సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

లలిత కళా అకాడమీలో దేశ విభజన విషాద సంస్మరణ దినోత్సవ వేళ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫోటో ప్రదర్శన


వ్యక్తిగత గాధలు, అపార బాధలు, 1947 విభజన వల్ల కలిగిన శాశ్వత ప్రభావాన్ని తెలిపే విధంగా ప్రదర్శన నిర్వహణ

Posted On: 14 AUG 2024 4:14PM by PIB Hyderabad

దేశ విభజన విషాద సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సీబీసీ) ఏర్పాటు చేసిన ప్రదర్శన ఢిల్లీలోని లలిత్ కళా అకాడమీ (ఎల్‌కేఏ)లో ప్రారంభమైంది. ఆగస్టు 14 నుంచి 17 వరకు దిల్లీలోని కోపర్నికస్ మార్గ్‌లోని లలిత కళా అకాడమీ(కింది అంతస్తు గ్యాలరీ)లో ఈ ప్రదర్శన జరగుతోంది.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులతో పాటు ఇతర సందర్శకులు భారీగా హాజరయ్యారు.

వ్యక్తిగత కథలను, అపారమైన బాధను, లెక్కలేనన్ని జీవితాలపై 1947 విభజన చూపెట్టిన శాశ్వత ప్రభావాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంతో ఈ ప్రదర్శనను నిర్వహించారు. విభజన సందర్భంగా కష్టాలను అనుభవించిన వారిని గుర్తుచేసుకోవటం, ఈ చారిత్రాత్మక సంఘటన సంక్లిష్టతలకు సంబంధించి లోతైన అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా ఈ ప్రదర్శన జరుగుతోంది. విభజనపై లోతైన అవగాహన కల్పించేందుకు  చారిత్రాత్మక ఫోటోలు, వీడియోలు, ఇంటరాక్టీవ్ డిస్‌‌ప్లేలను ఇక్కడ వీక్షకుల కోసం ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శన గతాన్ని ప్రతిబింబించడమే కాకుండా సహానుభూతి, సామరస్యం, ఐక్యత ఆధారంగా భవిష్యత్తును ఎలా నిర్మించవచ్చనే దాని గురించి భావి భారత పౌరులకు, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు అర్థవంతమైన సంభాషణలలో పాల్గొనడానికి ఇక్కడ అవకాశం కల్పించారు. ఇది పాఠశాల పాఠ్యప్రణాళిక, విలువలకు అనుగుణంగా విలువైన విద్యా అనుభవాన్ని ఈ ప్రదర్శన అందిస్తోంది. ప్రారంభోత్సవం సందర్భంగా సీబీసీకి చెందిన కళాకారులు వివిధ దేశభక్తి గీతాలను ప్రదర్శించారు.

***



(Release ID: 2045756) Visitor Counter : 5