రాష్ట్రపతి సచివాలయం
‘అమృత్ ఉద్యాన్ వేసవి సందర్శనలు, 2024’ ప్రారంభ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి
అమృత్ ఉద్యాన్ ను ప్రజల కోసం ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకు తెరచి ఉంచుతారు
29న క్రీడాకారులకు; సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు మాత్రమే ప్రవేశం
Posted On:
14 AUG 2024 1:20PM by PIB Hyderabad
‘అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఎడిషన్, 2024’ ప్రారంభ కార్యక్రమం ఈ రోజున (ఆగస్టు 14, బుధవారం) జరిగింది. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమృత్ ఉద్యాన్ ను ప్రజల సందర్శనార్థం ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటలు మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు (సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ఆఖరి ప్రవేశం ఉంటుంది) తెరచి ఉంచనున్నారు. సోమవారాలలో ఉద్యాన నిర్వహణను చేపట్టే దినం కావడంతో, ఆ రోజులలో ప్రవేశాలు ఉండబోవు.
ఆగస్టు 29న జాతీయ క్రీడల దినం సందర్భంగా అమృత్ ఉద్యాన్ ప్రవేశాలను క్రీడాకారులకు మాత్రమే ప్రత్యేకించనున్నారు; అదే విధంగా సెప్టెంబరు 5న టీచర్స్ డే కావడంతో, ఆ రోజున కేవలం ఉపాధ్యాయులకే ఈ ఉద్యానంలో ప్రవేశం ఉంటుంది.
ఉద్యానంలో ప్రవేశించాలంటే, సందర్శకుల నమోదు తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ ఉచితం. సందర్శకులు వారికి తగిన సమయాన్ని ఆన్ లైన్ మాధ్యమం ద్వారా రాష్ట్రపతి భవన్ వెబ్ సైట్ (https://visit.rashtrapatibhavan.gov.in/) లోకి వెళ్ళి, బుక్ చేసుకోవాలి. నేరుగా విచ్చేసే సందర్శకులు, గేట్ నంబర్ 35 కు బయట ఏర్పాటు చేసిన స్వయం సేవా కియోస్క్ లలో వారి పేరులను వారే నమోదు చేసుకోవచ్చు.
ఈ ఉద్యానంలోకి వెళ్లడానికి నార్త్ అవెన్యూ రోడ్ కు దగ్గరలో రాష్ట్రపతి భవన్ గేట్ నంబర్ 35 నుంచి అనుమతిస్తారు. ఉద్యానాన్ని చూడాలనుకొనే వారి సౌకర్యార్థం సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి గేట్ నంబర్ 35 వరకు ఉచిత షటిల్ బస్సు సర్వీసును కూడా అందుబాటులో ఉంచుతారు.
***
(Release ID: 2045314)
Visitor Counter : 75