హోం మంత్రిత్వ శాఖ

త్రిపుర లో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహాతో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సమీక్ష


ఈ సంక్షోభ సమయంలో త్రిపురలోని మన సోదర సోదరీమణులకు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది : అమిత్ షా


సహాయ, పునరావాస చర్యల్లో స్థానిక ప్రభుత్వానికి సహాయం చేయడానికి పడవలు, హెలికాప్టర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపిస్తోన్న కేంద్రం


అవసరమైనప్పుడు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హోంమంత్రి హామీ

Posted On: 22 AUG 2024 12:35PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహాతో మాట్లాడి రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించారు.

ఈ మేరకు "ఎక్స్" లో మంత్రి ఈ విధంగా పోస్ట్ చేశారు, “త్రిపుర సీఎండాక్టర్ మాణిక్ సాహాతో మాట్లాడి రాష్ట్రంలో వరద పరిస్థితి గురించి తెలుసుకున్నాను. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం పడవలు, హెలికాప్టర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపుతోంది. అవసరమైనప్పుడు కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను. ఈ సంక్షోభ సమయంలో త్రిపురలోని మన సోదరీమణులు, సోదరులకు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని అన్నారు. 



(Release ID: 2048151) Visitor Counter : 9