ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో కర్మాగార దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి సంతాపం
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్ -గ్రేషియా ప్రకటన
Posted On:
22 AUG 2024 6:56AM by PIB Hyderabad
ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో చనిపోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్నిప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈ దుర్ఘటనలో మృతుల దగ్గరి సంబంధికులకు 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్- గ్రేషియాను కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో -
‘‘అనకాపల్లి లో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణ నష్టం సంభవించడం నాకు వేదన కలిగించింది. ప్రియతములను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను. మృతుల దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఎక్స్ గ్రేషియాను ఇవ్వడం జరుగుతుంది. : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)’’.
***
MJPS/ST
(Release ID: 2047513)
Visitor Counter : 90
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam