను కలిసే అవకాశం నాకు లభించింది. వారి మాట‌లు భారత్ పట్ల వారికి ఉన్న లోతైన ఆసక్తిని స్పష్టంగా ప్రతిబింబించాయి. ఆస్ట్రియా దేశం ప‌లువురు భారతీయ ప్ర‌ముఖులను ఎంత‌గానో ప్రేమించింది.  రవీంద్రనాథ్ ఠాగూర్ ,  నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మన గొప్ప వ్యక్తులకు వియ‌న్నా ఆతిథ్యం ఇచ్చింది.  గాంధీ శిష్యురాలు మీరాబెన్ తన చివరి రోజులను వియన్నాలో గడిపింది.

 

స్నేహితులారా

ఇరు దేశాల మ‌ధ్య‌న సంబంధాలు సంస్కృతివాణిజ్యాల‌కు మాత్ర‌మే సంబంధించిన‌వి కావు. శాస్త్ర విజ్ఙానం కూడా రెండు దేశాల‌ను క‌లుపుతోంది. చాలా సంవ‌త్స‌రాల క్రితం మ‌న నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత స‌ర్ సీవీ రామ‌న్ వియ‌న్నా విశ్వ‌విద్యాల‌యంలో ఉప‌న్యాసం ఇచ్చారు. ఈ రోజున ఇక్క‌డ‌ నోబెల్ గ్ర‌హీత ఆంట‌న్ జీలింగ‌ర్ ను క‌లుసుకునే అవ‌కాశం నాకు ల‌భించింది. ఈ ఇద్ద‌రు గొప్ప శాస్త్ర‌వేత్త‌లకు క్వాంట‌ అనేది ఇష్ట‌మైన అంశం. క్వాంట‌ కంప్యూటింగ్ లో  శ్రీ ఆంట‌న్ జీలింగ‌ర్ చేసిన కృషి ప్ర‌పంచానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. 

 

స్నేహితులారా

 

నేడు  ప్రపంచ వ్యాప్తంగా భారత్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. జ‌రుగుతున్నాయాలేదాప్రతి ఒక్కరూ భారత్‌గురించి  తెలుసుకోవాలనిఅర్థం చేసుకోవాలని అన‌కుంటున్నారు. ఈ విష‌యం మీకు తెలిసే ఉండాలి.  అంతే క‌దాప్రజలు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుతుంటారుకాదాఇలాంటి పరిస్థితుల్లో భార‌త‌దేశం ఏం ఆలోచిస్తున్నది?   భార‌త‌దేశం ఏం చేస్తున్న‌ది భారత్ గురించి ప్ర‌పంచానికి  మెరుగైన సమాచారం తెలియ‌డం చాలా ముఖ్యం.  మానవాళిలో 1/6వ వంతుకు భార‌త‌దేశం ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ప్రపంచ వృద్ధికి దాదాపు సమానంగా దోహదం చేస్తోంది..వేల సంవత్సరాలుగా,  మ‌నం ప్రపంచంతో జ్ఞానాన్ని,  నైపుణ్యాన్ని పంచుకుంటున్నాము. భార‌త‌దేశం యుద్ధాలు చేయలేదు. భారతదేశం ప్ర‌పంచానికి బుద్ధుడిని ఇచ్చిందని, ‘యుద్ధం’ (యుద్ధాలు) కాదని గర్వంగా చెప్పుకోవచ్చు. నేను బుద్ధుని గురించి ప్ర‌స్తావించానుదీని అర్థం భారతదేశం ఎల్లప్పుడూ శాంతిశ్రేయస్సును అందించిందని. కాబ‌ట్టి ,  21వ శతాబ్దపు ప్రపంచంలో భారత్ ఈ పాత్రను బలోపేతం చేస్తూనే ఉంటుంది. నేడుప్రపంచం భారత్‌ను విశ్వ బంధు’ (ప్రపంచ మిత్రుడు)గా చూస్తున్నది. ఇది మనకు గర్వకారణం. మీరు కూడా గర్వపడాలి. కాదంటారా?  లేదా?

 

స్నేహితులారా

భారత్‌లో జరుగుతున్న వేగవంతమైన మార్పుల గురించి మీరు చదివినప్పుడువిన్నప్పుడుమీకు ఎలా అనిపిస్తుందిమిత్రులారా,  మీ ఛాతి కూడా గ‌ర్వంతో ఉప్పొంగుతుంద‌ని అనుకుంటున్నాను . భారత్ నేడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ‌త‌రించింది. 2014లోనేను ప‌రిపాల‌నా ప‌గ్గాలు చేపట్టినప్పుడు మ‌నం 10వ స్థానంలో ఉన్నాం. ఈ విష‌యాన్ని ప్ర‌తికూల భావ‌న‌తో చెప్ప‌డం లేదు.  నేడు మన దేశం అయిదో స్థానానికి చేరుకున్న‌ది. ఇది విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందిమీరు  గర్వంగా భావిస్తున్నారాలేదానేడు భారత్ 8 శాతం వృద్ధిని సాధిస్తోంది. ఇంత వేగంగా అభివృద్ధిని సాధిస్తుండ‌డంవ‌ల్ల‌  ఏం జరుగుతుందో తెలుసానేను మీకు  చెప్పాలానేడుమ‌నం  అయిదో స్థానంలో ఉన్నాం. త్వ‌ర‌లోనే మ‌నం  టాప్ మూడో స్థానానికి చేరుకుంటాం.  

స్నేహితులారానేను నా మూడో టర్మ్ లో  ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల స‌ర‌స‌న భార‌త‌దేశం ఉంటుందని  వాగ్దానం చేశాను. దీనిపై మ‌రింత చెప్ప‌నివ్వండిమ‌నం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మాత్రమే పని చేయడం లేదు. మ‌న‌ లక్ష్యం 2047. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.  2047లో దేశం స్వాతంత్య్ర‌ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. అప్ప‌టికి భార‌త‌దేశం  ‘విక‌సిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)  అవుతుంది. భారత్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే 1000 సంవత్సరాల్లో భార‌త‌దేశం సాధించాల్సిన ప్ర‌గ‌తికోసం మనం బలమైన పునాది వేస్తున్నాం.

 

స్నేహితులారా

విద్య‌నైపుణ్యాల‌క‌ల్ప‌న‌ప‌రిశోధ‌న‌ఆవిష్క‌ర‌ణ రంగాల్లో భార‌త‌దేశం క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో కృషి చేస్తోంది. ఈ సంఖ్య‌ల‌ను గుర్తుకు తెచ్చుకోండి. భార‌త‌దేశంలో గ‌త ప‌దేళ‌ల్లో ప్ర‌తి రోజూ రెండు క‌ళాశాలలు ప్రారంభ‌మ‌య్యాయి. దీనికి సంబంధించి మ‌రింత చెప్ప‌మంటారా?  ప్ర‌తి వారం ఒక కొత్త విశ్వ‌విద్యాల‌యం ప్రారంభ‌మైంది.  గ‌త ఏడాది ప్ర‌తి ప్ర‌తి రోజూ 250కిపైగా పేటెంట్ల‌కు ఆమోదం ల‌భించింది. నేడు భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే మూడో అతి పెద్ద అంకుర సంస్థ‌ల వ్య‌వ‌స్థ‌ను క‌లిగి వుంది. ప్ర‌పంచంలోని ప్ర‌తి ప‌ది యూనికార్న్ సంస్థ‌ల్లో ఒక‌టి భార‌త‌దేశంలో వుంది. వాస్త‌వ ప‌రిస్థితుల్లో మిగ‌తా ప్ర‌పంచంలో జ‌రిగే డిజిట‌ల్ లావాదేవీల‌న్నీ క‌లిపితే ఎన్ని ఉంటాయో అవ‌న్నీ ఒక్క భార‌త‌దేశ లావాదేవీల‌కు స‌మానమ‌వుతున్నాయి. మ‌న చెల్లింపులు డిజిట‌ల్ రూపంలోనే. మ‌న ప్ర‌క్రియ‌లు కూడా డిజిట‌ల్ గానే నిర్వ‌హిస్తున్నాం. అతి త‌క్కువగా పేప‌ర్ నున‌గ‌దును వినియోగిస్తూ అత్యున్న‌త‌మైన ఆర్థిక వ్య‌వస్థ‌గా భార‌త్  అవ‌త‌రిస్తోంది. 

 

స్నేహితులారా

 

నేడుభారత్ అత్యుత్తమమైన‌ప్రకాశవంతమైనఅతిపెద్ద వైన ఘ‌న‌త‌ల్ని సాధించ‌డం కోసం కృషి చేస్తోంది. భార‌త‌దేశంలో ఇండస్ట్రీ 4.0 ,  హ‌రిత భ‌విష్య‌త్తు సాధ‌న‌ కోసం  ప‌ని చేస్తున్నాం . గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యం 2070 నాటికి నికర-సున్నా లక్ష్యాలను సాధించడం. ప‌ర్యావ‌ర‌ణ హిత ర‌వాణా వ్య‌వ‌స్థ ఏర్పాటుపై ప‌ట్టుద‌ల‌గా ఉన్నాం. భారతదేశ‌ అపూర్వమైన వృద్ధి కథనం నుంచి  ఆస్ట్రియా కూడా ప్రయోజనం పొందుతోంది. నేడుభారత్‌లో 150కి పైగా ఆస్ట్రియన్ కంపెనీలు వివిధ రంగాలలో పనిచేస్తున్నాయి. భారత‌దేశ మౌలిక సదుపాయాల ఆకాంక్షలను నెరవేర్చడానికి వారు సహాయం చేస్తున్నారు. భారత్‌లోని మెట్రోలుఆనకట్టలు, సొరంగాల నిర్మాణాల్లాంటి అనేక మౌలిక స‌దుపాయాల‌ ప్రాజెక్టుల్లో ఆస్ట్రియన్ కంపెనీలు భాగ‌మ‌య్యాయి.  సమీప భవిష్యత్తులో ఇక్కడి నుండి మరిన్ని కంపెనీలుపెట్టుబడిదారులు భారత్‌కు వ‌స్తార‌ని నేను ఆశిస్తున్నాను.

 

స్నేహితులారా,

ఆస్ట్రియాలో నివ‌సిస్తున్న భార‌తీయుల‌ సంఖ్య పెద్ద‌దేమీ కాదు. కానీ మీరు ఆస్ట్రియా దేశానికి అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మైన‌వి. ఇక్క‌డి ఆరోగ్య‌రంగంలో మీ పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. భ‌ద్ర‌త‌ను ఇవ్వ‌డంలోద‌యగా ఉండ‌డంలో భార‌తీయుల‌కు మంచి పేరు ఉంది. ఇక్క‌డ మీరు మీ వృత్తి నిర్వ‌హ‌ణ‌లో ఈ విలువ‌ల్ని పాటిస్తుండ‌డం నాకు సంతోష‌న్నిస్తోంది. మీరు ఇదే విధంగా ఆస్ట్రియా అభివృద్ధికోసం కృషి చేయాల‌ని కోరుకుంటున్నాను. నాకోసం మీరు భారీ సంఖ్య‌లో ఇక్క‌డ‌కు త‌ర‌లివ‌చ్చినందుకుమీ ఉత్సాహానికి మీకు మ‌రొక్క‌సారి నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. అంద‌రికీ అభినంద‌న‌లు. 

 

స్నేహితులారా,

ఆస్ట్రియాలో నా మొద‌టి ప‌ర్య‌ట‌న అర్థ‌వంతంగా  జ‌రిగింది. మ‌రొక్క‌సారి ఆస్ట్రియా ప్ర‌భుత్వానికిఆస్ట్రియా ప్ర‌జ‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. మీ అంద‌రికీ నా శుభాకాంక్షులు. ఈ సారి ఆగస్ట్ 15 సంబ‌రాలు నిర్వ‌హించుకోవ‌డంలో గ‌త రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడ‌తార‌ని నాకు న‌మ్మ‌కం. అంతే క‌దా?  నాతో పాటు గొంతు క‌ల‌పండి.

 

***


(Release ID: 2050347) Visitor Counter : 45