ప్రధాన మంత్రి కార్యాలయం
వార్సాలోని అనామక సైనిక సమాధివద్ద ప్రధాని ఘన నివాళి
Posted On:
22 AUG 2024 8:12PM by PIB Hyderabad
వార్సాలోని అనామక సైనిక ( అన్ నౌన్ సోల్జర్) సమాధివద్ద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు.
దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన పోలాండ్ సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన గౌరవ స్మారక చిహ్నమే అనామక సైనిక సమాధి. దీన్ని ప్యూసోవస్కీ స్క్వేర్ వద్ద నిర్మించారు. ఇది పోలాండ్ లో గౌరవప్రదమైన, పేరొందిన జాతీయ స్మారక చిహ్నం.
ప్రధాని ప్రకటించిన ఘన నివాళి భారతదేశం, పోలాండ్ దేశాల మధ్యనగల ఉన్నతమైన గౌరవ మర్యాదలకు, సంఘీభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.
********
MJPS/ST
(Release ID: 2047947)
Visitor Counter : 44
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam