ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశంలో ఐక‌మ‌త్యం, సోద‌ర‌భావ బంధాల‌ను ఎల్ల‌ప్పుడూ కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పున‌రుద్ఘాటిస్తున్నా: ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 14 AUG 2024 9:51AM by PIB Hyderabad

దేశ విభ‌జ‌న స‌మ‌యంలోని  బాధితులకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు. భ‌యాన‌క విభ‌జ‌న సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా 'ఎక్స్‌'లో చేసిన పోస్టులో, విభ‌జ‌న కార‌ణంగా అనేక మంది ప్ర‌జ‌లపై పడిన ప్ర‌భావం, వారి ఇబ్బందుల‌ను ఆయ‌న‌ గుర్తు చేసుకున్నారు.

ఆటుపోట్ల‌కు త‌ట్టుకునే మాన‌వుల స్వ‌భావాన్ని ఆయ‌న కొనియాడుతూ, దేశంలో ఐక్య‌త‌, సోద‌ర‌భావ బంధాల‌ను ర‌క్షించ‌డంలో త‌న నిబ‌ద్ధ‌త‌ను పున‌రుద్ఘాటించారు.

ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి 'ఎక్స్‌'మాధ్య‌మంలో పోస్ట్ చేస్తూ:

''విభ‌జ‌నతో ఏర్ప‌డిన భ‌యాన‌క ఘ‌ట‌న‌ల వ‌ల్ల ప్ర‌భావిత‌మైన‌, తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ అసంఖ్యాక‌ మంది ప్ర‌జ‌ల‌ను #PartitionHorrorsRemembranceDay నాడు స్మ‌రించుకుంటున్నాం. ఆటుపోట్ల‌కు త‌ట్టుకొనే మాన‌వుల శ‌క్తిని ప్ర‌ద‌ర్శించిన వారి ధైర్యానికి ఇది నివాళులు అర్పించాల్సిన రోజు. విభ‌జ‌న వ‌ల్ల ప్ర‌భావిత‌మైన వారిలో చాలా మంది వారి జీవితాల‌ను పున‌ర్మించుకొని అపార‌మైన విజ‌యాన్ని సాధించారు. మ‌న దేశ ఐకమ‌త్యం, సోద‌ర‌భావ బంధాల‌ను ఎల్ల‌ప్పుడూ ర‌క్షించడం ప‌ట్ల మ‌న నిబద్ధ‌త‌ను సైతం ఇవాళ పున‌రుద్ఘాటిస్తున్నాం.''

 

 

MJPS/SS/RT


(Release ID: 2045168) Visitor Counter : 59