గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి

Posted On: 15 AUG 2024 2:05PM by PIB Hyderabad

భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు న్యూ ఢిల్లీ లో ఎర్ర కోట బురుజుల మీది నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. ప్రధాన మంత్రి తన ప్రసంగంలో, భారతదేశ స్వాతంత్ర్య సమర యోధులకు శ్రద్ధాంజలి ఘటించారు.

స్వాతంత్ర్య ఉద్యమ ప్రస్థానాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘స్వాతంత్ర్యోద్యమం నాటి కాలం సంఘర్షణలతో నిండివుంది.  యువజనులు, రైతులు, మహిళలు, ఆదివాసులు.. వాళ్లు వీళ్లు అనేమిటి.. ప్రతి ఒక్కరు బానిసత్వానికి వ్యతిరేకంగా అదే పనిగా పోరాడారు’’ అన్నారు.  దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టడం లో వారి వంతు తోడ్పాటును అందించడానికి భారతదేశం లో వివిధ జనసమూహాలు విభిన్న యత్నాలను, సమైక్య ప్రయాసలను చేశారని ఆయన నొక్కిచెప్పారు.

భగవాన్ బిర్సా ముండా పేరు ను శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించి  శ్రద్ధాంజలి సమర్పిస్తూ, ‘‘దేశం కోసం బిర్సా ముండా చేసిన నిస్వార్థ త్యాగానికి, అందించిన సేవలకు దేశ ప్రజలు సదా ఆయనకు రుణపడి ఉంటార’’న్నారు.  విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం జరిగిన యుద్ధంలో బిర్సా ముండా పోషించిన ప్రముఖ పాత్రను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  ఇరవై రెండేళ్ల ప్రాయంలోనే బిర్సా ముండా సల్పిన పోరాటం బ్రిటిషు ఏలుబడి పునాదులను కదిలించివేసింది.

*****



(Release ID: 2045651) Visitor Counter : 33