సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘మేడ్ ఇన్ ఇండియా’ గేమింగ్ ఉత్పత్తులలో మన సుసంపన్న ప్రాచీన వారసత్వాన్ని.. సాహిత్యాన్ని తప్పక ఉపయోగించాలి: ప్రధాని
‘‘మన గేమింగ్ పరిశ్రమ ఉత్పత్తులు యావత్ ప్రపంచానికీ చేరడమేగాక
యానిమేషన్ ప్రపంచంలో భారత్ తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవాలి’’
Posted On:
15 AUG 2024 12:29PM by PIB Hyderabad
భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట పైనుంచి జాతినుద్దేశించి ఉపన్యసించారు. వివిధ రంగాల్లో దేశాన్ని ప్రపంచ సారథిగా తీర్చిదిద్దాలని ఆయ ప్రజలకు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ గేమింగ్ మార్కెట్లో అగ్రగామిగా భారత్
‘మేడ్ ఇన్ ఇండియా’ గేమింగ్ ఉత్పత్తులలో మన సుసంపన్న ప్రాచీన వారసత్వాన్ని, సాహిత్యాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు. గేమింగ్ రంగంలో వర్ధమాన భారీ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకుంటూ నవతరం ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు.
‘‘దేశీయంగా రూపొందించే ఆటలవైపు ప్రతి చిన్నారినీ మనం ఆకర్షించగలం. అంతేకాకుండా దేశంలోని ప్రతి చిన్నారి, యువత, ఐటీ నిపుణులు, ‘ఎఐ’ నిపుణులు గేమింగ్ ప్రపంచాన్ని శాసించాలి. ఆడటంలోనే కాదు... మన ఉత్పత్తులు యావత్ ప్రపంచానికీ చేరువయ్యేలా కృషి చేయాలి. అదే సమయంలో యానిమేషన్ రంగంలోనూ అంతర్జాతీయంగా మన ప్రాబల్యాన్ని రుజువు చేసుకోవాలి’’ అని తన ప్రసంగంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
***
(Release ID: 2045823)
Visitor Counter : 66