రక్షణ మంత్రిత్వ శాఖ
బీఈఎంఎల్ లిమిటెడ్ తో భారత నావికా దళం అవగాహన ఒప్పందం
బీఈఎంఎల్ లిమిటెడ్ తో భారత నావికా దళం అవగాహన ఒప్పందం
प्रविष्टि तिथि:
21 AUG 2024 11:57AM by PIB Hyderabad
భారత నావికాదళానికి చెందిన కీలకమైన సముద్ర ఇంజినీరింగ్ పరికరాల స్వదేశీకరణ దిశగా కీలక ముందడుగు పడింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘షెడ్యూల్ ఎ’ కంపెనీ, దేశంలోని ప్రముఖ రక్షణ-భారీ ఇంజినీరింగ్ పరికరాల తయారీదారుల్లో ఒకటైన బీఈఎంఎల్ మంగళవారం భారత నావికా దళంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
భారత నావికాదళానికి చెందిన ఏసీవోఎం (అభివృద్ధి, పరిశోధన విభాగం) రియర్ అడ్మిరల్ కె శ్రీనివాస్, బీఈఎంఎల్ డిఫెన్స్ డైరెక్టర్ శ్రీ అజిత్ కుమార్ శ్రీవాస్తవ్ ల నేతృత్వంలో న్యూఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కీలకమైన సముద్ర ఇంజినీరింగ్ పరికరాలు, వ్యవస్థల స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ, పరీక్ష, ఉత్పత్తి సహకారం కోసం ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంలో ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు.
భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా రక్షణ ఉత్పత్తిలో స్వావలంబనను బలోపేతం చేయడం, విదేశీ దిగుమతులను తగ్గించడం ఈ ఒప్పందం లక్ష్యంగా ఉంది.
***
(रिलीज़ आईडी: 2047309)
आगंतुक पटल : 154