హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర సహకార శాఖ, దేశీయ వ్యవహారాల మంత్రి శ్రీ అమిత్ షా కు రూ. 19.08 కోట్ల డివిడెండ్ చెక్కును అందించిన రెప్కో బ్యాంకు


బ్యాంకులో భారత ప్రభుత్వానికి ఉన్న రూ. 76.32 కోట్ల వాటా మూలధనానికి 25 శాతం చొప్పున డివిడెండ్ చెక్కు

రెప్కో బ్యాంకు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాలనపరమైన నియంత్రణలో నడుస్తున్న భారత ప్రభుత్వ వాణిజ్య వ్యవస్థ; ఈ బ్యాంకు 20,000 కోట్ల రూపాయల విలువైన వ్యాపార స్థాయిని అధిగమించింది

పిఐబి ఢిల్లీ ద్వారా 2024 ఆగస్టు 23 న ఉదయం 10 గంటల 19 నిమిషాలకు పోస్ట్ చేయడమైంది

Posted On: 23 AUG 2024 10:19AM by PIB Hyderabad

దేశీయ వ్యవహారాలు, సహకార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా కు రెప్కో బ్యాంకు డివిడెండ్ రూపంలో 19.08 కోట్ల రూపాయల విలువైన ఒక చెక్కును న్యూ ఢిల్లీలో అందజేసింది.


బ్యాంకులో భారత ప్రభుత్వానికి 76.32 కోట్ల రూపాయల షేర్ కేపిటల్ ఉండగా, 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 25 శాతం వంతున డివిడెండ్ రూపేణా 19.08 కోట్ల రూపాయలకు ఒక చెక్కును  రెప్కో బ్యాంకు చైర్మన్ శ్రీ ఇ. సంతానం,  బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు శ్రీ ఒ.ఎమ్. గోకుల్ లు కేంద్ర మంత్రి కి అందజేశారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఎ) కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, ఎమ్‌హెచ్ఎ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్‌డి) శ్రీ గోవింద్ మోహన్ లు కూడా పాల్గొన్నారు.

 
దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ఎ) పాలన పరమైన నియంత్రణలో నడుస్తున్నభారత ప్రభుత్వ వాణిజ్య వ్యవస్థే రెప్కో బ్యాంకు.  2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకు వ్యాపార పరిమాణం 11 శాతం వృద్ధి చెందింది .  బ్యాంకు 20,000 కోట్ల రూపాయల విలువైన వ్యాపార కార్యకలాపాలను ఈ రోజున అధిగమించి ఒక ప్రశంసాయోగ్యమైన కార్యసాధన మైలురాయిని చేరుకొంది.


(Release ID: 2047983) Visitor Counter : 83