ప్రధాన మంత్రి కార్యాలయం
రైతుల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
11 AUG 2024 4:50PM by PIB Hyderabad
దేశంలోని రైతుల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో 109 కొత్త పంటల వంగడాలను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇవి అధిక దిగుబడినివ్వడమే కాకుండా వాతావరణ హితమైనవని, ఈ పంటలతో అన్నదాత ఆదాయం కూడా పెరుగుతుందని ప్రధాని అన్నారు.
రైతులు నేడు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడం శుభ పరిణామం అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను అడిగి తెలుసుకుంటూ, ఈ పద్ధతిలో పంటల సాగువల్ల ఒనగూడే ప్రయోజనాలపై లోతుగా చర్చించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘మన రైతు సోదరసోదరీమణులకు సాధికారత కల్పన దిశగా మా నిబద్ధత కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలో 109 కొత్త రకాల వంగడాలను ఆవిష్కరించాం. ఇవి అధిక దిగుబడినిచ్చేవి మాత్రమేగాక వాతావరణ హితమైనవి కూడా. ఈ పంటల సాగుతో దిగుబడి ఇనుమడించడం వల్ల మన రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది.’’ అలాగే-
‘‘అన్నదాతలంతా నేడు ప్రకృతి వ్యవసాయం వైపు వేగంగా అడుగులు వేయడం నాకెంతో సంతృప్తినిస్తోంది. ఈ పద్ధతిలో పంటల సాగుపై వారి అనుభవాలను స్వయంగా తెలుసుకునే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ చర్చ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం వల్ల ఒనగూడే ప్రయోజనాలపైనా లోతుగా చర్చించుకున్నాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2046849)
Visitor Counter : 47
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam