మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ఏకీకృత పెన్ష‌న్ ప‌థ‌కం (యుపిఎస్‌) అమ‌లుకు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం

Posted On: 24 AUG 2024 8:33PM by PIB Hyderabad

   ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండ‌లి ఏకీకృత పెన్ష‌న్ ప‌థ‌కం (యుపిఎస్) అమ‌లుకు ఆమోదం తెలిపింది.

ఈ ప‌థ‌కం ముఖ్యాంశాలిలా ఉన్నాయి:

1. స్థిర పెన్ష‌న్‌: క‌నీసం 25 సంవ‌త్స‌రాల అనుభ‌వంతో ఉద్యోగ విర‌మ‌ణ‌కు ముందు 12 నెల‌ల పాటు పొందిన స‌గ‌టు మూల‌వేత‌నంలో 50 శాతం. క‌నీసం 10 సంవ‌త్స‌రాలు అంత‌క‌న్నా త‌క్కువ అనుభ‌వం గ‌లవారి విష‌యంలో దామాషా ప్రాతిప‌దిక‌న స్థిర‌ పెన్ష‌న్ మొత్తంపై నిర్ణ‌యం.

2. స్థిర కుటుంబ పెన్ష‌న్‌: విశ్రాంత ఉద్యోగి మరణిస్తే వారు అప్ప‌టిదాకా పొందుతున్న పెన్ష‌న్ మొత్తంలో 60 శాతం.

3. క‌నీస స్థిర పెన్ష‌న్: కనీసం 10 సంవత్సరాల అనుభ‌వంతో ఉద్యోగ విర‌మ‌ణ చేసేవారికి నెల‌కు రూ.10,000.

4. ద్రవ్యోల్బణ సూచిక: స్థిర, స్థిర కుటుంబ‌, క‌నీస స్థిర పెన్ష‌న్ల‌న్నింటికీ వ‌ర్తింపు.
అఖిల భారత పారిశ్రామిక కార్మిక వినియోగ‌దారు ధ‌ర‌ల సూచీ (ఎఐసిపిఐ-ఐడ‌బ్లు) ఆధారంగా స‌ర్వీసులోగ‌ల ఉద్యోగులతో స‌మానంగా క‌ర‌వుభ‌త్యపు (డిఎ) ఉప‌శ‌మ‌నం.

5. ఉద్యోగ విర‌మ‌ణ స‌మ‌యంలో గ్రాట్యుటీ సొమ్ముతోపాటు ఏక‌మొత్తంలో చెల్లింపు:

ఉద్యోగ విర‌మ‌ణ తేదీ నాటికి పూర్తయిన ప్రతి ఆరు నెలల సర్వీసు ఆధారంగా నెలవారీ వేతనంలో 1/10వ భాగం వంతున‌ (జీతం+ డిఎ) చెల్లింపు

ఈ చెల్లింపు వ‌ల్ల స్థిర పెన్షన్ పరిమాణం తగ్గదు


(Release ID: 2048827) Visitor Counter : 260