ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు నుంచి ప్రధానమంత్రికి ఫోన్ కాల్
                    
                    
                        
ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతిపూర్ణ, ప్రగతిశీల బంగ్లాదేశ్ కోసం భారత్ మద్దతిస్తుందంటూ ప్రధాన మంత్రి పునరుద్ఘాటన
హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ కోసం తాత్కాలిక ప్రభుత్వం నుంచి హామీ కోరిన ప్రధానమంత్రి
బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు, మైనారిటీల భద్రతకు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ హామీ
 
                    
                
                
                    Posted On:
                16 AUG 2024 4:31PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ తో  ఈ రోజు టెలిఫోనులో మాట్లాడారు.
ఈ ఫోన్ కాల్ సందర్భంగా, ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య, స్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు.  వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బంగ్లాదేశ్ ప్రజలకు సహాయాన్ని కొనసాగించే విషయంలో భారతదేశం కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల భద్రత కల్పించడం  ముఖ్యమని ప్రధాన మంత్రి గుర్తుచేశారు.
ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రతిస్పందిస్తూ  తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ లోని హిందువులతో పాటు మైనారిటీ ప్రజల భద్రతకు ప్రాధాన్యాన్ని ఇస్తుందంటూ హామీని ఇచ్చారు.
రెండు దేశాల ప్రాధాన్యాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఉన్న అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.
***
                
                
                
                
                
                (Release ID: 2046248)
                Visitor Counter : 59
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam