మంత్రిమండలి
azadi ka amrit mahotsav

జీవ సాంకేతిక ఆధారిత తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు బయో ఇ3 విధానానికి మంత్రివర్గ ఆమోదం

Posted On: 24 AUG 2024 7:22PM by PIB Hyderabad

అధిక నైపుణ్యంతో కూడిన జీవ సాంకేతిక ఆధారిత తయరీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా, బయో టెక్నాలజీ విభాగం ప్రతిపాదించిన ‘బయో ఇ3’ (ఆర్థికవ్యవస్థ, పర్యావరణం, ఉద్యోగ కల్పన) విధానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు తన ఆమోదాన్ని తెలిపింది.

‘బయోఇ3’ విధానం ప్రధానాంశాల్లో- నూతన ఆవిష్కరణల అండతో పరిశోధనకీ, అభివృద్ధికీ (ఆర్ ఎండ్ డి) సమర్ధనను ఇవ్వడం, ప్రాతిపదిక పూర్వక రంగాలలో నవ పారిశ్రామికత్వం వంటివి భాగంగా ఉంటాయి. జీవ సాంకేతిక ఆధారిత తయరీ (బయో మ్యాన్యుఫాక్చరింగ్), బయో-ఎఐ హబ్స్ తో పాటు బయోఫౌండ్రీలను ఏర్పాటు చేయడం ద్వారా సాంకేతిక విజ్ఞానాభివృద్ధినీ, వాణిజ్యాన్నీ వేగవంతం చేయనుంది. ‘హరితవృద్ధి’ కి దోహదపడే పునరుద్ధారక అవకాశాలున్న బయో ఎకానమీ మోడల్స్ కు ప్రాధాన్యాన్ని ఇవ్వడంతో పాటే భారతదేశంలో నైపుణ్యయుక్త కార్మికుల సంఖ్య విస్తరించడానికి, ఉద్యోగ కల్పనను పెంచడానికి మార్గాన్ని ఈ విధానం సుగమం చేస్తుంది.

ఈ విధానం కర్బన ఉద్గారాలలో ‘శుద్ధ శూన్య’ స్థాయి ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించడం, ‘లైఫ్ స్టయిల్ ఫర్ ఎన్విరాన్ మెంట్’ (LiFE) ల వంటి ప్రభుత్వ కార్యక్రమాలను మరింత బలపరుస్తుంది. అంతేకాక, ‘సర్క్యలర్ బయో ఎకానమీ’ని ప్రోత్సహించడం ద్వారా ‘హరిత వృద్ధి’ మార్గంలో భారతదేశం మున్ముందుకు సాగిపోయేందుకు తోడ్పడుతుంది. ‘బయో ఇ3’ విధానం ప్రపంచ సవాళ్లకు ప్రతిస్పందన పూర్వకమైనటువంటి, కొత్త మార్పులను ఆహ్వానించేటటువంటి, మరింత రక్షణతో కూడినటువంటి భవిష్యత్తును అందిస్తుంది. అలాగే, అభివృద్ధి చెందిన భారతదేశానికి (‘వికసిత్ భారత్’) తగిన బయో-విజన్ కూ బాటలు వేస్తుంది.

జీవాధారిత పారిశ్రామికీకరణలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించడం, ఆహార భద్రతకు పాటుపడడం, మానవ ఆరోగ్య సంరక్షణల వంటి సంకటమయ సామాజిక సమస్యలలో కొన్నింటిని పరిష్కరించడానికి ఇది దోహదం చేస్తుంది. బయో-బేస్డ్ ఉత్పాదనలను తయారు చేయడానికి ఇతరులతో పోలిస్తే మనలను ముందు వరుసలో నిలిపే అత్యంత అధునాతనమైన నవకల్పనలను త్వరితంగా ఆవిష్కరించడంతో పాటు ప్రతికూలస్థితుల నుంచి పాఠాలను నేర్చుకొనే, సకారాత్మక దృక్పథాన్ని కలిగిఉండే బయో మాన్యుఫాక్చరింగ్ వాతావరణాన్ని మన దేశంలో సృష్టించడం చాలా ప్రధానం.

 

 

అధిక ప్రభావవంతమైన బయో మ్యాన్యుఫాక్చరింగ్ అంటే అది మందులు మొదలుకొని వస్తువుల వరకు ఉత్పత్తులను తయారు చేయడం, వ్యవసాయ రంగంలోను, ఆహార రంగంలోను సవాళ్లను పరిష్కరించడం, పురోగామి బయోటెక్నలాజికల్ ప్రక్రియలను ఏకీకరించడం ద్వారా బయో బేస్డ్ ఉత్పాదనల తయారీని ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా, బయో ఇ3 విధానం స్థూలంగా వూహాత్మక/ప్రాతిపదికా పూర్వక రంగాలపై శ్రద్ధ వహిస్తుంది. ఆయా రంగాలలో అధిక విలువను కలిగి ఉండే బయో -బేస్డ్ కెమికల్స్, బయో పాలిమర్స్, ఎంజైమ్స్, స్మార్ట్ ప్రొటీన్స్, ఫంక్షనల్ ఫూడ్స్, ప్రిసిషన్ బయో థెరప్యూటిక్స్, అన్ని రకాల వాతావరణ మార్పులకు తట్టుకొని నిలిచే వ్యవసాయం, కర్బన స్థాయిని తగ్గించడంతో పాటు దాని ఉపయోగం; సముద్ర సంబంధి పరిశోధన, అంతరిక్ష పరిశోధన రంగాలు ఉన్నాయి.

***



(Release ID: 2048834) Visitor Counter : 126