కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్పామ్ కాల్స్ చేసే నమోదు కాని లేదా టెలిమార్కెటర్ల అన్ని టెలికాం వనరులను తొలగించాలని యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లకు ట్రాయ్ ఆదేశం
Posted On:
13 AUG 2024 3:42PM by PIB Hyderabad
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవాంఛిత (స్పామ్) ఫోన్ కాల్స్ బెడదను అరికట్టే దిశగా ‘భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) చొరవ చూపింది. ఈ మేరకు నమోదు కాని అన్ని కాల్స్ పంపిణీదారులు లేదా టెలీమార్కెటర్ల (యుటిఎమ్) నుంచి రికార్డ్ చేసినన లేదా కంప్యూటర్ ద్వారా సృష్టించిన లేదా ఇతర వాణిజ్య వాయిస్ కాల్స్ రూపంలో వెళ్లేవాటికి మార్గాలు మూసివేయాలని అన్ని యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇందుకోసం టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్-2018 (టిసిసిసిపిఆర్) కింద ‘ఎస్ఐపి/పిఆర్ఐ’ లేదా ఇతర టెలికాం వనరులను ఉపయోగించుకోవాలని సూచించింది.
ట్రాయ్ జారీచేసిన ఆదేశాలిలా ఉన్నాయి:
- నమోదుకాని పంపిణీదారు/టెలిమార్కెటర్ల నుంచి అన్ని వాణిజ్య వాయిస్ కాల్స్, టెలికాం సేవలు (ఎస్ఐపి/పిఆర్ఐ/ఇతర టెలికాం వనరుల వినియోగం ద్వారా) తక్షణమే నిలిపివేయాలి.
- ఏదైనా నమోదుకాని పంపిణీదారు/టెలిమార్కెటర్ (యూటీఎం) తన టెలికాం వనరులను (ఎస్ఐపీ/పిఆర్ఐ/ఇతర టెలికాం సేవల) నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య వాయిస్ కాల్స్ చేయడానికి దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తిస్తే, వ్యక్తికి కేటాయించిన ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వనరుల సూచికలపై వినియోగదారుల ఫిర్యాదులు వస్తాయి-
- స్పామ్ కాల్స్ పంపుతున్న వ్యక్తుల అన్ని టెలికాం సేవలను నియంత్రణ సంబంధిత 25వ నిబంధన ప్రకారం రెండేళ్లదాకా ప్రధాన యాక్సెస్ ప్రొవైడర్ (ఒఎపి) ద్వారా వేరు చేయాలి.
- అలా పంపిన వ్యక్తిని నిబంధనల ప్రకారం ‘ఒఎపి’ రెండేళ్ల వరకు బ్లాక్ లిస్ట్ లో ఉంచాలి.
- బ్లాక్ లిస్ట్ లో పెట్టడానికి సంబంధించిన సమాచారాన్ని ‘ఒఎపి’ ద్వారా ‘డిఎల్‌టి’ వేదికలోని ఇతర యాక్సెస్ ప్రొవైడర్లందరితో 24 గంటల్లోగా పంచుకోవాలి. వారు సదరు వ్యక్తికి ఇచ్చిన అన్ని టెలికాం వనరులను 24 గంటల్లోగా తొలగించాలి.
- నిబంధనలలో పేర్కొన్న విధంగా బ్లాక్‌లిస్ట్ లో ఉన్న కాలంలో సదరు స్పామ్ కాల్స్ పంపిణీదారుకు ఏ యాక్సెస్ ప్రొవైడర్ నుంచీ కొత్తగా టెలికాం సేవలు కేటాయించరు.
- నమోదుకాని పంపిణీదారు/టెలీమార్కెటర్లు (యుటిఎం) పౌరులకు వాణిజ్య వాయిస్ కాల్స్ చేయడం కోసం ‘ఎస్ఐపి/పిఆర్ఐ/ఇతర టెలికాం వనరులను ఉపయోగిస్తే ఈ ఆదేశాలు జారీ చేసిన నెలలోపు ‘డిఎల్‌టి’ వేదికకు తరలించబడతారు. ఆ తర్వాత 7 రోజుల్లోగా నిబంధనల అనుసరణ నివేదికను సమర్పించాలి;
యాక్సెస్ ప్రొవైడర్లందరూ ఈ ఆదేశాలను పాటించాలని, ప్రతి నెల 1, 16 తేదీల్లో తీసుకునే చర్యలపై క్రమం తప్పకుండా స్థితిగతుల సమాచారం సమర్పించాలని ట్రాయ్ ఆదేశించింది. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయాత్మక చర్యతో స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గి, వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.
***
(Release ID: 2045154)
Visitor Counter : 80