ప్రధాన మంత్రి కార్యాలయం

పోలాండ్‌లోని ప్రముఖ ఇండాలజిస్టులతో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 22 AUG 2024 9:18PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పోలాండ్‌లోని ప్రముఖ ఇండాలజిస్టుల (భారత చరిత్ర  అధ్యయనకారులు)తో సమావేశమయ్యారు. ఈ బృందంలోని ప్రముఖులలో...:

   ప్రముఖ సంస్కృత పండితురాలు, వార్సా విశ్వవిద్యాలయ గౌరవాచార్యులు ప్రొఫెసర్ మారియా క్రిస్టోఫర్ బైర్స్కీ ఒకరు. బైర్స్కీ 1993 నుంచి 1996 వరకు భార‌త్‌లో పోలాండ్ రాయబారిగా పనిచేశారు. అంతేకాకుండా 2022 మార్చిలో భారత రాష్ట్రపతి చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ అందుకున్నారు.

   ప్రముఖ హిందీ పండితురాలు, పోజ్నాన్‌లోని ఆడమ్ మిస్క్యవిజ్ విశ్వవిద్యాలయంలో  (ఎఎంయు) ఆసియా అధ్యయన విభాగాధిపతి మోనికా బ్రోవార్జిక్ మరొకరు. ఈమెకు 2023 ఫిబ్రవరిలో ఫిజీలో నిర్వహించిన 12వ విశ్వ హిందీ సమ్మేళనంలో ‘విశ్వ హిందీ సమ్మాన్’ పురస్కార ప్రదానం చేశారు.

  భారతీయ తత్వశాస్త్ర పండితురాలు, క్రాకోలోని యాగ్యలోనియన్ విశ్వవిద్యాలయం (జెయు)లో ఓరియంటల్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి ప్రొఫెస‌ర్ హలీనా మార్లెవిజ్;

   ప్రముఖ ఇండాలజిస్ట్, వార్సా విశ్వవిద్యాలయంలో దక్షిణాసియా అధ్యయన విభాగం పూర్వ అధిపతి ప్రొఫెసర్ దనుటా స్టాషిక్;

   మరో ప్రసిద్ధ ఇండాలజిస్ట్, వొరాస్క్వా విశ్వవిద్యాలయంలో భారత చరిత్ర అధ్యయన విభాగం అధిపతి ప్రొఫెసర్ జెమిస్లావ్ జూరెక్;

   ఈ ప్రముఖులందరితోనూ సమావేశం సందర్భంగా భారతీయ చరిత్ర, సంస్కృతి,  భాషలు, సాహిత్యం (ఇండాలజీ)పై వారికిగల అనురక్తి, అధ్యయనాసక్తిని ప్రధానమంత్రి ప్రశంసించారు. భారత్-పోలాండ్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు పరస్పర అవగాహనను ప్రోది చేయడంలో వారి విద్యాసంబంధ పరిశోధనలు, రచనలు గణనీయ పాత్ర పోషించాయని కొనియాడారు. కాగా, 19వ శతాబ్దం నుంచీ ‘ఇండాలజీ’పై పోలాండ్‌లో ఆసక్తి, పరిశోధనలు కొనసాగుతుండటం విశేషం.

 

****

MJPS/AK



(Release ID: 2047956) Visitor Counter : 12