ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిస్ ఒలంపిక్స్ బృందంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ పాఠం

Posted On: 16 AUG 2024 12:22PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి:  మిత్రులారా, మీ అందరితో ముచ్చటించడానికి వచ్చాను. ఇప్పుడు, మీలో ఎంతమంది ఓటమి నుంచి బయటపడ్డారు? ముందుగా మీరు ఓడిపోయారు అనే ఆ ఆలోచనను మీ మనసులోంచి తీసేయండి. మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, విలువైన పాఠం నేర్చుకొని తిరిగి వచ్చారు.. అందుకే క్రీడల్లో ఎవరూ ఓడిపోరు. అందరూ ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఈ విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. అందుకే మీలో ఎంతమందికి అలా అనిపించిందని అడిగాను. మీలో 80% మంది చేతులు ఎత్తకపోవడం మంచిది, అంటే నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. చేతులు పైకెత్తినవారు వినయంతో, బహుశా వివేకంతో అలా చేశారు. కానీ వారికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు వెనుకబడిపోయారని అనుకోవద్దు; మీరు జ్ఞాన సంపదతో తిరిగి వచ్చారు. మీరు నాతో ఏకీభవిస్తారా? రండి, గట్టిగా చెప్పండి- ఎంతైనా మీరు ఒక క్రీడాకారులు (అథ్లెట్లు).



అథ్లెట్లుఅవును సార్!



ప్రధాన మంత్రి: ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మైదానంలో మీరు ఏం చేశారో ప్రపంచం చూసింది, కానీ చెప్పండి, మీరు పోటీలలో పాల్గొనడం కాకుండా ఇంకేం చేశారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లతో స్నేహం చేసి, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని ఉంటారు. ఇక్కడ కూడా అలాంటిదేదో ఉంటే బాగుంటుందని మీరు భావించి ఉండవచ్చు. అలాంటి ఆలోచనలు మీ మదిలో మెదిలాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాబట్టి, నేను మీ అనుభవాల గురించి వినాలనుకుంటున్నాను. నాతో ఆ అనుభూతులను మొదటగా ఎవరు పంచుకుంటారు?



లక్ష్య: అవును సార్, ముందుగా మీకు నమస్కారం...

 

ప్రధాన మంత్రి: నేను మొదటిసారి లక్ష్యని కలిసినప్పుడు, అతను చిన్న పిల్లవాడు, కానీ ఇప్పుడు అతన్ని చూడండి- అతను చాలా ఎదిగాడు.



లక్ష్యటోర్నమెంట్ సమయంలో, మొదటి రోజు నుండి నా మ్యాచ్ లు సుదీర్ఘంగా, తీవ్రంగా ఉన్నాయి, కాబట్టి నేను ప్రధానంగా నా ఆటలపై దృష్టి పెట్టాను. ఏదేమైనా, మాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, మేమందరం కలిసి రాత్రి భోజనానికి (డిన్నర్ కు) వెళ్ళేవాళ్లం, అక్కడ నేను చాలా మంది ఇతర అథ్లెట్లను కలిశాను. వాళ్లను చూడటం, వారితో డైనింగ్ రూమ్ పంచుకోవడం నాకు చాలా పెద్ద విషయం. ముఖ్యంగా ఇది నా తొలి ఒలింపిక్స్ కావడంతో వాతావరణం అంతా అద్భుతంగా అనిపించేది. ఇంత పెద్ద స్టేడియంలో ఇంత మంది వీక్షించడంతో మొదట్లో కొద్దిగా భయంగా అనిపించింది. మొదటి రెండు, మూడు మ్యాచ్ లలో నేను భయపడ్డాను, కానీ టోర్నమెంట్ ముందుకు సాగేకొద్దీ, నాకు మరింత సౌకర్యవంతంగా అనిపించింది. మొత్తం మీద, ఇదొక గొప్ప అనుభవం.



ప్రధాన మంత్రి: సరే, మీరు దేవభూమికి చెందినవారు, కానీ మీరు అకస్మాత్తుగా ప్రముఖులుగా (సెలబ్రిటీ) అయ్యారని మీకు తెలుసా?



లక్ష్య: అవును సార్. మ్యాచ్ ల సమయంలో ప్రకాశ్ సర్ నా ఫోన్ తీసుకుని టోర్నమెంట్ ముగిసే వరకు నన్ను ఉపయోగించనివ్వనని చెప్పారు. తర్వాత నాకు ప్రజల నుంచి చాలా మద్దతు లభించిందని తెలుసుకున్నాను. ఇది ఒక విలువైన అభ్యాస అనుభవం, అయినప్పటికీ నేను చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినందుకు కొంచెం హృదయవిదారకంగా ఉంది. భవిష్యత్తులో నా ఫలితాలను మెరుగుపరుచుకోవాలని నిశ్చయించుకున్నాను.

 


ప్రధాన మంత్రి: కాబట్టి, ప్రకాశ్ సర్ కఠినంగా, క్రమశిక్షణతో ఉండేవారు కదా? వచ్చేసారి, నేను అతన్ని తప్పకుండా పంపుతాను.

లక్ష్య: తప్పకుండా సార్.

ప్రధాన మంత్రి: కానీ మీరు చాలా నేర్చుకుని ఉంటారు. మీరు గెలిచినట్లయితే అది అద్భుతంగా ఉండేది, కానీ ఆటను అర్థం చేసుకోని వారు కూడా మీరు గంటల తరబడి ఆడటాన్ని చూశారు. వారు మీ ఆట హైలైట్స్ పై రీల్స్ చూస్తూనే ఉన్నారు. మీరు ఆడిన తీరు చూసిన తర్వాత విదేశీ ఆటగాళ్లు మాత్రమే కాదు, మన పిల్లలు కూడా అలా గొప్పగా ఆడగలరని ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. ఈ స్ఫూర్తి నిజంగానే వేళ్లూనుకుంది.


లక్ష్య: అవును సార్. నా ఒకటి రెండు షాట్స్ బాగా జనరంజకం(పాపులర్) అయ్యాయని అనుకుంటున్నాను. కానీ మొత్తం మీద, టోర్నమెంట్లో నా ప్రదర్శనతో భవిష్యత్తులో బ్యాడ్మింటన్ ను ఆడబోయే ఇతర యువ క్రీడాకారులకు ఇలాగే ఆడటానికి స్ఫూర్తినిస్తుందని నేను ఆశిస్తున్నాను.


ప్రధాన మంత్రి: చాలా బాగుంది. అప్పుడు ఏసీ లేదు, చాలా వేడిగా ఉంది. మొదట ఇలా చెప్పింది ఎవరు? 'మోదీ గొప్పగా మాట్లాడతారు, కానీ గదిలో ఏసీ లేదు-మనం ఏం చేయాలి?' అని ఎవరు అడిగారు? ఎండ వేడిమికి ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు? కానీ కొన్ని గంటల్లోనే సమస్య పరిష్కారమైందని విన్నాను. అందరికీ వెంటనే ఏసీ వచ్చింది కదా? ప్రతి ఆటగాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చూశారా? అందరూ వెంటనే చర్యలు తీసుకుంటారు.


అంజుమ్ మౌద్గిల్: నమస్కారం సార్. నా పేరు అంజుమ్ మౌద్గిల్, నేను షూటింగ్ స్పోర్ట్స్ లో ఉన్నాను. నా మొత్తం అనుభవంలో ఇది నా రెండవ ఒలింపిక్స్, నేను కొన్ని పాయింట్ల తేడాతో ఫైనల్స్ మిస్ అయ్యాను. కానీ ఒక భారతీయ పౌరురాలిగా, ఒక ఒక క్రీడాకారిణిగా, క్రీడాకారులు ప్రతిరోజూ ఎదుర్కొనే అనుభవాలను నేను అనుభవించాను- ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో విపరీతమైన ఆనందం, అది తృటిలో జారిపోయినప్పుడు తీవ్రమైన నిరాశ. ఒలింపిక్స్ సమయంలో భారత్ ప్రదర్శన కారణంగా యావత్తు దేశానికి ఆ అనుభూతి కలిగింది. ఒక రోజు, మను పతకంతో మేము చాలా సంతోషించాము, కానీ తరువాత ఇతర క్రీడాకారులు నాల్గవ స్థానంలో నిలిచిన సందర్భాలు ఉన్నాయి, వినేష్ కథ నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఆ తర్వాత హాకీ మ్యాచ్, ఆ తర్వాత వచ్చిన ఆనందం. మనం రోజూ అనుభవించే భావోద్వేగాల పరిధిని ఆ పది రోజుల్లో దేశం మొత్తం అనుభవించింది. భారతదేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ క్రీడలు చాలా మంచి సమయంలో వచ్చాయని నేను అనుకుంటున్నాను, ఇక నుండి, క్రీడాకారులు (అథ్లెట్లు)గా మా ప్రయాణాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు. దీని నుంచి వచ్చే సానుకూల మార్పులు భవిష్యత్తులో మరింత ప్రభావం చూపుతాయి.

 

ప్రధాన మంత్రి: మీరు చెప్పింది నిజమే. మీరు ఒక్కరే కాదు, భారతదేశం లోని ప్రతి మూలలోనూ ఇదే వైఖరి ఉండేది. ఏ ఆటగాడైనా కాస్త ఇబ్బందిగా కనిపిస్తే ఆటను వీక్షించే వారు అశాంతికి లోనవుతారు. ఇది కారు నడపడంతో సమానం: మీరు వెనుక సీట్లో ఉండి, ఎలా నడపాలో మీకు తెలిస్తే, ముందు ఉన్న వ్యక్తి బ్రేకులు వేయవలసి వచ్చినా, మనం డ్రైవింగ్ చేస్తున్నట్లుగా మన పాదాలను నొక్కుతాము. అదేవిధంగా ఆటగాళ్లు ఆడినప్పుడల్లా ప్రజలు చేతులు, కాళ్లను పైకి, కిందకు కదిలించేవారు. శ్రీజేష్, మీరు ఇప్పటికే రిటైర్ కావాలని నిర్ణయించుకున్నారా, లేదా ఇది ఇటీవలి నిర్ణయమా?

 

శ్రీజేష్: సార్, నమస్తే. కొన్నేళ్లుగా ఆలోచిస్తున్నాను. నువ్వు ఎప్పుడు రిటైర్ అవుతావని నా సహచరులు నన్ను తరచుగా అడిగారు; ఈ ప్రశ్న నన్ను తరచుగా అడిగేవారు. అయితే, నేను 2002లో నా కెరీర్ ను ప్రారంభించాను, 2004లో జూనియర్ జట్టుతో నా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాను. నేను ఇరవై ఏళ్లుగా నా దేశం కోసం ఆడుతున్నాను, కాబట్టి నేను ఒక ప్రముఖ వేదిక నుండి రిటైర్ కావాలనుకున్నాను. ప్రపంచం మొత్తం సంబరాలు చేసుకునే వేదిక ఒలింపిక్స్ కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదని భావించాను. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను.

ప్రధాన మంత్రిజట్టు నిస్సందేహంగా మిమ్మల్ని మిస్ అవుతుందని నేను మీకు చెబుతాను, కానీ వారు మీకు అద్భుతమైన వీడ్కోలు ఇచ్చారు.



శ్రీజేష్అవును సార్.



ప్రధాన మంత్రి: బృందానికి అభినందనలు.

శ్రీజేష్: నిజాయతీగా చెప్పాలంటే, సార్, ఇలాంటి ఫలితం గురించి మనం కలలు కనే అవకాశం మాత్రమే ఉంది.. సెమీఫైనల్లో ఓడిపోయినప్పుడు మాకు చాలా కష్టంగా అనిపించింది. జట్టు పారిస్ వెళ్లినప్పుడు మేం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఫైనల్ కు చేరుకోవాలనే లేదా బహుశా బంగారు పతకాన్ని గెలుచుకోవాలనేదే మా లక్ష్యం.. సెమీఫైనల్లో ఓడిపోవడం అందరినీ కొంత నిరుత్సాహానికి గురిచేసింది. అయితే ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాక అందరూ శ్రీ భాయ్ (శ్రీజేష్) కోసం గెలవాలని నిశ్చయించుకున్నారు. సర్, ఇది నాకు చాలా గర్వంగా ఉంది. ఇన్నేళ్లు నేను పడిన కష్టం నా దేశం కోసం. నా సహచరులు నాకు మద్దతు ఇచ్చారు, వీడ్కోలు సమయంలో నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాను. వీడ్కోలు చెప్పాను.

ప్రధాన మంత్రి: కేవలం పది మంది ఆటగాళ్లతో బ్రిటన్ తో పోటీ పడాల్సి వచ్చినప్పుడు మొదట్లో నిరుత్సాహపడ్డారా చెప్పండి? సర్పంచి సాహెబ్, దయచేసి మీ ఆలోచనలు పంచుకోండి. ఇది చాలా సవాలుతో కూడుకున్నది.



హర్మన్ప్రీత్ సింగ్నమస్కారం సార్. అవును, ఇది నిజంగా చాలా కష్టం. మా ఆటగాడు క్వార్టర్ ఫైనల్లో ఆటలో నుంచి బయటకు పంపి వేయబడ్డాడు. అయితే, మా కోచింగ్ సిబ్బంది గణనీయమైన మద్దతు ఇచ్చారు. ఒలింపిక్స్ లో అనుకోకుండా ఏదైనా జరగవచ్చు కాబట్టి సాధ్యమైన ప్రతి సన్నివేశాన్ని ఊహించుకున్నాం. పరిస్థితులతో సంబంధం లేకుండా మా ప్రణాళికలకు కట్టుబడి ఉండాలని మేము నిశ్చయించుకున్నాము, ఇది జట్టు ఉత్సాహాన్ని పెంచింది. గ్రేట్ బ్రిటన్ తో మాకు కొంచెం శత్రుత్వం ఉంది, అది మమ్మల్ని మరింత ప్రేరేపించింది.



ప్రధాన మంత్రి: ఆ వైరం 150 ఏళ్లుగా కొనసాగుతోంది.



హర్మన్ప్రీత్ సింగ్: నిజమే సార్. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. మ్యాచ్ గెలుస్తామనే దృఢ సంకల్పంతో ఉన్నాం, మ్యాచ్ ఏకపక్షంగా డ్రాగా ముగియడం, షూటౌట్ లో విజయం సాధించడం గొప్ప విషయం. ఒలింపిక్స్ చరిత్రలోనే ఇది అపూర్వం. మరో సంతోషకరమైన విషయం ఏంటంటే ఆస్ట్రేలియాను ఓడించాం.  52 ఏళ్ల  తర్వాత ఆస్ట్రేలియాను పెద్ద వేదికపై ఓడించడం మాకు పెద్ద విషయం.



ప్రధాన మంత్రి: 52 ఏళ్ల రికార్డులను మీరు బద్దలు కొట్టారు. వరుస ఒలింపిక్స్ లో పాల్గొనడం కూడా చెప్పుకోదగ్గ విజయమే.



హర్మన్ప్రీత్ సింగ్: అవును సార్.



ప్రధాన మంత్రిమీరు అతి పిన్న వయస్కురాలు.



అమన్ షెరావత్ : నమస్తే సర్



ప్రధాన మంత్రిఏమి చేయాలో , చేయకూడదో మీకు సలహా ఇచ్చే, అనేక గొంతుకలు ఉన్నాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అది మీకు కొన్నిసార్లు భయాన్ని కలిగించిందా?

అమన్ సెహ్రావత్: నేను ఇంత చిన్న వయసులోనే చాలా సవాలుతో కూడిన సమయాలను ఎదుర్కొన్నాను. నాకు పదేళ్ల వయసున్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను వదిలేసి ఒలింపిక్ పతకం సాధించాలనే కలను మాత్రమే మిగిల్చారు. ఆ కలను నేను పంచుకుంటాను, దేశం కోసం పతకం సాధించాలని నిశ్చయించుకున్నాను. దాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టుదలతో సాధన చేస్తూనే ఉన్నాను, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) సహకారం వెలకట్టలేనిది.

ప్రధాని: ఇప్పుడు ఎలా ఉన్నారు?



అమన్ సెహ్రావత్: నేను చాలా బాగున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది.



ప్రధాన మంత్రి: మీరు ఇంటికి వెళ్ళి మీకు నచ్చినవి తిన్నారా?



అమన్ సెహ్రావత్: నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు.



ప్రధానిమీరు ఇంటికి వెళ్లలేదా? మీరు నాకు తెలియజేసి ఉంటే, నేను మీ కోసం ఏదైనా ఏర్పాటు చేసేవాడిని.



అమన్ సెహ్రావత్: నేను ఇంటికి వెళ్లాక చుర్మా తినాలని అనుకుంటున్నాను.

 


ప్రధాన మంత్రియాదృచ్ఛికంగా, మన సర్పంచ్ సాహెబ్ కు మారుపేరు ఉన్నట్లే, మీలో ఎవరికైనా మారుపేరు ఉందా?



శ్రేయాసి సింగ్: నమస్కారం సార్. నా పేరు శ్రేయాసి సింగ్, ప్రస్తుతం బీహార్ ఎమ్మెల్యేగా ఉన్నాను. జట్టులో అందరూ నన్ను ఎమ్మెల్యే దీదీ అని పిలుస్తారు.



ప్రధాని: ఎమ్మెల్యే దీదీ , మీరు చెప్పండి



శ్రేయాసి సింగ్: అవును సార్.

ప్రధాని: అంటే ఇక్కడ సర్పంచ్, ఎమ్మెల్యే ఇద్దరూ ఉన్నారు. మీలో చాలా మంది ఈ రోజుల్లో మీ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడాన్ని నేను గమనించాను. అది సరైనదేనా? మీరు రీల్స్ చూస్తారు, రీల్స్ కూడా చేస్తారు, కాదా? మీలో ఎంతమంది రీల్స్ చేస్తున్నారు?

హర్మన్ప్రీత్ సింగ్సర్, వాస్తవానికి, ఒలింపిక్స్ అంతటా మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని జట్టు మొత్తం నిర్ణయించింది. సోషల్ మీడియాతో మమేకం కాకూడదని నిర్ణయించుకున్నాం.

ప్రధాన మంత్రి: అది మంచి నిర్ణయమే!



హర్మన్ప్రీత్ సింగ్ఖచ్చితంగా సార్. ఆ వ్యాఖ్యలు అనుకూలం(పాజిటివ్) అయినా, ప్రతికూలం (నెగిటివ్) అయినా అవి మమ్మల్ని ప్రభావితం చేస్తాయని భావించాం. అందుకే ఒక జట్టుగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం.



ప్రధాన మంత్రిమీరంతా ప్రశంసనీయమైన నిర్ణయం తీసుకున్నారు.



హర్మన్ప్రీత్ సింగ్: అవును సార్.



ప్రధాన మంత్రి: సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మీరు దేశ యువతకు సలహా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది తమ సమయాన్ని వృథా చేసుకుని అందులో ఇరుక్కుపోతుంటారు. చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నావు బేటా.

రీతికా హుడాఅవును సార్. తొలిసారి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. ఆ బౌట్ లో నేను గెలిచి ఉంటే ఫైనల్ కు చేరి స్వర్ణం గెలిచేదాన్ని. దురదృష్టవశాత్తు నాకు మంచి రోజు కాదు.

ప్రధాన మంత్రి: ఫర్వాలేదు, మీరు ఇంకా చిన్నవయస్సులో ఉన్నారు, ఇంకా సాధించడానికి చాలా సమయం ఉంది.


రితికా హుడాఅవును సార్.



ప్రధాన మంత్రి: హరియాణా నేల మీలో శక్తిని నింపే విధంగా ఉంది.

రితికా హుడా: అవును సార్.



డాక్టర్ దిన్షా పర్దివాలా: నమస్కారం, ప్రధాన మంత్రి. ఈసారి మా జట్టులో గాయాలు చాలా తక్కువగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఒకటి లేదా రెండు తీవ్రమైన గాయాలు మాత్రమే ఉన్నాయి, అయితే సాధారణంగా, శస్త్రచికిత్స అవసరమయ్యే అన్ని క్రీడలలో మూడు లేదా నాలుగు ప్రధాన గాయాలు కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ, ఈసారి ఒక ముఖ్యమైన గాయం మాత్రమే ఉంది, ఇది సానుకూల ఫలితం. ఒక ముఖ్యమైన మెరుగుదల ఏమిటంటే, ఒలింపిక్ గ్రామంలో పరిమిత సౌకర్యాలు ఉన్న మునుపటి మాదిరిగా కాకుండా, ఈసారి మా స్వంత భవనంలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది చాలా మంది క్రీడాకారుల(అథ్లెట్ల)కు కోలుకోవడం, గాయం నిర్వహణ, సన్నద్ధతను మరింత సులభతరం చేసింది. ఈ ఏర్పాటు (సెటప్) ప్రయోజనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను, అథ్లెట్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాను, వారికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని తెలుసు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తే అథ్లెట్లకు మరింత మెరుగ్గా తోడ్పడగలం.

ప్రధాన మంత్రిచూడండి, డాక్టర్ నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు: ఈ సారి మా బృందానికి గత  సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ గాయాలయ్యాయి. గాయాల తగ్గుదల ఆట ప్రతి అంశంలో మీకు నైపుణ్యం ఉందని సూచిస్తుంది. క్రీడల పట్ల మన అవగాహనలో అంతరాల వల్ల గాయాలు తరచుగా సంభవిస్తాయి, ఇది కొన్నిసార్లు నష్టానికి దారితీస్తుంది. మీ శరీరం చిన్న చిన్న దెబ్బలను, ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం కలిగివుందని, తద్వారా పెద్ద గాయాలను నివారించవచ్చని మీ శిక్షణ, మీ సన్నాహాలు నిరూపిస్తున్నాయి.. దీన్ని సాధించడానికి మీరు శ్రద్ధగా శిక్షణ పొంది, చాలా కష్టపడి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇంతటి ఘన విజయం సాధించిన మీ అందరికీ అభినందనలు.

ప్రధాన మంత్రి: మిత్రులారా,



మన్సుఖ్ మాండవియా గారు, క్రీడా శాఖ సహాయ మంత్రి ర క్షా ఖడ్సే గారు కూడా నాతో ఉన్నారు. క్రీడా ప్రపంచంలో మన దేశానికి ఎంతో గర్వకారణమైన వ్యక్తి పీటీ ఉషా గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరంతా పారిస్ నుంచి తిరిగి వచ్చారు. మీకు, మీ సహచరులకు నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. నేను మీకు పారిస్ కు వీడ్కోలు పలికిన ఉత్సాహంతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ స్వాగతం పతకాల సంఖ్య ఆధారంగా కాదు, మన భారత క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రశంసల ఆధారంగా. వారి ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, నడవడిక గురించి ప్రపంచం నలుమూలల నుంచి వింటున్నాను. ఇది నాలో ఎంతో గర్వాన్ని నింపింది. మన ఆటగాళ్లు ఎంత అంకితభావంతో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఏ ఒక్క ఆటగాడు కూడా మన దేశం పేరు మీద చిన్న మచ్చను కూడా కోరుకోడు. ఇది మా అతి పెద్ద ఆస్తి, బృందం మొత్తం హృదయపూర్వక అభినందనలకు అర్హులు.


మిత్రులారా,

 ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణ పతాక వైభవాన్ని ప్రకాశింపజేసిన తరువాత మీరు దేశానికి తిరిగి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. నా నివాసానికి మిమ్మల్ని స్వాగతించే గౌరవం నాకు లభించింది. ప్యారిస్  వెళ్ళేవారికి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని తెలుసు, మీరు ఖచ్చితంగా అలానే చేశారు. అంతేకాకుండా, మన ఆటగాళ్ళు యువకులు, వారు విలువైన అనుభవాన్ని పొందారు, అంటే భవిష్యత్తులో సాధించాల్సింది చాలా ఉంది. ఈ అనుభవం వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

బహుశా ఈ పారిస్ ఒలింపిక్స్ భారత్ కు అనేక విధాలుగా చారిత్రాత్మకం. ఈ క్రీడలలో నెలకొల్పిన రికార్డులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తాయి. దాదాపు 125 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్ మను. నీరజ్ చోప్రా వ్యక్తిగత ఈవెంట్లలో స్వర్ణం, రజతం సాధించిన తొలి భారతీయుడు. హాకీలో భారత్ 52 ఏళ్ల తర్వాత తొలిసారి వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం జరిగింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే పతకం సాధించి దేశానికి ఎంతో ఆనందాన్ని అందించిన అమన్, తన కలలను సాకారం చేసుకోవడానికి వ్యక్తిగత సవాళ్లను ఎలా అధిగమించవచ్చో మనకు చూయించిన అతని కథ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ గ నిలుస్తోంది. కష్టాలు అధిగమించగలిగేవని అమన్ ప్రయాణం రుజువు చేసింది. రెజ్లింగ్ లో ఫైనల్స్ కు చేరిన తొలి భారతీయురాలిగా వినేశ్ రికార్డు సృష్టించింది. భారత షూటర్లు ఏడు షూటింగ్ ఈవెంట్లలో ఫైనల్స్ కు చేరుకున్నారు. అదేవిధంగా ఆర్చరీలో ధీరజ్, అంకిత పతకాల కోసం పోటీ పడిన తొలి భారత ఆర్చర్లుగా నిలిచారు. లక్ష్యసేన్ ప్రదర్శన దేశాన్ని ఎంతగానో ఉత్తేజపరిచింది, సెమీస్ కు చేరిన ఏకైక భారతీయ పురుష బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్ లో తొలిసారిగా స్టీపుల్ ఛేజ్ లో ఫైనల్స్ కు అర్హత సాధించి అవినాష్ సాబ్లే చరిత్ర సృష్టించాడు.

మిత్రులారా,

మన పతక విజేతలలో ఎక్కువ మంది 20 ఏళ్ల వయస్సులో ఉన్న వారే, వారు చాలా చిన్నవారు. మీకు ఇంకా సమయం, శక్తి ఉన్నాయి. సాధారణంగా ఒలింపిక్స్ మధ్య నాలుగు సంవత్సరాల అంతరం ఉంటుంది, కానీ ఈసారి అది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. బహుశా మరో ఏడాది అదనంగా సాధన చేస్తే మరింత గొప్ప విజయాలు సాధ్యమయ్యేవి. మీరు మీ కెరీర్ అంతటా అనేక ప్రధాన టోర్నమెంట్లలో పాల్గొంటారు; ఆడటం ఆపవద్దు లేదా ఒక్క మ్యాచ్ కూడా చేజారి పోవద్దు (మిస్ అవ్వవద్దు). ఈ యువ జట్టు భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనం. పారిస్ ఒలింపిక్స్ భారతీయ క్రీడల భవిష్యత్తుకు ఒక ప్రయోగశాలగా ఉపయోగపడుతుందని, ఇది ఒక టర్నింగ్ పాయింట్ (కీలక మలుపు) గా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఇకపై మనం ఆగిపోవడానికి అవకాశమే లేదు, విజయం మాత్రమే మన ఏకైక మార్గం..



మిత్రులారా.

నేడు, ప్రపంచ స్థాయి క్రీడా పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి భారత్ ప్రాధాన్యత ఇస్తోంది. కిందిస్థాయి నుంచి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కీలకం. ప్రతి పల్లె, నగరం నుంచి యువ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా ప్రచారాన్ని ప్రారంభించాం. అమన్, అనంత్ జీత్, ధీరజ్, సరబ్జోత్ తో సహా ఖేలో ఇండియాకు చెందిన 28 మంది క్రీడాకారులు ఈ ఒలింపిక్ బృందంలో ఉండటం నాకు సంతోషంగా ఉంది. ఖేలో ఇండియా అథ్లెట్లుగా వారి ప్రయాణం ప్రారంభమైంది, ఇది దేశ క్రీడా రంగంలో ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను గూర్చి ప్రధానంగా తెలియజేస్తుంది.

 

ఖేలో ఇండియాకు మరింత ప్రాధాన్యత, మద్దతు అవసరమని నేను నమ్ముతున్నాను. ఈ చొరవ ద్వారా, కొత్త, ఆశాజనక ప్రతిభను మనం కనుగొంటాము. మీలాగే మన దేశం కోసం ఖేలో ఇండియా అథ్లెట్ల గణనీయమైన బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. మన క్రీడాకారులకు తగిన సౌకర్యాలు, వనరులు అందుబాటులో ఉండేలా, తద్వారా వారి శిక్షణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా బడ్జెట్ ను నిరంతరం పెంచుతున్నారు. అథ్లెట్లు అనేక పోటీల్లో పాల్గొనడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఒలింపిక్స్ కు   ముందు మీరు అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలతో పాటు ఆహారం, పరికరాలు,  కోచింగ్ ను అందించే అనేక మంది కోచ్ లు, నిపుణులు అందించిన వివరాలపై శ్రద్ధ అపూర్వమైనది. మన దేశంలో ఇంతకు ముందు ఇలాంటి మద్దతు ఉండేది కాదు. గతంలో ఆటగాళ్లు దేశం కోసం విజయాలు సాధించడానికి తమ సొంత ప్రయత్నాలు, అదృష్టంపై ఆధారపడేవారు. అయితే, ఇప్పుడు సమగ్ర పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది దేశ క్రీడా విధానాల్లో వచ్చిన మార్పును మాత్రమే కాకుండా, దేశం ఇప్పుడు తన యువతరంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం.

మిత్రులారా.

మీరంతా మన దేశ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. దేశం,యువత మీలో ప్రతి ఒక్కరి గురించి మరింత తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా మా కూతుళ్లను పేరుపేరునా ప్రశంసించాలనుకుంటున్నాను. గతసారి మాదిరిగానే ఒలింపిక్స్ లో మన కూతుళ్లు మరోసారి దేశ విజయాలకు నాయకత్వం వహించారు. ఇంతకుముందు మనుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఆమె అద్భుతమైన పునరాగమనం, ఈ సీజన్లో అంకిత ఉత్తమ ప్రదర్శన, మనికా బాత్రా, శ్రీజా ఆకుల ఆకట్టుకునే ప్రదర్శనలు అన్నీ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అదేవిధంగా నీరజ్ నిలకడ, సవాళ్లపై స్వప్నిల్ విజయం, మా సర్పంచ్ సాహెబ్ హాకీ జట్టు ఇవన్నీ దేశ బలాన్ని ప్రదర్శించాయి. పి.ఆర్.శ్రీజేష్ బంతి ప్రాముఖ్యతను చూపించారు. పతకం గెలిచినా, స్వల్ప తేడాతో ఓడినా ప్రతి అథ్లెట్ ఒకే సంకల్పాన్ని కలిగి ఉంటారు: స్వర్ణం సాధించాలి. దీని నుంచి మన దేశ యువత ఎంతో నేర్చుకుంటుందని నేను నమ్ముతున్నాను.



మిత్రులారా

2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సన్నద్ధమవుతోంది. మనం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని ఎర్రకోటపై నుంచి చెప్పాను. గత ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్ల అభిప్రాయాలు వెలకట్టలేనివి. ఒలింపిక్ ప్రణాళిక నుంచి ఏర్పాట్ల వరకు, క్రీడా నిర్వహణ నుంచి సంస్థాగత ఏర్పాట్ల వరకు మీరు చాలా గమనించారు, చాలా చూశారు. మీ అనుభవాలను, పరిశీలనలను డాక్యుమెంట్ చేయడం, ప్రభుత్వంతో పంచుకోవడం చాలా అవసరం. అథ్లెట్లు గుర్తించిన సవాళ్లు, అంతరాలను పరిష్కరిస్తూ 2036కు సన్నద్ధం కావడానికి ఇది మాకు సహాయపడుతుంది. సారాంశం ఏమిటంటే, మీరు నా 2036 జట్టులో ముందు వరుసలో ఉన్నారు. మీ సహాయం 2036 లో కొత్త ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే ఒలింపిక్ క్రీడలను నిర్వహించడానికి, అతిథ్యమివ్వడానికి మాకు సహాయపడుతుంది. క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రణాళికను రూపొందించాలని, పూర్తి సన్నద్ధతను నిర్ధారించడానికి క్రీడాకారులందరి నుంచి వివరణాత్మక అభిప్రాయాన్ని, సూచనలను సేకరించాలని నేను కోరుతున్నాను.


మిత్రులారా

క్రీడాకారులు, కోచ్ లు భారతీయ క్రీడలను ఎలా మెరుగుపరచాలో విలువైన ఆలోచనలను అందిస్తారు, దీనిని నిర్వాహకులైన మేము అందించలేము. మీ ఇన్ పుట్ (అవసరం), ఆలోచనలు కీలకం. భావి క్రీడాకారులను ప్రోత్సహించి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతతో మమేకమై వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ, ఇతర సంస్థలు అనుభవాలను పంచుకోవడానికి వివిధ సమూహాలతో ఇంటరాక్షన్ సెషన్లను సులభతరం చేయవచ్చు. వ్యక్తులు నాతో నేరుగా మాట్లాడకపోయినా, అటువంటి ప్రదేశాలలో వారు తమ అనుభవాలను పంచుకోవచ్చు.

మిత్రులారా,

మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించిన తరువాత, మీకు ఒక బాధ్యత అప్పగించకుండా మిమ్మల్ని వదిలివేయడం అసంపూర్ణంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.. గతంలో నేను మిమ్మల్ని ఏదైనా చేయమని అడిగినప్పుడల్లా, మీరు దానిని నెరవేర్చడానికి ప్రయత్నించారు. ఉదాహరణకు, టోక్యో ఒలింపిక్స్ నుండి తిరిగి వచ్చిన స్నేహితులను పాఠశాలలను సందర్శించి యువతతో మమేకం కావాలని నేను అభ్యర్థించాను, వారు ప్రయోజనకరమైన ఫలితాలతో అలా చేశారు. నేడు మన దేశం పర్యావరణ పరిరక్షణ కోసం 'ఏక్ పేడ్ మా కే నామ్' అనే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మీ తల్లితో కలిసి ఒక చెట్టును నాటండి, మీరు అలా చేస్తున్నప్పుడు పారిస్ ను గుర్తుంచుకోండి. మీ తల్లి అక్కడ లేకుంటే, ఆమె చిత్రానికి పక్కన ఒక చెట్టు నాటండి. మీలో చాలా మంది గ్రామీణ, నిరుపేద నేపథ్యాల నుండి వచ్చారు. ఈ సంవత్సరం పారిస్ ఒలింపిక్స్ సమయంలో ప్రోత్సహించిన పర్యావరణ అనుకూల పద్ధతులను మీరు చూశారు. మీ గ్రామాలకు తిరిగి వచ్చిన తరువాత, సహజ, రసాయన రహిత వ్యవసాయం గురించి సమాచారాన్ని పంచుకోండి. మన భూమాతను రక్షించే ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించండి. . అదనంగా, ఇతర యువకులు క్రీడలను ఆస్వాదించేలా దృఢంగా ఉండేలా ప్రేరేపించండి. మీరు మాత్రమే వారిని ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు నడిపించగలరు, ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.



మిత్రులారా,

మీరు దేశానికి గౌరవం తెస్తూనే ఉంటారనే నమ్మకం ఉంది.. మీలాంటి యువ ప్రతిభావంతుల విజయం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా మన ప్రయాణాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఈ ఆకాంక్ష తో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నా దృష్టిలో మీరంతా సాధకులే, మీలో చెప్పుకోదగినది సాధించని వారు ఎవరూ లేరు. మన యువత గొప్ప విజయాలు సాధిస్తున్న కొద్దీ, మన దేశం కూడా కొత్త శిఖరాలను అధిరోహించడానికి ప్రేరణ పొందుతుంది..



మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు మిత్రులారా.

 

***


(Release ID: 2048837) Visitor Counter : 50